ఇక కేసీఆర్ ఫోకస్ మొత్తం మునుగోడుపైనే!

Publish Date:Oct 20, 2022

Advertisement

దాదాపు తొమ్మిది పది రోజుల పాటు తెలంగాణను పట్టించుకోకుండా, మునుగోడు ఎన్నికల ఊసే ఎత్తకుండా హస్తినలో బసచేసి కాలం గడిపేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. వెంటనే మునుగోడు ఉప ఎన్నికపై దృష్టి సారించారు. జాతీయ పార్టీ ప్రకటన తరువాత తొలి సారిగా హస్తిన వెళ్లిన కేసీఆర్ ఆక్కడ ఏం చేశారో? అన్ని రోజుల పాటు ఎందుకు మకాం వేశారో.. తెరస శ్రేణులకే కాదు ఎవరికీ అర్ధం కాని పరిస్థితి.

అసలు ముందుగా షెడ్యూల్ లో లేని హస్తిన పర్యటన ఎందుకు తెరమీదకు వచ్చిందో కూడా గోప్యంగానే ఉంచారు. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ అంత్యక్రియల కోసం అని యూపీ వెళ్లిన కేసీఆర్ అటు నుంచి అటే హస్తిన బాట పట్టారు. జాతీయ రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేసేందుకు అక్కడ భేటీలు జరుపుతారనీ, జాతీయ మీడియాకు బీఆర్ఎస్ లక్ష్యలు, అజెండా వివరిస్తారనీ అంతా భావించారు. కానీ కేసీఆర్ ఆసలు హస్తినకు ఎందుకు వెళ్లారు.. వెళ్లారు సరే.. అక్కడ అన్ని రోజులు ఎందుకు ఉన్నారు... ఉన్నారు సరే ఏం చేశారు.. అన్న ప్రశ్నలు వేటికీ సమాధానం లేదు. సరే హఠాత్తుగా పర్యటన ముగించుకుని వచ్చేశారు. వచ్చిన తరువాత అంతా చెప్పే మాట కేసీఆర్ హస్తిన వెళ్లారు.. వచ్చారు అనే.. కేసీఆర్ ఎంత హఠాత్తుగా ఢిల్లీ వెళ్లారో.. అంతే సడెన్‌గా హైదరాబాద్ తిరిగి వచ్చారు.  

వచ్చీ రావడంతోనే అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ నేతలు, అధికారులతో సమావేశమై మునుగోడు  ఉప ఎన్నికపై చర్చించారు.  కారును పోలిన గుర్తులు ఇతరులకు కేటాయించవద్దని టీఆర్ఎస్ పదే పదే విజ్ఞప్తి చేసినా ఎన్నికల సంఘం పట్టంచుకోలేదు.  ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతంలో మంజూరు అయిన గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించినా  ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పంపిణీ చేయవద్దని ఈసీ ఆదేశించింది.   ఈసీ తీరుపై న్యాయపోరాటం చేయాలా లేక ప్రజల్లోకి వెళ్లాలా అన్నదానిపై పార్టీ నేతలతో విస్తృతంగా చర్చించారు.  ఇక అన్ని విషయాలూ పక్కన పెట్టి మునుగోడుపైనే పూర్తిగా దృష్టి సారించాలని పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఫోకస్ మొత్తం మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంపైనే ఉండాలని ఆదేశించారు.

తానూ స్వయంగా ప్రచార రంగంలోనికి దిగుతానని కేసీఆర్ చెప్పినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. మూడు రోజుల పాటు మునుగోడులో కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేయడానికి ప్రణాళిక రూపిందించినట్లు చెబుతున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీలలో కేసీఆర్ మునుగోడులో బస్సు యాత్ర, రోడ్ షోలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే 30వ తేదీన చుండూరులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.

ఇక గురువారం నుంచి మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పూర్తిగా మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో నిమగ్నం కానున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. అలాగే ఈ నెల 25 నుంచి తెరాస కీలక నేతలు మునుగోడులోనే మకాం వేయనున్నారు. ఈ మొత్తం ప్రచార పర్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తారు. అంతే కాకుండా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ స్వయంగా ఒక గ్రామానికి ఇన్ చార్జి అన్న విషయం తెలిసిందే. 

By
en-us Political News

  
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.