ప్రజాస్వామ్య విలువలకు బాబు పట్టం!

Publish Date:Jun 15, 2023

Advertisement

హత్యా రాజకీయాలే రాజ్యమేలుతున్న నేటి రోజులలో వాటికి దూరంగా ఉంటూ రాజకీయాలలో విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. ప్రత్యర్థులపై ప్రతీకార దాడులకు పాల్పడాలని కోరుకునే సొంత పార్టీ నేతలను సైతం మందలిస్తూ తన ఔన్నత్యాన్ని చాటుకుంటున్నారు. అందుకు సంబంధించి కొండా మురళి, కొండా సురేఖ దంపతులు ఇటీవల ఓ టెలివిజన్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, ప్రసారమాధ్యమాలలోనూ వైరల్ అయ్యింది.

చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం కీలక నేత, ఎమ్మెల్యే ఒకరు చంద్రబాబును తన నియోజకవర్గంలో ప్రత్యర్థిగా ఉన్న ఒక విపక్ష నేత ఎలిమినేషన్ ప్రతిపాదన చేశారు. దీనిపై చంద్రబాబు చాలా సీరియస్ గా స్పందించారు. ఏం తమాషాగా ఉందా.. హత్యా రాజకీయాలు ప్రజాస్వామ్యంలో ఉండవు. అటువంటి ఆలోచనలనే నీ మనసులోంచి తుడిచేయ్ అని మందలించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ ప్రత్యర్థే తన నోటితో చెప్పారు. ఇంతకీ తన ప్రత్యర్థిని ఎలమినేట్ చేయాలన్న అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే ఎవరంటే ప్రస్తతం బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. ఆయన హత్య చేయమన్నది ఎవరినంటే.. అప్పట్లో ఎమ్మెల్యే అయిన కొండా సురేఖ భర్త కొండా మురళిని. ఈ విషయాన్ని కొండా సురేఖ దంపతులు స్వయంగా ఒక టీవీ ఇంటర్వ్యూలో తమ నోటితో చెప్పారు. ఇంతకీ కొండ మురళీ, కొండ సురేఖ.. సదరు ఇంటర్వ్యూలో  ఏమన్నారంటే.. 

ప్రస్తుతం చంద్రబాబు పాలనతో వైయస్ జగన్ పాలన పోల్చుకుంటే. చంద్రబాబు పాలన వంద శాతం గుడ్  అని వారు స్పష్టం చేశారు. అలాగే తనను ఎన్‌కౌంటర్ చేయాలన్నప్పుడు..ఓ ఎమ్మెల్యే భర్త విషయంలో తాను అలా చేయలేనని చంద్రబాబు కరాఖండీవగా చెప్పారని.. అదే వీరైతే.. అంటే వైయస్ జగన్ ప్రభుత్వం  తనను వందశాతం ఎన్ కౌంటర్ చేయించేదని కొండా మురళి వివరించారు. సరిగ్గా అదే సమయంలో కొండా సురేఖ జోక్యం చేసుకుని ఎర్రబెల్లి దయాకర్ పోయి.. సీఎం చంద్రబాబు కాళ్ల మీద పడితే.... ఆయన స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా  ఎం మాట్లాడుతున్నావ్ దయాకర్.. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది.. ఓ ఎమ్మెల్యే భర్తను చంపడం అంటే అంత ఈజీ అనుకున్నావా? ఇంకా ఏమైనా మాట్లాడు కానీ.. ఇది కుదరదని  ముఖం మీదే చంద్రబాబు క్లియర్ కట్‌గా చెప్పారని.. ఆ సమయంలో అక్కడ ఉన్నవారు.. ఆ తర్వత తమతో  ఈ విషయం చెప్పారని కొండా సురేఖ స్వయంగా స్పష్టం చేశారు. ఇదే అంశంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్ అయితే... మురళిని ఎన్ కౌంటర్ చేసేసేవారని కొండ సురేఖ అదే ఇంటర్వ్యూలో చెప్పారు. 

తెలుగుదేశం అధినేత , విపక్ష నేత చంద్రబాబు నాయుడు అంటే.. హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధికి, సైబరాబాద్ నిర్మాణానికి దోహదపడిన వ్యక్తిగా అంతా భావిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి అండ్ కో అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై గత నాలుగేళ్లుగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకోసం.. జగన్ తొలి కేబినెట్‌లోని మంత్రులే కాదు.. జగన్ మలి కేబినెట్‌లోని మంత్రులు సైతం.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తమ మాటలతో విరుచుకుపడిపోతారన్న విషయం విదితమే.  అలాంటి వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఫ్యాన్ పార్టీ అధినేత  జగన్ వ్యవహార శైలినే కాదు.. వీరిద్దరి మధ్య తారతమ్యాలను సైతం కొండ మురళి దంపతులు వివరించిన విషయం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

By
en-us Political News

  
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్‌ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.