జగన్‌లో బాలయ్య టెన్షన్

Publish Date:Jun 24, 2023

Advertisement

ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నందమూరి ఫ్యామిలీకి కంచుకోట అన్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి ప్రముఖ నటుడు, తెలుగుదేశం నాయకుడు నందమూరి బాలకృష్ణ వరుసగా గెలుపొందుతున్నారు. అయితే ఆ నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడించేందుకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

అందులో భాగంగానే హిందూపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ జా దీపిక అనే మహిళను ఎంపిక చేసే ఆలోచనలో జగన్ ఉన్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.   జూన్ 21వ తేదీన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంపై సీఎం జగన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దీపికను సీఎం వైయస్ జగన్ ఆహ్వానించడం.. ఆమెకు  తొలి వరుసలో మహిళామంత్రుల పక్కనే కూర్చునే అవకాశం ఇవ్వడం, అందుకు సంబంధించిన వీడియోలు  అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో బాలయ్య ప్రత్యర్థి దీపికేనా అన్న చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.   హిందూపురం నియోజకవర్గంలో అగ్రనేతలు ఇక్బాల్, అగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్‌లను పక్కన పెట్టి మరీ దీపికను పిలవడంతో నియోజకవర్గంలో వైసీపీ రాజకీయం రసకందాయంలో పడిందనే  అంటున్నారు.

 కాగా హిందూపురంలో వైసీపీలో గ్రూపు రాజకీయాలకు కొదవే లేదు. అటువంటి గ్రూపుల్లోని   వ్యక్తిని కాకుండా.. ఎప్పుడూ ఎవరూ ఊహించని విధంగా  దీపికను  ఇలా ఒక్క సారిగా తెరపైకి తీసుకు రావడం వెనుక జగన్ ఆంతర్యం ఏమిటనే సందేహం స్థానిక నేతలను  ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. అయితే ఈ ఎపిసోడ్‌లో పార్టీ రాయలసీమ ఇన్‌చార్జ్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చక్రం తిప్పినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అదీకాక కర్ణాటక అసెంబ్లీకి ఇటీవలే ఎన్నికైన ఓ రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేతోపాటు  ఈ దీపిక.. తాజాగా సీఎం జగన్‌తో భేటీ అయినట్లుటాక్. అయితే దీపికకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన సీఎం జగన్.. తమకు  ఎందుకు ఇవ్వడం లేదని అటు నిశ్చల్ వర్గం, ఇటు ఇక్బాల్ వర్గం, మరోవైపు మధుమిత వర్గం గుర్రుగా ఉన్నాయని సమాచారం.    

మరోవైపు హిందూపురం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు... చేపడుతోన్నారు. ఆ క్రమంలో అన్నా క్యాంటీన్లు, ఆరోగ్య సంజీవినీ తదితర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు సైతం చేపట్టి.. ప్రజల మనస్సులు చూరగొని.. తనదైన శైలిలో ఆయన దూసుకు పోతున్నారు. గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో సైతం రాయలసీమలో తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలను కైవసం చేసుకొంది. అందులో హిందూపురం ఒకటి కావడం గమనార్హం. 

ఇంకోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. తన యువగళం పాదయాత్రను రాయలసీమ నుంచి ప్రారంభించారు. ఈ ప్రాంతంలో ఆయన నిర్వహించిన పాదయాత్రకు అక్కడ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిన విషయం విదితమే. అలాగే ఇటీవల తూర్పు, పశ్చిమ రాయలసీమల్లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక్లలో సైతం టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. అలాంటి వేళ టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాల కోసం సీఎం జగన్ అన్వేషణ చేపట్టారు. ఆ అన్వేషణలో భాగంగానే దీపికను బాలయ్యకు ప్రత్యర్థిగా ఎంపిక చేశారని అంటున్నారు.

By
en-us Political News

  
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.