బాబు, పవన్ భేటీ.. పొత్తులపై పాత చర్చే మళ్లీ కొత్తగా తెరపైకి!

Publish Date:May 1, 2023

Advertisement

తెలుగుదేశం అధినేత చంద్ర బాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్  లో భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసంలో వారి భేటీ సాగింది.  తాజా రాజకీయ పరిణామాలపై వారిద్దరూ సుమారు గంటన్నరపాటు చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ లో   ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పదే పదే చెబుతున్న పవన్ కల్యాణ్... ఇటీవలే ఢిల్లీ వెళ్లి భాజపా అగ్రనాయకత్వంతో నూ చర్చలు జరిపారు.

ప్రపంచ దేశాల్లో భారత్ ను బలమైన శక్తిగా నిలిపేందుకు, దేశాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని, ఆయన ప్రతిపాదించిన విజన్ 2047కి సంపూర్ణ మద్దతిస్తున్నానని చంద్రబాబు అన్నారు.  ఎన్డీఏలో చేరబోతు న్నారా? అని ఓ మీడియా సంస్థకు చెందిన పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు... చంద్రబాబు  సూటిగా సమాధానం చెప్పకపోయినా, మోడీ పట్ల సానుకూలతను మాత్రం సందేహాలకు అతీతంగా వెల్లడించారు. దీంతో ఈ నేపథ్యంలో జరిగిన చంద్రబాబు, పవన్ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో చర్చించిన అంశాలపై వారిద్దరూ విలేకరుల సమావేశం నిర్వహించలేదు.  రెండు పార్టీల నుంచి ఎలాంటి  ప్రకటనలూ వెలువడలేదు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలకుండా చూడటంతో పాటు, రాజకీయంగా పొత్తులను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్టు పరిశీలకులు అయితే విశ్లేషిస్తున్నారు.  

తెలంగాణతో పాటే... ఆంధ్రప్రదేశ్ శాసనసభకూ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో... చంద్రబాబు, పవన్ ల భేటీ అసక్తిగా మారింది. వారిద్దరూ ఏ అంశాలు మాట్లాడుకుని ఉంటారన్న చర్చ  విస్తృతంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై తమ విధానం ఏంటన్నది దిల్లీలోని భాజపా అగ్రనాయకత్వం ఇప్పటివరకు బయట పెట్టలేదు. మోడీ విధానాల్ని చంద్ర బాబు బహిరంగంగా సమర్ధించడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల నివ్వబోనని పవన్ పదే పదే చెబుతుండటంతో.. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

వైకాపా ప్రభుత్వ అరాచకాలపై కలసి పోరాడాలని, భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు మరిన్ని నిర్వహించాలని  ఈ భేటీలో నిర్ణయించినట్లు చెబుతున్నారు.  రెండు పార్టీల మధ్య రాజ కీయ పొత్తును బలోపేతం చేసే దిశగా, ఇద్దరు నాయకుల మధ్య రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు జరగనున్నట్టు రెండు పార్టీల శ్రేణులూ అభిప్రాయపడుతున్నాయి.  మోడీని చంద్రబాబు ప్రశంసించడం చూస్తే.. ఆయన ఎన్డీఏలో చేరవచ్చనే ఊహాగానాలకు బలం చేకూర్చుతోంది. అదే నిజమైతే మోడీ ఈ విషయంలో చంద్రబాబు.. మైనార్టీలను ఏ విధంగా సమాధాన పరుస్తారన్నది చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద చంద్రబాబు, పవన్ బేటీ  రాష్ట్రంలో రాజకీయ పొత్తులపై పాత చర్చనే మరోసారి కొత్తగా తెరమీదకు తెచ్చింది. 

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.