Publish Date:Sep 28, 2024
భాగ్యనగరంలో గోడలపై వాల్ పోస్టర్లు అంటించడాన్ని నిషేధిస్తూ గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ అమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేషేధం ఏమీ ఈరోజు విధించినది కాదు. ఎప్పుడో 2016 నుంచే భాగ్యనగరంలో గోడలపై వాల్ పోస్టర్లు, అడ్డర్టైజ్ మెంట్లు, పెయింటింగ్ లపై నిషేధం ఉంది. అయితే ఆ నిషేధాన్ని అమలు చేసే విషయంలో ఇప్పటి వరకూ ఎవరూ ఎటువంటి శ్రద్ధా పెట్టలేదు. ఇప్పుడు జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి నగరంలోని గోడలపై పోస్టర్లు, పెయింటింగ్ లు, అడ్డర్టైజ్ మెంట్లు కనిపించకూడదంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సినిమా పోస్టర్లు కూడా ఈ నిషేధం కిందకి వస్తాయి. ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జీహఎచ్ఎంసి కమిషనర్ అమ్రపాలి.. దీనిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
అంతే కాకుండా నిషేధాన్ని ఉల్లంఘించి నగరంలో గోడలపై వాల్ పోస్టర్లు అంటించినా, పెయింటింగ్ లు, అడ్డర్టైజ్ మెంట్లు కనిపించినా భారీ జరిమానా విధిస్తామని, ఈ మేరకు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, సినిమా ఎగ్జిబిటర్లకు అవగాహన కల్పించాల్సిందిగా అమ్రపాలి అధికారులను ఆదేశించారు. ఈ ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని, ఈ విషయాన్ని పోస్టర్ ప్రింటింగ్ ఏజెన్సీలకు నోటీసు ద్వారా తెలియజేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు కారణంగా నగరం అందవికారంగా అపరిశుభ్రంగా కనిపిస్తున్నది అనడం వాస్తవం. నగరంలోని గోడలపై పోస్టర్లు నిషేధించడాన్ని నగర వాసులు స్వాగతిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా పోస్టర్లను తొలగించి నగరం సుదరంగా కనిపించేలా చేయాలని కోరుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ban-on-wall-posters-in-hyderabad-39-185816.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.