బాల బాబాయ్.. తారకరత్న పిలుపు తలచుకుని కన్నీరు పెట్టిన బాలయ్య

Publish Date:Feb 18, 2023

Advertisement

నందమూరి తారకరత్న మరణం నందమూరి కుటుంబీకులు, ఆ కుటుంబ అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు, తెలుగుసినీ పరిశ్రమలోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఆరోగ్యంగా తిరిగి వస్తాడని ఎంతో ఆశతో ఎదురు చూసిన వారందరూ ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయారు. తారకరత్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరౌతున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ.. బాల బాబాయ్ అంటూ అప్యాయంగా పిలిచేవాడని తలచుకుని తలచుకుని కన్నీరు పెడుతున్నారు. ఆ పిలుపు ఇక వినబడదన్నఊహే తట్టుకోలేకపోతున్నానని బాలయ్య అన్నారు.

తారకరత్న మరణం తమ కుటుంబానికీ, తెలుగుదేశం ఫ్యామిలీకి తీరని లోటని పేర్కొన్నారు. నటుడిగా తనను తాను నిరూపించుకున్నతారకరత్న.. రాజకీయాలలోనూ తనదైన ముద్ర వేసేందుకు సమాయత్తమౌతున్న తరుణంలో గుండెపోటుకు గురై తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం బాధాకరమన్నారు. గుండెపోటుకు గురై మూడు వారాలకు పైగా మృత్యువుతో అలుపెరుగని పోరాటం చేసిన యోధుడని అన్నారు.  మృత్యుంజయుడై తిరిగి వస్తాడని ఆశించిన తమనందరినీ శోక సంద్రంలో ముంచేశాడని విలపించారు. తారకరత్న ప్రేమ, అనురాగం ఎప్పటికీ మనతోనే ఉంటాయని ఆయన మరో బాబాయ్ నందమూరి రామకృష్ణ అన్నారు. 

తారకరత్న మృతి పట్ల తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎప్పుడు కలిసినా బావా అంటూ ఆప్యాయంగా పలుకరించే వారని గుర్తు చేసుకున్నారు. బావా అన్న పిలుపు తారకరత్న నోటి వెంట ఇక వినపడదన్న ఊహే తట్టుకోలేకపోతున్నానని లోకేష్ పేర్కొన్నారు.  నేనున్నానంటూ నా వెంట న‌డిచిన ఆ అడుగులు ఆగిపోయాయంటే నమ్మశక్యం కావడం లేదన్నారు. తెలుగుదేశం యువ‌తేజం తార‌క‌ర‌త్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీర‌ని లోటుని లోకేష్ పేర్కొన్నారు. తారకరత్న నిష్క‌ల్మ‌ష‌మైన  ప్రేమ‌, స్నేహ బంధం   ఎప్పుడూ తన హృదయంలో సజీవంగా ఉంటాయనీ పేర్కొంటూ, తారకరత్నతో ఉన్న ఫొటోను ట్వీట్ చేస్తూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. 
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తారకరత్న మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను' అని చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. శనివారం రాత్రి బెంగళూరు హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన తారకరత్న భౌతిక కాయాన్ని ఆదివారం (ఫిబ్రవరి 19) ఉదయం ఆ  మోకిలలోని ఆయన నివాసానికి తరలించారు. సోమవారం ఉదయం నుంచీ ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్ధం ఫిలింఛాంబర్ లో ఉంచుతారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో అంత్యక్రియలు నిర్వహిస్తారు.  

By
en-us Political News

  
ఆకలి వేస్తే అన్నం పెట్టే విశాల హృదయం మనది.. దాహమేస్తే గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడం మన సంస్కృతి.
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
భారత దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను రచిస్తున్నాయి.
న్నబిడ్డలకు కడుపునిండా అన్నం పెట్టలేని నిస్సహాయత.. కనీస అవసరాలు తీర్చలేని దుర్భర పరిస్థితి.
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సైబర్ భద్రతా రంగంలో తీవ్ర కలకలం రేపిన ఒక పెద్ద ఉదంతాన్ని ఎదుర్కొంది.
24 ఏళ్లకే అద్భుత ఆవిష్కరణ.. డేటా స్టోరేజ్‌ రంగంలో యువతి సంచలనం.!
ఉద్యోగ వేటలో విజయం సాధించి తొలిసారి కొలువులో అడుగుపెట్టే యువతకు కేంద్ర ప్రభుత్వం నుంచి అండగా నిలిచేలా సరికొత్త వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సోషల్ మీడియా మోజు ఎంతలా పెరిగిపోయిందంటే.. కొందరు కనీస మానవీయ విలువలను, కన్నబిడ్డల భద్రతను కూడా విస్మరిస్తున్నారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.