పంతం నెగ్గించుకున్న బాలినేని.. విజయం అంత వీజీ కాదు!

Publish Date:Jan 1, 2024

Advertisement

మొత్తానికి ఒంగోలులో సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది.   నేనెక్కడి వెళ్ళను ఒంగోలులోనే ఉంటా.. ఒంగోలు నుంచే పోటీ చేస్తా అంటూ ప్రకటనలు ఇస్తూ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఒక దశలో వచ్చేఎన్నికల్లో బాలినేనికి టికెట్ దక్కదని కూడా గట్టిగా వినిపించింది. వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు అభ్యర్థుల మార్పు పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును తప్పించి ఇక్కడ నుండి బాలినేనిని పోటీ చేయించాలని సీఎం జగన్ భావించారు. కానీ  బాలినేని మాత్రం ఒంగోలు నుండే పోటీ చేస్తా అని తనకు తానే టికెట్ ప్రకటించేసుకున్నారు. దీంతో ఆయన పార్టీని వీడడం లేదా వైసీపీ ఆయనకు సీటు కేటాయించకపోవడం జరుగుతుందని రాజకీయ వర్గాలు భావించాయి. బాలినేని కూడా జనసేన పార్టీతో టచ్ లోకి వెళ్లారని ప్రచారం జరిగింది. కానీ  బాలినేని పంతం ముందు జగన్ మోహన్ రెడ్డి మొండితనం ఓడిపోయింది. ఎంతైనా బంధువులు కదా ఏం చర్చించారో.. ఏం నిర్ణయించుకున్నారో కానీ ఫైనల్ గా ఒంగోలు బాలినేనిదేనని తేల్చేసినట్లు తెలుస్తున్నది.

   బాలినేని సీటు దక్కించుకునే విషయంలో తన పంతం అయితే నెగ్గించుకోగలిగారు కానీ,  ఈసారి ఇక్కడ గెలవడం మాత్రం అంత ఈజీ  కాదు. దానికి సవాలక్ష కారణాలున్నాయి. అందులో ఆయనకి ఆయన చేసుకున్నవి కొన్ని కాగా.. పార్టీ చేసినవి మరికొన్ని ఉన్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల‌ మంత్రిగా బాలినేని దాదాపు మూడేళ్ల పాటు ఉన్నారు. కానీ ఆ తర్వాత మంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆయనలొ అలక మొదలైంది. బాలినేని గత రెండున్నరేళ్లుగా చీటికి మాటికి పార్టీమీద అలగటం, సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పించడం, పరోక్షంగా జగన్ పైన కూడా వాగ్బాణాలు సంధించటం తెలిసిందే. సొంత పార్టీ నేతలే అరాచకాలు, అక్రమాలు చేస్తున్నారని ఆధారాలతో సహా బయటపెట్టారు. అయితే బాలినేని అలిగిన ప్రతిసారి జగన్ ఆయనను బుజ్జగించి సముదాయించారు.   కానీ  బాలినేని డిమాండ్లు మాత్రం పరిష్కారం కాలేదు. దీంతో అటు బాలినేని వర్గం సంతృప్తిగా లేదు.. బాలినేని చేష్టలతో ఆయన వ్యతిరేక వర్గం కూడా సంతృప్తిగా లేదు. రేపు ఈ రెండు వర్గాలు కలిసి పనిచేయడం దాదాపు అసంభవంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

బాలినేని ఆరోపించినట్లు జగన్ ప్రభుత్వంలో ఒంగోలులో అవినీతి, అక్రమాలు రాజ్యమేలాయి. ఇసుక దందాతో ఒక వర్గం కోట్లకు పడగలెత్తినట్లు ఆరోపణలున్నాయి. ఇతర దేశాలలో ఉంటూ ఇక్కడ ఆస్తులు కలిగి ఉన్నవారి కుటుంబాలను టార్గెట్ చేసి భారీ స్థాయిలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. స్వయంగా బాలినేనినే ఆధారాలతో సహా బయటపెట్టగా.. అప్పట్లో పోలీసులు పదిమందిని అరెస్ట్ చేశారు. అయితే, అసలు దొంగలు మాత్రం దర్జాగానే ఉన్నారు. ఇది పార్టీకి ఇక్కడ అతిపెద్ద మైనస్. అలాగే ఒంగోలు నగరంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. బాలినేని మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరుతో కాలం గడిపేశారు తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఆ మాటకొస్తే ప్రభుత్వం ఈ నియోజకవర్గానికి చేసిందేమీ  లేదు. దీంతో ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ తారస్థాయిలో ఉంది. దీనికి తోడు పార్టీలో వర్గపోరు. బాలినేని అంటేనే ఆయన వ్యతిరేక వర్గం మండిపడుతున్నారు. 

అదే సమయంలో తెలుగుదేశం అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఈ ఐదేళ్లలో నియోజకవర్గంపై  పట్టు బిగించారు. కొండెపి ఎస్సీ రిజర్వ్ కావడంతో ఒంగోలుకు వచ్చిన జనార్దన్ గత ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెట్టించారు. అంతకు ముందు ఇదే బాలినేని ఇక్కడ ఎమ్మెల్యే అయినా ఒంగోలు అభివృద్ధిని పట్టించుకోలేదు. కానీ జనార్దన్ వచ్చీ రాగానే నగర రూపురేఖలు మార్చేశారు. అప్పుడు ఆయన ఎక్కడ ఆపారో ఒంగోలు నగరం ఇప్పటికీ అక్కడే ఉంది. జనార్దన్ తోనే ఒంగోలు నగర అభివృద్ధి అనే  ముద్ర ప్రజలలో గట్టిగా పడింది.  దీంతో ప్రజలే ఆయనను ఓడించి తప్పు చేసినట్లు భావిస్తున్నారు. జనార్దన్ హయాంలో నియోజకవర్గం ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉంది అనేది   తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అటు సొంత పార్టీలో  బాలినేనికి పట్టు తగ్గడం, ప్రజలలో అసంతృప్తి, దామచర్లపై సానుభూతి కలిసి..ఈసారి ఒంగోలులో  బాలినేని గెలుపు అంత వీజీ కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.