బాలినేని.. మనిషొక చోట.. మనసొక చోట!

Publish Date:Oct 29, 2024

Advertisement

బాలినేని శ్రీనివాసరెడ్డి.. మాజీ మంత్రి, వైసీపీ మాజీ నాయకుడు. అన్నిటికీ మించి జగన్ కు సమీప బంధువు. ఆయన ఇప్పుడు ఆ పార్టీని వదిలేసి జనసేన గూటికి చేరారు. అయినా ఆయన మానసిక బంధం ఇంకా జగన్ తోనే అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారం (అక్టోబర్ 28) మీడియాతో మాట్లాడుతూ జగన్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి లైవ్ లో ఆయన పడిన ఇబ్బంది కళ్లకు కట్టినట్లు కనిపించింది. అలాగే తాను ప్రస్తుతం ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు అనుకూలంగా ఆయన నోటి వెంట వచ్చిన ప్రతి మాటా తడబడుతూనే వచ్చింది. మొత్తంగా షర్మిల, జగన్ మధ్య ఆస్తుల తగాదా విషయంపై మాట్లాడడానికి ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలినేని మాట్లాడిన మాటలు వింటే మనిషి జనసేనలోనూ మనసు వైసీపీతోనూ ఉందని పించేలా ఉన్నాయి. 

వాస్తవానికి ఆయన వైసీపీలో ఉన్న సమయంలో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం, జనసేన నేతలు, శ్రేణులపై సాగించిన దాష్టికాలు, దౌర్జన్యాలూ ఇన్నీ అన్నీ కావు. అందుకే ఆయన జనసేన గూటికి చేరుతున్న సమయంలో తెలుగుదేశం శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. జనసేన కార్యకర్తలూ ఆయనను మనస్ఫూర్తిగా ఆహ్వానించలేదు.  అయితే పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకోవడంతో గట్టిగా మాట్లాడలేకపోయారు. తెలుగుదేశం శ్రేణులూ మౌనం వహించాయి.

ఇక  సోమవారం (అక్టోబర్ 28) ఆయన మీడియా ముందు ఎలాంటి శషబిషలూ లేకుండానే తాను వైఎస్ఆర్ కుటుంబ శ్రేయోభిలాషినని చెప్పుకున్నారు. అంతే కాదు షర్మిల, జగన్ ల మధ్య ఆస్తుల వివాదంపై తన వైఖరి ఏదో స్పష్టంగా చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారు. జగన్ కు విమర్శిస్తూ ఒక్క మాట కూడా చెప్పడానికి ఆయన సిద్ధంగా లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలిసేలా ఆయన తీరు ఉంది. షర్మిలతో ఆస్తి వివాదంలో వైసీపీ చంద్రబాబు పేరు లాగడం కరెక్టు కాదు అన్న మాట కూడా ఆయన గట్టిగా చెప్పలేకపోయారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు మద్దతుగా ఆయన గట్టిగా ఒక్క ముక్క కూడా చెప్పలేకపోయారు. దీంతో  బాలినేనిపై తెలుగుదేశం, జనసేన శ్రేణులలో అనుమానాలు మరింత పెరిగాయి. ఆయన జనసేన గూటికి చేరడం వెనుక కూటమి ఐకమత్యాన్ని దెబ్బతీసే కుట్ర ఉందా అన్న సందేహాలు వారిలో వ్యక్తం అవుతున్నాయి.  

ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. ఎన్నికలలో వైసీపీ ఓటమికి ఈవీఎంలే కారణం అంటూ బాలినేని ఆరోపించడమే కాకుండా,  ఈవీఎంల వెరిఫికేషన్ చేయాలంటూ ఈసీని కోరారు. మొత్తంగా బాలినేని తాజా మీడియా మీట్ లో బాలినేనిలోని వైసీపీ అనుకూలత ప్రస్ఫుటంగా బయటపడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.