కమలాపురంలో బాబు సభకు జన ప్రభంజనం

Publish Date:Jan 20, 2024

Advertisement

ఉమ్మడి కడప జిల్లా కమలాపురంలో చంద్రబాబు నిర్వహించిన రా కదలిరా కార్యక్రమానికి జనం ప్రభంజనంలా తరలి వచ్చారు. ఆ సందర్భంగా చంద్రబాబు తన ప్రసంగంలో జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. రా కదలిరా అని తాను పిలుపునిస్తే కమలాపురం జనం వెల్లువలా కదిలారని చెప్పారు. ఇక కడపలో అయితే గడపగడపా జగన్పై యుద్ధానికి రెడీ అంటోందని చెప్పారు. రాష్ట్రంలో యువత, యువత, రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల వారి సంతోషం, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ప్రజా సహకారంతో పని చేస్తానని హామీ ఇచ్చారు.

గత ఎన్నికలలో కడప జిల్లాలలోని అన్ని స్థానాలలోనూ గెలిచిన వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కడపను కడనే ఉంచేసింది. ప్రజల జీవన ప్రమాణాలు పెరగలేదు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయి. తాగునీరు, సాగునీరు ఊసే లేదు. రైతుల జీవితాలు దుర్భరంగా మారాయి. జగన్ అధకారంలోకి వచ్చిన తరువాత సొంత జిల్లాలో జగన్ కు తప్ప మరెవరికీ సంతోషం లేదు. జిల్లాలో బాగుపడిన వారెవరైనా ఉన్నారంటే అది జగన్ రెడ్డి, ఆయనతో పాటు మరో ఇద్దరు ముగ్గురు మాత్రమే కనిపిస్తారు.   జగన్ రెడ్డి మాటలు కోటలు దాటాయిగానీ, చేతలు గడప  దాటలేదు.  సొంత నియోజకవర్గం పులివెందులలోనే పరదాలు, సెక్యూరిటీ లేకుండా కాలు కదపలేని పరిస్థితిలో జగన్ ఉన్నారు.

వచ్చే ఎన్నికలలో పులివెందుల నుంచి జగన్ గెలిచే పరిస్థితి కూడా లేదు.  తీవ్ర వర్షాభావ పరిస్థితులతో జనం, రైతులు అల్లాడుతుంటే జగన్ రెడ్డి కనీసం ఒక్కటంటే ఒక్క మండలాన్ని కూడా కరవు మండలంగా ప్రకటించలేదు సరి కదా కరువు మండలాల ప్రకటన గురించి అధికారులు ప్రస్తావిస్తే నా సొంత జిల్లాలో కరువా అంటూ కసురుకున్నారు.  ఒక్క చాన్స్ ఇచ్చి తప్పు చేశామని ఇప్పడు జనం పశ్చాత్తాపపడుతున్నారు.  అంటూ చంద్రబాబు చెప్పిన ప్రతి మాటకూ జనం చ ప్పట్లతో మద్దతు తెలిపారు. చంద్రబాబు తన ప్రసంగంలో హు కిల్డ్ బాబాయ్ అని ప్రశ్నిస్తే జనం నుంచి జగన్ జగన్ అంటూ బదులొచ్చింది. 

 వివేకా హత్య కేసులో మలుపులు టాలీవుడ్,  బాలీవుడ్ సినిమాల్ని కూడా మరిపించేలా ఉన్నాయి.  వివేకా హత్యపై గుండెపోటు అంటూ, రక్తపు వాంతులు అంటూ  ప్రచారం చేశారు. పోస్టుమార్టంలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

సరే గత ఎన్నికల ప్రచారంలో  తండ్రి లేడు, బాబాయి లేడు అంటూ  సానుభూతి సంపాదించి గెలిచిన  జగన్ రెడ్డికి ఇప్పుడు  వివేకా హత్యపై సమాధానం చెప్పే ధైర్యం ఉందా? నాడు సీబీఐ దర్యాప్తు కావాలని కోర్టుకి వెళ్లిందెవరు,  అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ వద్దన్నదెవరు జగన్ కదా అని చంద్రబాబు అన్నారు. 

