అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఎదురుదెబ్బ.. జన్మతహ: పౌరసత్వ హక్కు రద్దుపై కోర్టు స్టే

Publish Date:Jan 23, 2025

Advertisement

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 20న ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసీ చేయడంతోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందు వెనుకలు ఆలోచించకుండా..  సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా.. నా మాటే వేదం, నా ఆజ్ణే శిలాశాసనం అన్నట్లుగా ఏకపక్షంగా ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేసేశారు.

అలా తీసుకున్న నిర్ణయాలలో అమెరికాలో జన్మతహ వచ్చే పౌరసత్వ హక్కు రద్దు ఒకటి.  ఈ నిర్ణయాన్ని అమెరికాలోని వివిధ రాష్ట్రాల గవర్నర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.  వారి పిటిషన్లను విచారించిన అమెరికాలోని సియాటిల్ ఫెడరల్ కోర్టు  జన్మతహ వచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై స్టే విధించింది. కీఈ సందర్భంగా న్యాయమూర్తి ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు.  వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఆదేశాలపై స్టే విధించారు. 

 ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 78 ఫైళ్లపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. వాటిలో  వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వాన్ని రద్దు ఒకటి. ఇది తొందరపాటు నిర్ణయమన్న విమర్శలు వెల్లువెత్తాయి.  ట్రంప్ నిర్ణయాన్ని వాషింగ్టన్, ఇల్లినాయిస్, ఓరెగాస్, అరిజోనా రాష్ట్రాలు సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించాయి.  అమెరికా రాజ్యంగంలోని 14వ సవరణ ప్రకారం పౌరసత్వ చట్టం నిబంధలనకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని పేర్కొన్నాయి.  దీంతో సియాటిల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జ్‌ జాన్‌ కాఫ్నర్‌.. జన్మతః పౌరసత్వ రద్దు కార్యనిర్వాహక ఆదేశాలపై స్టే ఇచ్చారు.   

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బ‌లోపేతం, స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.