బాబూస్ మొగ్గు బాబు వైపే!

Publish Date:Jun 6, 2023

Advertisement

జనం మొగ్గు ఎటువైపు ఉంది.. ఏ పార్టీ పట్ల జనంలో అభిమానం మెండుగా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సర్కార్ వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ గద్దె ఎక్కుతుందా? లేక పరాజయం పాలై  అధికారం కోల్పోతుందా వంటి ప్రశ్నలకు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే సర్వేల మీద ఆధారడుతుంది. అయితే జనం మూడ్ ఏమిటన్నది తెలుసుకోవడానికి ఎలాంటి సర్వేలూ అవసరం లేదు.  వచ్చే ఎన్నికలలో విజయం సాధించే పార్టీ ఏది? పరాజయం పాలయ్యే పార్టీ ఏది అన్న విషయం అందరికంటే ముందే పసిగట్టేసే బ్యాచ్ ఒకటి ప్రతి రాష్ట్రంలోనూ ఉంటుంది.  ఆ బ్యాచే ఐఏఎస్ ల బ్యాచ్.  రాజకీయ పరిభాషలో వారే బాబూస్.

 అధికారంలో ఉన్న పార్టీ వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందో లేదో వాళ్లు ఇట్టే పసిగట్టేయగలరు.  ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం మరో సారి గద్దె నెక్కే పరిస్థితి లేదని పసిగట్టిన వెంటనే వారి విధేయతలు మారిపోతాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో  అధినేతలు చెప్పినట్లు నడుచుకుంటూనే వచ్చే ఎన్నికలలో విజయం సాధించి గద్దెనెక్కే పార్టీ నాయకుడితో సత్సంబంధాలు నెరపడం మొదలు పెట్టేస్తారు.  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారుల తీరు గమనిస్తే రాబోయే ప్రభుత్వం ఎవరిదన్నది ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది.

నాలుగేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు అడుగులకు మడుగులొత్తిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పుడు సాధ్యమైనంతగా ప్రభుత్వానికి దూరం జరుగుతున్నారు. ఇంత కాలం చూసి రమ్మంటే కాల్చి వచ్చిన చందంగా ప్రభుత్వం ఇంత చెప్తే అంత చేసి విపక్షాన్ని చీకాకు పెట్టేందుకు మాత్రమే తమ అధికారాన్ని వాడిన అధికారులంతా.. ఇప్పుడు విపక్ష నేత కరుణా కటాక్ష వీక్షణాల కోసం పడిగాపులు కాస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నాలుగేళ్లుగా జగన్ కరుణా కటాక్షాల కోసం పరిధి దాటి మరీ పనులు చేసిన కొందరు అధికారులు ఇప్పుడు చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నారని తెలుస్తే చాలు.. గప్ చిప్ గా తెలంగాణ రాజధానికి చేరుకుంటున్నారు. రహస్యంగా ఆయనతో భేటీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నాలుగేళ్లలో తాము వ్యవహరించిన తీరుకు క్షమాపణలకు కోరుకోవడమే కాదు.. అలా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందో వివరణ కూడా ఇస్తున్నారు.

జగన్ సర్కార్ ఒత్తిడితోనే తాము  తెలుగుదేవం పార్టీకి వ్యతిరేకంగా  పని చేయాల్సి వచ్చిందని చెప్పుకుంటున్నారు.   బరితెగించి మరీ ఇంత కాలం జగన్ కు భజన చేసిన అధికారులే ఇప్పడు బాబు ప్రాపకం కోసం వెంపర్లాడుతున్నారు. ఈ తీరే ఏపీలో మారిన రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోంది.  చంద్ర‌బాబు రాష్ట్ర‌వ్యాప్త ప‌ర్య‌ట‌న‌లు స‌క్సెస్ కావ‌డం, అదే సమయంలో సీఎం జగన్ సహా, వైసీపీ చేపట్టిన కార్యక్రమాలపై జనం విముఖత చూపుతుండటం.. జగన్ సభల నుంచే జనం పారారౌతున్న పరిస్థితి,  గడపగడపకు లో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజా నిరసన ఎదురు అవుతుండటంతో  అధికారులకు విషయం అర్ధమైపోయింది.   తెలుగుదేశం, జనసేన పొత్తు ఖరారు అన్నది నిర్ధారణ అయిపోవడంతో జగన్ కు ఒక్క చాన్సే లాస్ట్ చాన్స్ అనీ మరో చాన్స్ అసాధ్యం అనీ స్పష్టత వచ్చేసింది. దీంతో వచ్చేది తెలుగుదేశం సర్కారేనని నిర్ధారించుకున్న బాబూస్ ప్లేట్ ఫిరాయించేందుకు రెడీ అవుతున్నారు.