అసలు వివేకా హత్యపై మాట్లొద్దంటూ గ్యాగ్ ఆర్దర్ తెచ్చారు. వివేకాకు రెండో భార్య వ్యవహారం, బెంగుళూరు ఆస్తులు వల్లే హత్య అంటూ చెప్పారు. తర్వాత కూతురు సునీత, ఆమె భర్తపై తప్పుడు ప్రచారం చేశారు. ఏ తప్పు చేయని కోడికత్తి శ్రీను జైల్లో ఉన్నాడు బాబాయిని చంపిన అవినాష్ రెడ్డి మాత్రం బయట తిరుగుతున్నాడు. దోషులు అరెస్ట్ కాకుండా నిర్దోషులు అరెస్ట్ అవుతున్నారు. ఇప్పుడు కడప గడ్డపై నిలబడి అడుగుతున్నా…హు కిల్డ్ బాబాయి దీనికి జగన్ సమాధానం చెప్పాలి? అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
 
జగన్ హయంలో నిత్యావసర ధరలన్నీ పెరిగాయి. అదే తెలుగుదేశం పాలనలో  సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుకలు ఇచ్చాం.

తెలుగుదేశం హయాంలో ఉన్న పెళ్లికానుక, విదేశీ విద్య వంటి సంక్షేమ ఇప్పుడు ఏమయ్యాయి. తెలుగుదేశం హయాంలో  రేషన్ షాపుల్లో 18 రకాల వస్తువులు ఇచ్చాం. ఇప్పుడు ఇస్తున్నారా?  అంటూ చంద్రబాబు ప్రశ్నిస్తే జనం లేదు లేదు అంటూ ఎలుగెత్తారు.  జగన్ రెడ్డిది బటన్ నొక్కుడు కాదు, బటన్ బొక్కుడు అంటూ చంద్రబాబు విమర్శిస్తే జనం తప్పట్లతో ఔనన్నారు.  
 మద్యపాన నిషేదం అని చెప్పి మద్యంపై వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి రూ. 36 వేల కోట్లు అప్పు తెచ్చారు. నాసిరకం మద్యం అధిక ధరలకు విక్రయిస్తూ సొంత బొక్కసం నింపుకుంటున్నారు. పెట్రోల్, డీజీల్, ఆర్టీసీ ఇలా అన్నిటి రేట్లు  పెంచేయడంతో పాటు ఆస్తిపన్ను, నీటి పన్ను చివరకు చెత్తపై కూడా పన్ను వేసి ప్రజలను వేధించుకు తింటున్నారు. కరెంట్ చార్జీలు 9 సార్లు పెంచారంటూ జగన్ పై చంద్రబాబు విమర్శలు కురిపించారు.   

సీమకు జగన్ చేసిందేమీ లేదనీ,  కడప స్టీల్ ఫాక్టరీకి రెండు సార్లు రిబ్బన్ కట్ రిబ్బన్ కట్ చేయడం రంగులు వేసుకోవటం తప్ప అని ఎద్దేవా చేశారు.  రాయలసీమకు మొదటిసారిగా నీళ్లిచ్చిన ఘనత ఎన్టీఆర్ దే. గండికోట రిజర్వాయర్, తెలుగు గంగను తవ్విన వ్యక్తి ఎన్టీఆర్. 2014- 19 లో రూ. 12,500 కోట్లు ఒక్క కడప జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసి ప్రాజెక్టులను పరిగెత్తించాం. గండికోట ద్వారా పులివెందులకు నీళ్లిచ్చిన ఘనత టీడీపీదే. మేం ఖర్చు చేసిన దానిలో కనీసం 20 శాతమైనా జగన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఖర్చు చేశారా అని బాబు నిలదీశారు. తెలుగుదేశం హయాంలో పట్టిసీమ ద్వారా 120 టీఎంసీలు రాయలసీమకు ఇచ్చాం. దాని వల్ల అన్ని కాలువల్లో నీళ్లొచ్చాయి. కానీ ఇప్పుడు రైతుల కళ్లలో నీళ్లు పారుతున్నాయంటూ చంద్రబాబు జగన్ పాలనను దుయ్యబట్టారు.    

By
en-us Political News

  
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.