ఒక‌టి ఒక‌టి ఒక‌టి అంటే వాచిపోద్ది.. టెన్త్ ఫలితాలపై విద్యాసంస్థల ప్రచారంపై బ్యాన్ .. నారాయణా

Publish Date:Jun 2, 2022

Advertisement

పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాక ఏ విద్యాసంస్థలూ మాకు ఇన్ని ర్యాంకులు వచ్చాయి. టెన్ ఆఫ్ టెన్ ఇంత మందికి వచ్చింది, అంత మందికి వచ్చింది అంటూ ప్రకటనలు ఇవ్వడం, ఫలితాలపై   ప్రచారం చేసుకోవడం,  నిషిద్ధమని, ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌   ఉత్తర్వులు జారీ చేశారు.  విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని చెప్పారు. టెన్త్ పరీక్షల ఫలితాల విడుదలలో గతంలో గ్రేడింగ్‌ విధానం ఉండేదని, 2020 మార్చి నుంచి మార్కులు ప్రకటించే విధానాన్ని పున:ప్రారంభించామని తెలిపారు. 

ఈ నేపథ్యంలో విద్యార్థులకు అత్యధిక మార్కులు రావడానికి తమ విద్యాసంస్థలే కారణమని విద్యా సంస్థలు, ట్యుటోరియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ప్రచారం చేసుకోవడానికి అనుమతి లేదన్నారు.అలాంటి ప్రచారం వల్ల విద్యార్థులపై విపరీతమైన ఒత్తిడి పడుతోందనీ, దాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు

. ఫలితాలను తమకనుకూలంగా ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వ పరీక్షల చట్టం 7ఏ ప్రకారం వీలు లేదన్నారు. ఎవరైనా ఉల్లంఘించి ప్రచారం చేసుకున్న, ప్రకటనలు విడుదల చేసినా  లక్ష జరిమానా, ఏడేళ్ల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.  కాగా నారాయణ విద్యాసంస్థలను దృష్టిలో ఉంచుకునే ఈ నిషేధం ఉత్తర్వులు జారీ చేశారని పరిశీలకలు అంటున్నారు. మాజీ మంత్రి నారాయణపై ఇటీవలి కేసులు, అరెస్టులతో చెలరేగిపోయిన సర్కార్ కు కోర్టులో ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యలో ఇప్పుడిలా విద్యాసంస్థల ప్రకటనలపై నిషేధం విధించిందని పేర్కొంటున్నారు.

By
en-us Political News

  
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.