యోగా గురువుకు మాయరోగం
Publish Date:Jan 24, 2015
Advertisement
ఈమధ్య గురువులకు మాయరోగాలు వచ్చి రకరకాల సెకలు పోయి దొరికిపోతున్నారు. ఇండియాలో వున్న చాలామంది గురువుల పరిస్థితి ఇలా వుందని బాధపడుతుంటే, ఇతర దేశాలలో వుండే గురువులకు కూడా ఇదే మాయరోగం పట్టుకుంది. ఆస్ట్రేలియాలోని మౌంట్ ఏలియా ప్రాంతానికి చెందిన రస్సెల్ క్రుక్‌మాన్ అనే ఒక 72 సంవత్సరాల వయసున్న ముసలాయన యోగా గురువు. ఆస్ట్రేలియావాసులకు ఎప్పటి నుంచో యోగాసనాలు నేర్పుతున్నాడు. స్వామి శంకరానంద అని పేరు మార్చుకున్న ఇతగాడు ఆస్ట్రేలియాలో తన పేరుతోనే ఒక యోగా కేంద్రాన్ని కూడా స్థాపించాడు. పళ్ళూడిపోయే వయసులో వున్న ముసలాయన కావడంతో ఈయన మీద ‘నమ్మకం’తో చాలామంది మహిళలు యోగా నేర్చుకోవాలని వచ్చేవారు. అయితే ఈ మధ్యకాలంలో ఒక బాంబులాంటి విషయం బయటపడింది. ఈ ముసలి యోగా గురు తన దగ్గరకి యోగా నేర్చుకోవడానికి వచ్చిన చాలామంది అమ్మాయిలను ముగ్గులోకి దించి వాళ్ళతో ‘భోగం’ అనుభవించేశాడట. ఈ విషయం బయటపడిపోవడంతో ఇక చేసేదేమీ లేక ఆయనగారే తాను చేసిన తప్పులని ఒప్పుకున్నాడు. తన దగ్గరకి వచ్చే మహిళలకు తాంత్రిక విద్యలు వస్తాయని నమ్మించి తనతో శారీరకంగా కలిసేలా ప్రేరేపించాలనని ఈ ముసలాయన వెల్లడించాడు. ఇప్పటి వరకు 40 మందికి పైగా యువతులు తన మాయలోపడిపోయారని చెప్పాడు. ఒక పవిత్రమైన స్థానంలో వుండి ఇలాంటి పని చేసినందుకు తనను క్షమించాలని వేడుకున్నాడు. ఆస్ట్రేలియా పోలీసులు ప్రస్తుతం ఈ ముసలాయన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/bad-yoga-guru-32-42460.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్‌లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్‌లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.





