అలిపిరి ప్రమాదం నుంచి బాబును దేవుడు కాపాడిందిందుకేనేమో?!
Publish Date:Oct 4, 2022
Advertisement
పరిస్థితులు, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలంతోపాటు పరిస్థితులు మారుతుంటాయి. ఇవాళ్టి అవాంతరం కొంతకాలం తర్వాత గొప్ప భవిష్యత్ మార్గాన్ని సూచించవచ్చు. ఊహించనివి జరుగుతూంటాయి. కొన్ని అనుభవంలోకి వస్తాయి..ఏమయినప్పటికీ ధైర్యవంతులు, సమాజ సంక్షేమాన్నిమనసా వాచా ఆశించేవారే ఆ వెలుగులో ముందడుగు వేయగల్గుతారు. వారే మార్గదర్శకులు అవుతున్నారు. ఇందుకు కాలం కల్పించే అడ్డంకులు, బాధలు, ఇబ్బందులు, ప్రమాదాలు ఏవీ లెక్కలోకి రావు, ఏవీ అడ్డుకోలేవు. ఇది ఏదో మాటలు చెప్పడం కాదు, ఇది వాస్తవం. ఇందుకు గొప్ప ఉదాహరణ తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు విషయాన్నే తీసుకోవచ్చు. సరిగ్గా 19 ఏళ్ల కిందట.. అక్టోబర్ 1, 2003న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక పెను ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డారు. నక్సల్స్ పకడ్బందీ ప్రణాళికతో జరి పిన క్లెమోర్ మైన్ దాడిలో చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన ఆయన తిరుమల వెళు తుండగా అలిపిరి వద్ద జరిగింది. సంఘటన జరిగిన ప్రదేశం, పేలుడు ధాటి చూసిన వారంతా ఆ ప్రమా దం నుంచి చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డారంటే అది కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి మహిమే అన్నారు. మంచి నాయకుడిని ఎవరూ దూరం చేసుకోవాలనుకోరు, తెలుగు ప్రజలంతా ఆయ న్ను కోరకు న్నారు.. ఆయన మళ్లీ ఎంతో ఆరోగ్యంగా, రెట్టింపు ఉత్సాహంతో జనాల్లోకి వచ్చారు. అంతటి ప్రమాదం నుంచి భగవంతుడు తనను ఎందుకు కాపాడాడంటే.. సమాజం కోసం, తెలుగు రాష్ట్రం కోసం తాను చేయాల్సిన పని ఇంకా ఉందనే భావిస్తున్నానని అప్పట్లో చంద్రబాబు కూడా అన్నారు. అంతటి ప్రమాదం నుంచి వెంకటేశ్వరుడు చంద్రబాబును ఎందుకు కాపాడారో.. చంద్రబాబును ప్రాణా లతో కాపాడిన కారణమేమిటో 2014లో అందరికీ అర్ధమైంది. రాష్ట్ర విభజనతో జీరోగా మిగిలిపోయిన విభజి త ఆంధ్రప్రదేశ్ ను నంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకే నని.. విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతి కోసం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన విధానాలూ తేటతెల్లం చేశాయి. దేవ తల రాజధాని ‘అమరావతి’ని నవ్యాంధ్ర రాజధానిగా నిర్మించే గురుతర బాధ్యత చంద్రబాబుపై ఆ భగవంతుడే ఉంచాడా అని పించక మానదు. భద్రాచలంలో రామాలయ నిర్మాణం కోసం రామదాసును రాముడే ఆశీర్వదించాడం టారు. రాముడి ఆశీశ్సులతో ప్రజా సహకారం తీసుకుని రామాలయ నిర్మాణానికి ఉపక్రమించిన రామదాసు ఎన్ని కష్టాలు ఎదుర్కొన వలసి వచ్చిందో చరిత్ర చెబుతోంది. అలాగే అమరావతి నిర్మాణానికి పూను కున్న చంద్రబాబుకూ అవాంతరాలు ఎదురౌతున్నాయి. దేవతల కార్యాన్ని పూర్తి చేసే క్రమంలో రాక్ష సులు అడ్డంకులు సృష్టించడం పురాణాల కాలం నుంచీ వస్తున్నదే. రామాయణ ఇతిహాసం చెప్పే విషయం అదే. ఆ అవాంతరాలన్నీ అధిగమించి చివరకు అనుకున్నది సాధించడమే నాయకుడి లక్ష ణం. ఇప్పుడు అమరావతికి అడుగడుగునా ఎదురౌతున్న అవాంతరాలు రాక్షస మూకల అడ్డంకులు పెరుగుతున్నా చంద్రబాబు మాత్రం రాష్ట్ర ప్రజల కోసం అకుంఠిత దీక్షతో పోరాడుతూనే ఉన్నారు. మంచికి ఎప్పుడూ ఎవరో ఒకరు సాయపడుతూనే ఉంటారు.. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దేవతలు సాయ పడ్డారు. చంద్రబాబు అమరావతి నిర్మాణానికి వేసుకున్న ప్రణాళికలు అనతికాలంలో కార్యరూపం లోకి రావాల్సింది. కానీ పరిస్థి తులు మారాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయాన్ని ఎదుర్కొంది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ప్రజలు తెలీకుండానే గొప్ప దార్శనికుడి నాయకత్వాన్ని కాదనుకున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చింది. వస్తూనే చంద్రబాబు విజన్‌ని దెబ్బతీసింది. ఆయన ప్రవేశపెట్టి, ఆరంభించి కొనసాస్తున్న పథకాలన్నీ నిర్లక్ష్యం చేసి కేవలం రాజకీయ లబ్ధి, స్వార్ధం కోసమే పాలన సాగిస్తోంది. దీంతో రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడింది. ప్రజలు కష్టాల పాలవుతున్నారు. ప్రజలు కేవలం మూడేళ్ల కాలంలోనే వైసీపీ కుతంత్రాలను తెలుసుకున్నారు. రాజధాని నిర్మాణ ప్రాజెక్టును ఎంతగా భ్రష్టుపట్టిస్తున్నదీ గ్రహించారు. దీంతో ఈ మూడేళ్ల కాలంలో రాష్ట్రం ఏ విధంగా భ్రష్టుపట్టిందో వారికి గ్రహింపునకు వచ్చింది. మళ్లీ చంద్రబాబు దార్శనికతే రాష్ట్రాన్ని కాపాడుతుందన్న భావనకు వచ్చారు. అందుకే గడప గడపకూ తిరుగుతున్న వైసీపీ ఎమ్మెల్యేలనూ, మంత్రులనూ గడప గడపలోనూ నిలదీస్తున్నారు. అంటే జగన్ ప్రభుత్వం పాలనా తీరు, జగన్ పార్టీ నాయకుల వ్యవహారశైలీ అన్నిటికీ జనం తిరస్కారాన్ని బహుమతిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఇటీవల స్వయంగా జగన్ చేయించుకున్న సర్వే పలితాలే తేటతెల్లం చేశాయి. ఉందిలే మంచీకాలం ముందు ముందునా.. అందరూ సుఖపడాలి.. అంటూ ఆంధ్రా ప్రజలు పాడుకుం టూన్నారు.
http://www.teluguone.com/news/content/babu-survived-by-godgrace-from-alipiri-accident-is-this-the-reason-39-144864.html





