Publish Date:Apr 26, 2024
అందుకే ఆయన రాజకీయంగా ఆయన పరిస్థితి దిక్కుమాలిన స్థితికి చేరుకుంది. గురువారం నాడు వరంగల్ పార్లమెంట్ స్థానానికి వీల్ చైర్లో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఇంతకీ మీరు నామినేషన్ వేసింది ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగానేగా అని అడిగితే, ‘ఛ.. ఛ.. ఆ పార్టీలో నేనెనెప్పుడు చేరాను? కాఫీ తాగుదువుగాని రా అని కేఏ పాల్ పిలిస్తే వెళ్ళాను. ఆయన నాకు కండువా కప్పి వరంగల్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించేశారు. కానీ నేను ఆ పార్టీలో చేరలేదు.. ఆ పార్టీ సభ్యుణ్ణి కూడా కాదు. ఆ పార్టీకి ఆరోజే టాటా చెప్పేశాను. స్థానిక ప్రజలు నన్ను నా స్వస్థలమైన వరంగల్ నుంచి పోటీ చేయాలని రిక్వెస్ట్ చేయడంతో నామినేషన్ దాఖలు చేశాను’ అని చెప్పుకొచ్చారు.
నిజానికి బాబూమోహన్ ప్రజాశాంతి పార్టీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నానని కె.ఎ.పాల్‌తో కలసి ప్రకటించారు. అప్పటి వరకు తాను వున్న బీజేపీకి గుడ్ బై చెబుతున్నట్టు కూడా ప్రకటించారు. మధ్యలో ఓసారి వరంగల్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బాబూమోహన్ బరిలో నిలిచే అవకాశం వుందని వార్తలు వచ్చినప్పుడు బాబూమోహన్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. తన పేరును బీఆర్ఎస్ పార్టీ ఇలా వాడుకుంటే బాగోదని వార్నింగ్ ఇచ్చాడు. నిజంగానే బీఆర్ఎస్ ఈయనకు టిక్కెట్ ఆఫర్ ఇచ్చినట్టే బిల్డప్పు ఇచ్చారు. చివరికి ఇప్పుడు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ బాబూమోహన్‌కి పిలిచి మరీ అందోల్ టిక్కెట్ ఇచ్చింది. మంత్రి పదవి కూడా కట్టబెట్టింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో వున్న సమయంలో బాబూమోహన్ నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి బయటకి వచ్చేసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీలో కొంతకాలం కేసీఆర్‌తో స్నేహబంధం కొనసాగించారు. ఎప్పుడైతే కేసీఆర్ తనను దూరం పెట్టడం ప్రారంభించారో, పొమ్మనలేక పొగపెట్టడం మొదలుపెట్టారో బాబూమోహన్ పార్టీకి క్రమంగా దూరమవుతూ, చివరికి పార్టీలో నుంచి బయటకి వచ్చేశారు. ఈసారి మకాం బీజేపీలో వేశారు. మొన్నటి ఎన్నికలలో అందోల్ టిక్కెట్ కోసం తన కొడుకుతోనే గొడవపడి నానా రచ్చ చేశారు. ఆ తర్వాత ప్రజాశాంతి పార్టీకి చేరువై, ఆ తర్వాత దూరమై ఇప్పుడు ఇండిపెండెంట్‌గా మిగిలి, తనకు రాజకీయంగా కొత్త అయిన వరంగల్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్నారు. రాజకీయంగా తన కెరీర్ ముగిసిన విషయాన్ని బాబూమోహన్ ఇంకా గ్రహించలేదు. ఏడుపదులు దాటిన బాబూమోహన్ ఇక రాజకీయాలకు స్వస్తి పలికి విశ్రాంతి బాటలో నడిస్తే బాగుంటుంది!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/babu-mohan-unstable-politics-25-174550.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.