బాధితుల మధ్య బాబు.. తాడేపల్లి ప్యాలస్ లో జగన్

Publish Date:Jul 21, 2022

Advertisement

నాయకుడంటే ఎలా ఉండాలి? కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానంటూ భరోసా ఇవ్వాలి.. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వారి మధ్యన నిలవాలి.. వారి కష్టాలను స్వయంగా వినాలి.. చేతనైనంత సాయం సాయం చేయాలి.. లేదంటే కనీసం కాస్త ఓదార్పు అయినా ఇవ్వాలి.. ఇవి కదా నాయకుడనిపించుకోవాల్సినవాడు చేయాల్సిన పనులు..? ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందే ఉంటారనడంలో సందేహమే లేదు. రాష్ట్రంలోని ప్రజలకు ఎప్పుడు ఎలాంటి కష్టం ఎదురైనా ముందుగా పరుగెత్తుకుని వెళ్లి అండగా నిలుస్తుండడం చంద్రబాబు నైజం.

మరి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి అధికారాన్ని కట్టబెట్టిన ఆంధ్ర ప్రజలకు సీఎం జగన్ రెడ్డి చేస్తున్నదేంటి? ఒక్కసారి అవకాశం ఇవ్వండని గత ఎన్నికలకు ముందు అమ్మా, అయ్యా, అవ్వా, తాత, అన్నా, తమ్ముడు, అక్కా చెల్లెమ్మల ముందు ప్రాధేయపడిన జగన్ ఏపీ ప్రజలకు ఇప్పుడు వచ్చిపడిన భారీ వరద కష్టం సమయంలో చేస్తున్నదేంటి? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ వస్తోంది. అటు చంద్రబాబు- ఇటు జగన్ మధ్య ఉన్న తేడా గురించి బేరీజు వేసుకుంటున్నారు.

ఏపీలో 1986లో వచ్చిన అతి భారీ వరదల తర్వాత ఇంచుమించు అంతే స్థాయిలో మళ్లీ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వందలాది లంక గ్రామాలను ముంచెత్తింది. వరద తీవ్రత తగ్గుముఖం పట్టినా ఇప్పటికీ ఇంకా  అనేక లంక గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. గ్రామంలో ఉండే వీలు లేక, సర్వం కోల్పోయిన స్థితిలో తినేందుకు తిండి లేక, తాగేందుకు నీరు లేక అల్లాడిపోతున్న తమకు అరకొరగా ఆహారం సరఫరా చేసి చేతులు దులుపుకున్న జగన్ సర్కార్ తీరును వరద బాధితులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఇంకో పక్కన వెళ్లేందుకు ఇప్పటికీ సరైన దారీ తెన్నూ లేని వరద ముంపు లంక గ్రామాల్లో స్వయంగా పర్యటించి, బాధితులను పరామర్శించేందుకు, వారికి అండగా నిలిచేందుకు  టీడీపీ జాతీయ అధ్యక్షుడు హుటాహుటిన ఉభయ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాల పర్యటకు రావడాన్ని   బాధితులు  స్వాగతిస్తున్నారు. జగన్ తీరును చంద్రబాబు తీరుతో బేరీజు వేసుకుంటున్నారు.  వరద బాధిత ప్రాంతాల్లో బాధితులకు సహాయ సహకారాలు అందించాలని ఇప్పటికే టీడీపీ శ్రేణులను పురమాయించిన చంద్రబాబు, అక్కడితో ఆగకుండా  తానే స్వయంగా బాధితుల మధ్యకు వెళ్ళడం గమనార్హం.

 చంద్రబాబు కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తొలిరోజు లంక గ్రామాల పర్యటనలో భాగంగా సిద్ధాంతం నుంచి కరుగోరుమిల్లి చేరుకుని బాధితులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి గోదావరి నది మధ్యలో ఉన్న అయోధ్యలంక గ్రామానికి వెళ్తారు. అక్కడి నుంచి బోటులో కోనసీమ జిల్లా చాకలిపాలెం చేరుకుని తర్వాత రోడ్డు మార్గంలో మానేపల్లిపాలెం వెళ్తారు. గోదావరి వరద బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. ఆ తర్వాత అప్పనపల్లి వెళ్లి బాధిత కుటుంబాలను పలకరిస్తారు. సాయంత్రానికి రోడ్డు మార్గంలో రాజోలు వెళ్లి రాత్రికి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు చేరుకునేలా షెడ్యూల్ వేసుకుని పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్టు తరఫున వరద బాధితులకు సాయం అందిస్తారు.

నాయకుడనేవాడు బాధితులకు భరోసా ఇవ్వాలని, మాటల్లో కాకుండా ఆ భరోసాను చేతల్లో చూపించాలని పలువురు ప్రత్యక్షంగానే చంద్రబాబబును ప్రశంసిస్తున్నారు. ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా చంద్రబాబు చేసేది అదే అని వారు గుర్తు చేస్తున్నారు. సీఎం కుర్చీలో కూర్చునేదాకా తమ చుట్టూ తిరిగిన జగన్ రెడ్డి ఇలాంటి కష్టకాలంలో తమను గాలికి వదిలేశారని, తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అయ్యారనే విమర్శలు సర్వత్రా వస్తున్నాయి. వరద ముంపు ఒక్క రాత్రిలో తమ జీవితాను తారుమారు చేసేసిందని, అష్ట కష్టాల్లో ఉన్న తమను ఆదుకునేవాడు, భరోసా ఇచ్చేవాడు లేడని బాధితులు బావురుమంటున్నారు. అదే చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే.. వరదల్ని నివారించే శక్తి లేకపోయినా ప్రజల్లో కచ్చితంగా భరోసా నింపేవారని చెప్పుకుంటున్నారు.

