వరద బాధితుల కష్టాలు చూస్తుంటే గుండె తరక్కు పోతోంది.. చంద్రబాబు

Publish Date:Jul 21, 2022

Advertisement

బటన్ నొక్కడమే తన పని అనుకుని తాడేపల్లి ప్యాలెస్ లో దర్జాగా కాలం వెళ్లదీస్తున్న ఏపీ సీఎం జగన్ ను జనం బటన్ నొక్కే ఇంటికి పంపేస్తారని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు అన్నారు. కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి బాధితులను పరామర్శించిన ఆయన ఆ సందర్భంగా మాట్టాడారు.

జనానికి బటన్ నొక్కి డబ్బులిచ్చేస్తే చాలని భావిస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మరో శ్రీలంకగా మార్చేస్తున్న జగన్ ను గద్దె దింపడానికి జనం సిద్ధంగా ఉన్నారన్నారు.  గోదావరి వరదలో ప్రజల కష్టాలను చూస్తే గుండె తరుక్కు పోతోందన్నారు. వారిని ఆదుకునే విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం అవధులు దాటిందని దుయ్యబట్టారు.  జనాలను బురదలోకి తోసేసి జగన్ గాలిలో తిరగడాన్ని తప్పుపట్టారు. నేరుగా వచ్చి ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి ముఖ్యమంత్రికి, మంత్రులకు తీరిక లేదా అని ప్రశ్నించారు.  

బురదలోనే నడుచుకుంటూ కూలిన ఇళ్లలోకి వెళ్లి బాధితులను పరామర్శించారు. కోనసీమలో సోంపల్లి, చాకలిపాలెం జంక్షన్‌, మానేపల్లి, అప్పనపల్లి ప్రాంతాల్లో రాత్రి విస్తృతంగా పర్యటించి బాధితులతో మాట్లాడారు.  వరద అంచనాలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చంద్రబాబు అన్నారు. ఎంత ప్రవాహం వస్తుంది. ఏ యే ప్రాంతాలకు ముంపు ముప్పు ఉంటుందన్నది ప్రభుత్వం ముందుగానే అంచనా వేసి.. ముంపు ప్రాతాల ప్రజలకు పునరావాసం కల్పించాలని, ప్రభుత్వం ఆ విషయంలో క్షంతవ్యం కాని నిర్లక్ష్యంతో వ్యవహరించిందని విమర్శించారు.  

బాధితులకు భరోసా కలిగించాల్సిన సీఎం గాలిలో చక్కర్లు కొట్టి వెళ్లిపోయారని దుయ్య బట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తిత్లీ, హుద్‌హుద్‌, హరికేన్‌ తుఫాన్లు వచ్చినా తక్షణం స్పందించి సమర్థంగా ఎదుర్కొని ప్రజలను ఆదుకున్నామనీ,  ఇప్పుడు గోదావరి వరదలో ప్రజల ఇబ్బందులను వైసీపీ పట్టించుకోలేదనీ, వారి బాధలు వారే పడాలన్నట్లుగా వదిలేసిందనీ విమర్శించారు. ప్రభుత్వం వరద బాధితుల కోసం పడవలు ఏర్పాటు చేయలేదు.  కనీసం భోజనం కూడా పెట్టలేదన్నారు.

నాలుగు రోజుల పాటు వరద బాధితులను గోదావరికి వదిలేసి.. ఇప్పుడు తానొస్తున్నానని రెండు వేల రూపాయలు సాయం  అంటూ ఇచ్చి నాటకాలాడుతున్నారని దుయ్య బట్టారు. రెండు వేల రూపాయలు వరదతో ఇంట్లో మేట వేసిన బురద కడుక్కోవడానికైనా సరిపోతుందా అని ప్రశ్రించారు.  బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం చేసేవరకు మళ్లీ మళ్లీ వరద ప్రాంతాల్లో పర్యటిస్తానన్నారు. వరద బాధితులకు ప్రతి ఇంటికీ రూ. పది వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి వల్లే విలీన గ్రామాల ప్రజలు ఏపీలో ఉండం, తెలంగాణలో కలిపేయండని అంటున్నారన్నారు.   

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.