బాలినేనికి వైసీపీ పొమ్మనలేక పొగ.. పార్టీలో ఆయన సీన్ అయిపోయిందా?

Publish Date:May 30, 2022

Advertisement

ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి  బాలినేని శ్రీనివాసరెడ్డికి వైసీపీలో పొమ్మనలేక పొగ పెడుతున్నారా అంటే ఆయన వర్గీయులే ఔనని చెబుతున్నారు. ఆ కారణంగానే బాలినేనిలో గతంలో ఉన్నంత ఊపు.. ఉత్సాహం.. కనిపించడం లేదంటున్నారు.   ఇటీవల వైయస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన మొక్కుబడిగా పాల్గొనడమే కాకుండా,  కొత్తపట్నం మండలంలోని అల్లూరులో  బాలినేని జనంపై బూతు పురాణంతో విరుచుకుపడటాన్ని బాలినేనిలో పెరిగిపోయిన ఫ్రస్ట్రేషన్ కు తార్కానంగా చూపుతున్నారు.  

బాలినేనిని  జగన్ కేబినెట్ నుంచి ఉద్వాసన పలకడానికి కారణాన్ని సైతం బాలినేని వర్గీయులు  ఆఫ్ ది రికార్డ్  సోదాహరణంగా వివరిస్తున్నారు. బాలినేని డైహార్ట్ ఫ్యాన్‌ అయిన సుబ్బారావు గుప్తాపై జరిగిన దాడి, అనంతర పరిణామాలతో బాలినేని అంటే నియోజకవర్గంలోని వైసీపీ క్యాడర్ లో భయాందోళలను చోటుచేసుకున్నాయనీ, దీంతో క్యాడర్ ఆయన దగ్గరకు రావడానికే జంకే పరిస్థితి ఏర్పడిందని, అందుకే జగన్ ఆయనను దూరం పెట్టాడనీ వారు చెబుతున్నారు.

అంతే కాకుండా వైసీపీ గౌరవాధ్యక్షురాలు, జగన్ తల్లి  విజయమ్మ,  జగన్ సోదరి షర్మిలతో బాలినేని బంధుత్వం కొనసాగించడం జగన్ ఫ్యామిలీలో అసంతృప్తికి కారణం అవ్వడం కూడా బాలినేని మంత్రి పదవికి ఎసరు రావడానికి కారణమని ఆయన వర్గీయులు చబుతున్నారు. దీంతో ఆయనకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలకడమే కాకుండా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరం పెట్టడం ద్వారా పొమ్మన లేక పొగబెట్టిన పరిస్థితిని పార్టీ తీసుకువచ్చిందని అంటున్నారు.

ఇందుకు ఉదాహరణగా  ఇటీవల జగన్ ఒంగోలు పర్యటన సందర్భంగా బాలినేనికి వేదికపై కనీసం స్థానం లేకపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇక తాజాగా ఒంగోలులో జరిగిన తెలుగుదేశం మహానాడు సక్సెస్ అవ్వడం కూడా ఆయనపై నెగటివ్ ప్రభావం పడేందుకు కారణమైందని బాలినేని వర్గీయులు అంటున్నారు. మొత్తం మీద వైసీపీలో బాలినేని సీన్ అయిపోయినట్లేనని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అక్టోబర్ 13న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే అవకాశం ఉందన్న వార్తలు రాజకీయ, జలవనరుల వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
జాతీయ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
శ్రీవారికి జైపూర్ దంపతులు రూ.51.55 లక్షల ఆభరణాల కానుక.!
గోల్డ్ కొనాలన్న ఆశ.. బిడ్డను కోల్పోయిన విషాదం.!
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యకు హైదరాబాద్‌లో భూమి పేరుతో మోసం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.
దేశ రాజధాని దిల్లీలో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.
కన్నవారిని చూడాలని.. స్వస్థలానికి చేరుకోవాలని ఎన్నో ఆశలతో రైలు ఎక్కిన ఓ యువతి ప్రయాణం విషాదాంతమైంది.
దేశ రాజధాని దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.