నిబంధనల మేరకు నడుచుకున్న అధికారులు యథావిథిగా తమ ఉద్యోగ ధర్మం తాము నిర్వర్తిస్తుంటే.. పరిధి దాటి ఎక్స్ ట్రాలు చేసిన వారు మాత్రం ఇప్పడు గాభరా పడుతున్నారు. వచ్చే ప్రభుత్వం తమపై చర్యలు తీసుకోవడం ఖాయమని భయపడుతున్నారు. అందుకే ముందుగానే తమ ఎక్స్ ట్రాలకు కారణాలను చంద్రబాబుకు వివరణ ఇచ్చుకుని కొంచెం సేఫ్ జోన్ లోకి వెళ్లేందుకు  తాపత్రేయ పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు హైద‌రాబాద్లో చంద్ర‌బాబుని ర‌హ‌స్యంగా కలిశారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్ర‌భుత్వ  ఆదేశాల‌తో తాము అడ్డ‌గోలు నిర్ణ‌యాలు తీసుకోక త‌ప్ప‌డంలేద‌ని చంద్రబాబు ముందు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారని అంటున్నారు.   తెలుగుదేశం ప్ర‌భుత్వంలో తాము నిర్వర్తించిన విధులు, తమ ప్రతిభను  గుర్తు చేస్తూ  గత నాలుగేళ్లుగా తమ పనితీరు అధ్వానంగా ఉండటానికి కారణం జగన్ సర్కార్ అసమర్థతా, అనుచిత ఒత్తిడే కారణమని వివరణ ఇచ్చుకుంటున్నారు.  

అలాగే తెలుగుదేశం పార్టీలోనే  కొనసాగుతూ.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మొహం చాటేసిన సీనియర్ నేతలు కూడా ఇప్పుడు మళ్లీ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేందుకు అడుగులు కదుపుతున్నారు.   అవకాశం దొరికితే చంద్రబాబును కలిసి తాము ఇంత కాలం ఒకింత సైలెన్స్ మెయిన్ టైన్ చేయడానికి కారణాలను చెప్పుకుని మళ్లీ పార్టీలో పూర్వపు స్థానాన్ని పదిలపరుచుకోవడానికి ప్రయత్నాలు ఆరంభించేశారు. వీలైతే చంద్రబాబును, కుదరకపోతే లోకేష్ ను కలిసి  తాము ఇక‌పై యాక్టివ్ గా ఉంటామ‌ని న‌మ్మ‌బ‌లుకుతున్నారు.

మరీ ముఖ్యంగా యువగళం పాదయాత్రలో వారు చురుకుగా కనిపిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా లోకేష్ తో కలిసి అడుగులు వేస్తున్నారు. ఇప్పడు నారా లోకేష్ పాదయాత్ర వారికి తమ పలుకుబడిని ప్రదర్వించేందుకు ఒక అవకాశంగా లభించిదని భావిస్తున్నారు. అలాగే వివిధ కారణాల వల్ల  పార్టీ మారిన వారు మళ్లీ తెలుగుదేశం గూటికి చేరేందుకు తమదైన శైలిలో, స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించేశారు.  

