బలగం సింగర్ మొగులయ్యా ఆరోగ్యం విషమం
Publish Date:Apr 11, 2023
Advertisement
చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ అందుకున్న మూవీ బలగం ఇంత పెద్ద హిట్ కావడానికి ప్రధాన కారణాలలో ఒకటి క్లైమాక్స్ లో వచ్చే పాట అనడంలో సందేహం లేదు. ఈ పాటను పాడింది బుడగ జంగాల కళాకారుల పాట. సినిమాలో ఈ పాట పాడినది ఆ బుడగ జంగాల కళాకారుడైన పస్తం మొగిలయ్య, కొమురమ్మ. ఈపాటతో వారిరువురికీ మంచి గుర్తింపు రావడమే కాకుండా.. సినిమా సక్సెస్ కు కూడా ప్రధాన కారణమయ్యారు. ఇప్పుడీ ప్రస్తావన అంతా ఎందుకంటే బలగంలో క్లైమాక్స్ పాటను అద్భుతంగా పాడిన మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది. గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడున్న మొగిలయ్య ఇటీవలే వరంగల్ సంరక్ష ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. మంగళవారం (ఏప్రిల్11) ఆయనకు డయాలసిస్ చేస్తుండగా గుండెపోటు రావడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో మొగిలయ్యను హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు. మొగిలయ్యకు వైద్య సేవలందించే విషయంలో ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన భార్య భార్య కొమురమ్మ వేడుతున్నారు.
http://www.teluguone.com/news/content/balagam-singer-health-conditon-serious-25-153657.html





