వెన్నుపోటు వక్ర భాష్యానికి ఫుల్ స్టాప్ పెట్టిన బాలయ్య అన్ స్టాపబుల్ షో

Publish Date:Oct 15, 2022

Advertisement

అరచేతిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపలేరు. అలాగే, నిప్పులాంటి నిజాన్నిగుప్పిట పట్టి దాచలేరు. అందుకే పెద్దలు నిజం నిలకడ మీద తెలుస్తుందని అంటారు. కానీ, నిజం గడపదాటే లోగా, అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. అబద్ధాన్ని నిజం చేస్తుంది అదీ నిజమే.  అదీ పెద్దలు చెప్పిన మాటే.  అయితే, సత్యాన్వేషణ క్సోం జరిగే సంఘర్షణలో  అసత్యాన్నే నమ్ముకుని, రాజకీయం చేయాలనుకునే వారు, తాత్కాలికంగా కొంత పైచేయి సాధిస్తే సాధించవచ్చును కానీ, చివరకు సత్యమే జయిస్తుంది. సత్యమేవ జయతే.  అదే అంతిమ సత్యం.కానీ, ఈలోగా జరగకూడని అనర్ధం జరిగిపోతుంది. నిజం,నిలకడ మీద తెలిసినా మచ్చ మాత్రం అలాగే మిగిలి పోతుంది.  

తెలుగు దేశం పార్టీ చరిత్రలో, అలా మిగిలిన మచ్చే, ఆగస్టు  సంక్షోభం. నిజం, 1995లో తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన ఆగస్టు సంక్షోభానికి సంబంధించి ఇన్నేళ్ళుగా దుష్ప్రచారం జరుగుతూనే వుంది. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని,నిలబెట్టే పవిత్ర ఆశయంతో, నందమూరి తారక రామా రావు స్థాపించిన తెలుగు దేశం పార్టీని మొగ్గలోనే  తుంచేందుకు, దుష్ట శక్తులు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశాయి. నాదెండ్ల భాస్కర రావు (30 రోజుల ముఖ్యమంత్రి) కుముద్ బెన్ జోషీ (అప్పటి రాష్ట్ర గవర్నర్) ను పావులుగా, ప్రయోగించి తెలుగు దేశం పార్టీని,  ఎన్టీఆర్ ఆశయాలను రాజకీయంగా హత్యచేసేందుకు,రాజకీయ దుష్టశక్తులు చేసిన విఫల ప్రయత్నాలు చెరిపేస్తే చెరిగి పోయేవి కాదు. అవే దుష్ట శక్తులు లక్ష్మీ పార్వతి రూపంలో మరో ప్రయత్నం చేశాయి.

ఇది నిజం. నిజమైన చరిత్ర. అయితే, చరిత్రను వక్రీకరించిన, ఇప్పటికీ అదే ప్రయత్నం చేస్తున్న దుష్ట శక్తుల దుష్ట పన్నాగాలను, సమర్ధవంతంగా ఎదుర్కుని, పార్టీని, ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకుపోయేందుకు చంద్రబాబు చేసిన విరుగుడు యజ్ఞాన్ని  ‘వెన్నుపోటు’ గా చిత్రించిన, చరిత్రను వక్రీకరించే ప్రయత్నం ఈ రోజుకు కూడా జరుగుతూనే వుంది. అయితే, ఇప్పడు, ఆనాటి సంక్షోభానికి సూత్రదారులుగా, పాత్రదారులుగా అపవాదులు మోస్తున్న, ఎన్టీఅర్ నిజమైన వారసులు, చంద్రబాబు నాయుడు, నందమూరి బాల కృష్ణ నోరు విప్పారు. నిజాన్ని అవిష్కరించారు. ఇదుకు వేదికగా నిలిచింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవరిస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' సీజన్-2. సక్సెస్‘ఫుల్’గా సాగిన సీజన వన్, కొనసాగింపుగా మొదలైన 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే  సీజన్-2, ప్రేక్షకులలో సహజంగానే ఆసక్తిని పెంచింది.