By
en-us Political News

  
జగన్ సర్కార్ లో ప్రభుత్వ అధికారుల పాత్ర కంటే సలహాదారుల ప్రాధాన్యతే ఎక్కువ అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మంది సలహాదారులున్నా.. వారందరిలోనూ సజ్జల పాత్ర, ప్రాధాన్యత ప్రత్యేకం. ఆయన కేవలం సలహాదారుగా మాత్రమే కాదు.. సకల శాఖల మంత్రి కూడా ఆయనే.
బీజేపీతో రహస్య బందంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ లు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ ఈ విమర్శల పర్వం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత ఈ ఆరోపణల పర్వం మరింత జోరందుకుంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం (ఏప్రిల్ 19) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఏడు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
ఈ ఫోన్ ట్యాపింగ్ పిశాచాల పిండాలు పిచ్చుకలకు వేసినా పాపం లేదు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నామినేషన్ దాఖలు సందర్భంగా మంగళగిరిలో పండుగ వాతావరణం కనిపించింది. నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి మంగళిగిరి నియోజకవర్గం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలు ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చారు.
ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికల ప్రక్రియలో గురువారం (ఏప్రిల్ 18) కీలకఅంకం ప్రారంభం అయ్యింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఉదయం 9 గంటలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల అవ్వగా, ఆ క్షణం నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం అయ్యింది.
కాంగ్రెస్ సహా పలు పార్టీలను కుటుంబ పార్టీలని తరచూ విమర్శించే మోడీ.. ఇప్పుడు బీజేపీలో పార్టీ కంటే ఎదిగిపోయిన నేతగా తనను తాను ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ ఇప్పుడు మోడీ అనే గొడుగు కింద సేదతీరుతోందా అన్న భావన కలిగేలా పార్టీలో మోడీ భజన సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఈ సారి సినీ కళ పెద్దగా కనిపించడం లేదు. మొత్తంగా ఏపీ ఎన్నికల ప్రచారానికి సినీ పరిశ్రమ ఒకింత దూరంగా ఉంది. పరిశ్రమకు చెందిన అతితక్కువ మంది మాత్రమే తమ మద్దతు ఎటువైపు అన్నది చెబుతున్నారు.
దేశంలో వేసవిని మించి పొలిటికల్ హీట్ ఉంది. దేశంలో ఏడు విడతల్లో సాగే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి దశ పోలింగ్ జరగనుంది. తొలిదశలో మొత్తం 102 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు.
విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని రారాజు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆయన ఫామ్ బ్రహ్మాండంగా ఉన్నప్పటకీ స్ట్రైక్ రేట్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో బెంగళూరు ఓపెనర్ గా ఆడుతున్న కోహ్లీ పరుగులు ధారాళంగా చేస్తున్నప్పటికీ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందన్న విమర్శలు సొంత జట్లు అభిమానుల నుంచే వెల్లువెత్తుతున్నాయి.
బీఆర్ఎస్ నుంచి వలసల పర్వం కొనసాగుతోంది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల వేళ ఆ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. పార్టీ అగ్రనాయకత్వం ఎంతగా ప్రయత్నించినా పార్టీ నుంచి వలసలను ఆపడంలో విఫలమౌతున్నది.
తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల నోటిఫికేష్ వెలువడింది. సార్వత్రిక ఎన్నికలు ఏడు దశలలో జరగనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై రాయి దాడి ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. రాయిదాడి కేసులో నిందితుల‌ను గుర్తించేందుకు పోలీసులు ద‌ర్యాప్తును వేగ‌వంతం చేశారు. ఈ క్ర‌మంలో ప‌లువురు మైన‌ర్ల‌ను, యువ‌కుల‌ను అదుపులోకి తీసుకొని ర‌హ‌స్య ప్రాంతంలో విచారిస్తున్నారు. అయితే, జ‌గ‌న్‌పై రాయిదాడి ఘ‌ట‌న‌ను వైసీపీ రాజ‌కీయం చేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.