గతంలో విశాఖపట్నాన్ని హుద్ హుద్ తుపాను అతలాకుతలం చేసినప్పుడు విశాఖ నగరంలోనే మకా వేసి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించిన చంద్రబాబు ఎక్కడ? తామంతా ఇంత కష్టంలో ఉంటే ప్యాలెస్ కే పరిమితం అయిన జగన్ ఎక్కడ అని జనమంతా బేరీజు వేసుకుని జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల నుంచి కొందరిని సహాయ శిబిరాలకు తరలించి, అరకొరగా భోజనం, అల్పాహారాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న జగన్ సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.  ఇంకా వరదనీటిలోనే ఉన్న  తమకు ప్రుభుత్వం అందజేసిన నాలుగు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చిలు, నాలుగు దొండకాయలు, నాలుగు వంకాయలు, ఐదు కిలోల బియ్యంను ఏం చేసుకోవాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

By
en-us Political News

  
అమరావతి భవిష్యత్తు పై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందన్నారు. రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం అని పేర్కొన్నారు. లోక్ సభలో అమరావతి బిల్లు ఆమోదం స్వర్ణాంధ్ర నిర్మాణంలో కీలక మైలురాయి అని పేర్కొన్న చంద్రబాబు.. అమరావతి ఇక అజేయం..అజరామరమన్నారు.
లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందడం అమరావతికి చట్టపరమైన రక్షణ దిశగా అత్యంత కీలక ముందడుగు పడినట్లైంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగా, విస్తృత చర్చ అనంతరం మెజారిటీ సభ్యుల మద్దతుతో బిల్లును సభ ఆమోదించింది. సభలో ఈ బిల్లుపై దాదాపు రెండు గంటల పాటు చర్చ జరిగింది.
హిట్ అండ్ రన్ నేరాల కంటే అత్యంత ఘోరమైన నేరాలకు పాల్పడిన పార్టీగా విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని దుయ్యబట్టారు. అలవోకగా అబద్ధాలు చెబుతూ, వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తోందని వైసీపీ పేరు చెప్పకుండానే ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు.
గతంలో అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు తెలిపిన జగన్, అధికారంలోకి వచ్చాక రంగు మార్చి మూడు రాజధానులన్నారని దుయ్యబట్టారు. జగన్ ఊసరవెల్లి రాజకీయాలు ఇకపై సాగవన్నారు.
జగన్ హయాంలో అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు తెరపైకి వచ్చింది. 2014-19 మధ్యకాలంలో రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి, తమకు అనుకూలమైన వారికి లబ్ధి చేకూర్చారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన సీఐడీ, చంద్రబాబును ప్రధాన నిందితుడిగా చేరుస్తూ అప్పట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
పల్నాడు జిల్లా పోలీసు విభాగం సలహాదారుగా చదలవాడ అరవిందబాబు రామినేని ప్రసాద్ ను నియమించాలని ఎనిమిది నెలల కిందట సిఫారసు చేశారు. ఆ విషయంలో ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన స్వయంగా మంగళవారం ఉదయం పదకొండున్న గంటల సమయంలో ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్పీ బి.కృష్ణారావును కలిశారు.
జగన్ హయాంలో అప్పటికే జోరుగా నిర్మాణమౌతున్న అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులు అంటూ ఆరంభించిన మూడుముక్కలాట కారణంగానే 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చిందన్న అభిప్రాయం అప్పట్లోనే కాదు.. ఇప్పుడు కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.
అసోంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో పాతిక నుంచి 30 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులే ప్రజలను ఆకర్షిస్తున్నారు. ప్రచారం నుంచి ప్రతి విషయంలోనూ వారి హవా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యువ నేతలు సోషల్ మీడియా వేదికలను తమ ప్రచార మాధ్యమాలుగా ప్రభావమంతంగా వినియోగించుకుంటున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను చర్చిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై శాసనమండలి వేదికగా విజయశాంతి తమ సొంత ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన ఉద్యమకారులకు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా నెరవేర్చకపోవడాన్ని విజయశాంతి ఎత్తి చూపారు.
ఈ ప్రక్రియను వేగవంతం చేసి ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు ఆమోదముద్ర వేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు వచ్చే నెల 1న లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. కాగా ఈ అంశంలో కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది.
30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి వచ్చే నెల 9న జరగనున్న ఎన్నికలలో ఎన్డీయే 14 నుంచి17 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. ఇక విపక్ష ఎస్పీయే 9 నుంచి11, నటుడు విజయ్ నూతనంగా స్థాపించిన టీవీకే పార్టీ 2 నుంచి4 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది.
సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలపడాన్ని మార్షల్స్ అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం మార్షల్స్‌ను అడ్డం పెట్టుకుంటోందని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వంద మంది ప్రముఖులతో ప్రకటించిన ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలు చోటు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఈ జాబితాలో 13వ స్థానం దక్కగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 25వ స్థానంలో నిలిచారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.