అందులోనూ, బావా, బావ మరుదుల సంవాదం మధ్యలో బాలయ్యా  అల్లుడు, మేనల్లుడు లోకేష్ బాబు ఎంట్రీతో  రక్తికట్టించిన సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఆ ఆసక్తిని మరింతగా పెంచింది ఈ ప్రోమో విడుదలైన నాలుగు రోజుల్లోనే 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 7,996 కామెంట్లు లభించాయి. ఈ రియాల్టీ షోలో చంద్రబాబు తన వ్యక్తిగత, రాజకీయ విశేషాలను ఎలాంటి ముసుగులు లేకుండా అవిష్కరించారు. నిజానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు ఎప్పుడూ, ఎన్నడూ బయట పెట్టని కాలేజీ అల్లర్ల మొదలు, వైఎసార్ తో స్నేహం వరకు, అలిపిరి ఘటన తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లడం రాజకీయంగా తప్పయిందని అంగీకరించడం వరకు చాలా విషయాలను ప్రస్తావించారు. అయితే, ఈ అన్నిటినీ మించి రాష్ట్ర రాజకీయాల్లో మరీ ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ చరిత్రలో ఒక మలుపుగా మిగిలిన 1995 ఎపిసోడ్ కు సంబంధించి చంద్రబాబు నాయుడు, బాలయ్య బాబు  మనసు విప్పి మాట్లాడారు..

చంద్రబాబు నాయుడు తమ రాజకీయ జీవితంలో తీసుకున్న అతి పెద్ద నిర్ణయం గురించి, బాలయ్య  అడిగిన ప్రశ్నకు చంద్రబాబు  చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా ఆవిష్కరించారు.  1995 డెసిషన్‌. దీనికి ముందు వచ్చిన ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చాం. అధికారంలోకి వచ్చాం. అయితే.. దీనికి ముందే.. ఫ్యామిలీలో సమస్యలు వచ్చాయి. ఆ తర్వాత ఎమ్మెల్యేలంతా తిరుగుబాటు చేశారు. ఐదుగురు ఆ నిర్ణయం వెనుక సాక్ష్యంగా ఉన్నారు. ఐదుగురం కలిసి ఎన్టీఆర్‌ను కలి శాం. రాజకీయాలపై చర్చించాలని కోరాం. అప్పుడు వచ్చిన వారిలో ఇద్దరిని (హరికృష్ణ, బాలకృష్ణ) బయటకు పంపించాక. 3 గంటలు చర్చించారు.

నేను చాలా సేపు రిక్వెస్ట్‌ చేశాను.  మీటింగ్‌ పెట్టుకుందామన్నా. చివరకు కాళ్లు పట్టుకుని అడుక్కున్నా. మీరు ఒక్కటంటే ఒక్క  మీటింగ్‌ పెట్టి ధైర్యం ఇస్తే చాలండి.. ఇంకేం జరగదని చెప్పా. ఆయన వినలేదు. తర్వాత మీకు కూడా తెలిసిందే.  రామాంజనేయ యుద్ధమే జరిగింది. అది చరిత్ర. ఎన్టీఆర్‌తో ముందుకు వెళ్లాలనేది అందరి అభీష్టం. అయినా.. వ్యక్తి కన్నా.. ఆయన సిద్ధాంతాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో అందరం ముందుకువెళ్లాం. అప్పుడు ఆ సమయం లో మీరు (బాలయ్య) కూడా ఉన్నారు. అప్పుడు.. ఆ సమయం లో మనం తీసుకున్న నిర్ణయం తప్పా? బయట నుంచి వచ్చి న వ్యక్తి ప్రభావం ఆయనపై పెరిగింది. ఆయన అడిగింది ఎప్పుడూ కాదనలేదు. అనేక ప్రయత్నాలు విఫలమయ్యాకే.. ఈ ‘నిర్ణయం’ వచ్చింది. ఆ రెండు మూడు నెలలు.. మీరు ఎంత మథనపడ్డారు? ఆయనకు చాలా రకాలుగా చెప్పాం. ఆయనకు నమ్మినబంట్లుగా ఉన్నవారు కూడా చాలా సార్లు చెప్పారు” అంటూ ఆరోజు జరిగిన వాస్తవ చిత్రాన్ని అవిష్కరించారు.

