ఉత్తరాంద్రలో చంద్రబాబు

Publish Date:May 16, 2023

Advertisement

వైయస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో తమదైన శైలిలో పోరాడుతోంది. ఆ క్రమంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, బాదుడే బాదుడు తదితర కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. 

ఆ క్రమంలో తాజాగా అంటే బుధవారం (మే 17) నుంచి శుక్రవారం (మే19)  వరకు చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. అందులోభాగంగా బుధవారం పెందుర్తి.. గురువారం శృంగవరపు కోట.. శుక్రవారం అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనున్నారు. అలాగే రోడ్ షోలు, బహిరంగ సభల్లో ఆయన పాల్గొని.. ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.  

అందుకోసం చంద్రబాబు నాయుడు బుధవారం (మే17) మద్యాహ్నం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకొంటారు. అక్కడి నుంచి సాయంత్రం పెందుర్తి సమీపంలోని మహిళా ప్రాంగణానికి చేరుకొని పంచ గ్రామాల సమస్యపై వినతి పత్రాలు స్వీకరిస్తారు. అనంతరం రోడ్డ్ షో ప్రారంభమవుతోంది... ఆ క్రమంలో పెందుర్తి జంక్షన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు  ప్రసంగిస్తారు. ఇక గురువారం (మే 18) ఉదయం టిడ్కో ఇళ్ల లబ్దిదారుల నుంచి ఆయన వినతులు స్వీకరించి... ఆ తర్వాత స్థానిక నేతలతో ఆయన సమావేశం అవుతారు. అనంతరం మత్స్యకారులతో భేటీ అవుతారు. ఆ తర్వాత శృంగవరపు కోటకు చంద్రబాబు పయనమై.. అక్కడ రోడ్డు షో నిర్వహించి   స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 
 
అలాగే శుక్రవారం (మే 19)  అనకాపల్లిలో నల్లబెల్లం రైతుల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరిస్తారు. అనంతంర రోడ్ షో నిర్వహించిన ఆ తర్వాత స్థానిక నెహ్రూ చౌక్‌కు చేరుకొని.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం చంద్రబాబు విశాఖపట్నం నుంచి విజయవాడ చేరుకుంటారు.

By
en-us Political News

  
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.