ఆలాగే, ఆ రోజు తీసుకున్న నిర్ణయం తప్పా? అంటూ చంద్రబాబు నాయుడు, అడిగిన ప్రశ్నకు బాలయ్య   కాదని, స్పష్టంగా సమాధానం ఇచ్చారు. అంటే కాదు, బాలయ్య   నందమూరి కుటుంబ సభ్యుడిగా చెబుతున్నా. ఒక పార్టీ సభ్యుడిగా చెబుతున్నా. ఒక పౌరుడిగా చెబుతున్నా.1999 ఎన్నికలు అదే నిరూపించాయి. ఇవాల్టికీ ఆయన చరిత్రలో మిగిలారంటే.. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు  ఆయనకు ఇచ్చిన గౌరవమే కారణం అని స్పష్టం చేశారు.   తమిళనాడులో రామస్వామి నాయకర్‌ విషయంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఆయన ఓ 20 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అప్పటి వరకు ఉన్నవారు ఆయనతో విభేదించారు. తర్వాత,  ఆయన సిద్ధాంతాలను మాత్రం ముందుకు తీసుకువెళ్లారు. అదే ఎన్టీఆర్‌ చరిత్ర కూడా!!  ఇది.. మీ బిగ్‌ డెసిషన్‌ కాదు.. మన కుటుంబాల డెసిషన్‌.  ఇది అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం, అని చెప్పారు.  

అయితే, చరితను చరిత్రగా చూడలేని, కొందరు, ముఖ్యంగా తల్లికి చెల్లికి, వెన్నుపోటు పొడిచిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన భజన బృందం  ఇప్పటికీ నిజాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేదు. అయిత విచిత్రం ఏమంటే,  బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లు  అబద్ధాలలో పీహెచ్డీలు చేసిన వైసేపీ నేతలు లక్ష్మీ పార్వతిని, నాదెండ్ల భాస్కరరావు, దగ్గుబాటి వెంకటేశ్వర రావును, వారు రాసిన ‘పవిత్ర’ గ్రంధాలను ఉటంకిస్తున్నారు. అయితే, ఇప్పటికే 1999 ఎన్నికలు మొదలు ఇప్పటివరకు నిజం ఏమిటో ప్రజలే నిరూపించారు. మళ్ళీ మళ్ళీ నిరుపిస్తునే ఉంటారు. అందులో సందేహం లేదు.

By
en-us Political News

  
టి.సి. రాజన్ 1967లో స్వతంత్ర పార్టీ తరపున పలమనేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయాల్లో ఆయన తన సుదీర్ఘ సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ విప్‌లుగా నియమితులయ్యారు. అలాగే శాసనమండలిలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను విప్‌లుగా నియమించింది.
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు.
ప్రముఖ హీరోయిన్లను వివాదాల్లోకి లాగుతూ, వివాదాల్లోకి లాగుతూ వ్యక్తిగత విమర్శల దిగజారుతున్న తీరు తమిళనాట రాజకీయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. సీనియర్ హీరోయిన్లు త్రిష, నయనతార లను ఉద్దేశించి తమిళ రాజకీయ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాటే కాకుండా దేశ వ్యప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది.
రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని నిర్మూలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అలాంటిది పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం క్షమించరాని నేరమన్నారు. యువ నాయకుడు, మంచి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడన్న ఉద్దేశంతో అవకాశం ఇస్తే, పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చారంటూ పుట్టా మహేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఓ వైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి, మరో వైపు అన్నాడీఎంకే, బీజేపీ కూటములు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండు కూటములతో పాటు టీవీకే అధినేత విజయ్ సీఎం సీటుపై కన్నేశారు.ఇప్పటికే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టు గడపతొక్కడంతో ఈ విషయం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో సైతతం హాట్ టాపిక్‌గా నిలిచింది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.
ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.