బాబు దెబ్బకు దిగొచ్చిన జగన్

Publish Date:May 8, 2023

Advertisement

నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ అన్నీ తెలిసినట్లు ఆర్భాటం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ గత నాలుగేళ్లుగా రాజధాని మార్పు, కోర్టు కేసులు, అప్పుల కోసం ఎదురు చూపులతో గడిపేశారు. తీరా స్పందించాల్సిన సమయంలో జగన్ సర్కార్ చేతులెత్తేసింది. ిటీవల రాష్ట్రంలో అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో  జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందని తూర్పుగోదావరి జిల్లా వాసులు అంటున్నారు. 

రైతులకుఅండగా నిలబడేందుకు రాజమండ్రిలో మకాం వేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి 72 గంటల అల్టిమేటం యిచ్చారు. అప్పటి లోగా రైతుల కష్టార్జితాన్ని రైతు భరోసా కేంద్రాలకు తరలించి న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.  తొలుత పట్టించుకోనట్లు వ్యవహరించిన అధికారులు రైతుల నుండి వస్తున్న ప్రతి స్పందనతో కదలాల్సి వచ్చింది.  వెంటనే ధాన్యం రైతు భరోసా కేంద్రాలకు తరలించే పని మొదలైంది. దీంతో ఊపిరి పీల్చుకున్న రైతులు అండగా నిలబడిన చంద్రబాబుకు కృతజ్ణతలు తెలపారు.  

కష్టంలో ఉన్న రైతాంగం కోసం జిల్లాలో బస చేసి ప్రభుత్వం మెడలు వంచిన చంద్రబాబు అక్కడి తెలుగుదేశం నేతలలో కొత్త ఆశలు నింపారు. యింత కాలం రైతు ప్రభుత్వం మాదే అని చెప్పుకున్న వైసీపీ నేతలకు రైతుల ముందుకు వెళ్లేందుకు ధైర్యం రావడం లేదు.  ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు తీసుకున్నసాహసోపేత నిర్ణయం రైతు లోకాన్ని ఆకట్టుకుంది.  72 గంటల లోగా ధాన్యంపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోకపోతే, ధాన్యం మొత్తాన్ని తాడేపల్లి ప్యాలెస్ ముంగిట కుప్పలుగా పోస్తామని చంద్రబాబు చేసిన హెచ్చరిక రైతులలో ఆయన గౌరవాన్ని పెంచింది.  ఎమ్మెల్సీ ఎన్నికలలో సాధించిన విజయం తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.

రైతుల విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించడం గ్రామీణ ప్రాంతాలలో తెలుగుదేశంప్రతిష్ట మరింత పెరిగింది.  యింత వరకూ హైకెట్ బాబు అంటూ, వ్యవసాయం దండగ అన్నారంటూ లేనిపోని ఆరోపణలు చేసిన వైసీపీ నోళ్లు ఈ దెబ్బతో మూతపడ్డాయి.  తెలుగుదేశం అధికారంలోకి వస్తే గ్రామీణ పరిశ్రమలపై దృష్టి పెడతామని చంద్రబాబు ముందే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడీపీలో 36శాతం వ్యవసాయ రంగం ఆక్రమించింది. కాగా పరశ్రమలశాతం 23శాతంగా ఉంది. సర్వీస్ సెక్టార్ వేల్యూ 41శాతంగాఉంది. అంటే రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయని చంద్రబాబు చెబుతున్నారు.

ఆయన మాటలను బట్టి చూస్తే తెలుగుదేశం అజెండాలో రైతుల సంక్షేమం, వ్యవసాయక అభివృద్ధి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు పెద్ద పీట వేస్తారని రైతులు ఆశిస్తున్నారు.  వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే బాబు పాలన రావాలని రైతులు అంటున్నారు. 

By
en-us Political News

  
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా.. కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్ పంపించారన్నారు.
కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ.. డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు.
ఎన్నికల బరిలో కేసీఆర్, బీఆర్ఎస్ కూటమిని ఢీకొట్టడం ఎవరికైనా పెద్ద సవాలే. గతంలో కేసీఆర్ వాడే ఘాటైన రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలపై ఆయనకు మాత్రమే పేటెంట్ హక్కు ఉందనే భావన ఉండేది. కానీ రేవంత్ రెడ్డి రాకతో.. ఆ ముద్రను పూర్తిగా చెరిపివేశారు. కేసీఆర్, కేటీఆర్ ల కంటే మరింత దూకుడుగా, ఘాటుగా రేవంత్ ప్రజల్లోకి వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం పాలసీలు లేదా ప్రాజెక్టులను ఏ ఒక్కరి కోసమో కాకుండా దేశ ప్రజలందరి కోసమే ప్రవేశపెడుతుందని బదులిచ్చారు. అయితే.. ఆ ప్రాజెక్టులను అందుకోవడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా, సానుకూలంగా స్పందిస్తుందనే దానిపైనే వాటి రాక ఆధారపడి ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు నాయుడు కుమారుడిగా, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న యువకుడు నారా లోకేష్. అదే నారా లోకేష్ ఇప్పుడు ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు.
ఈ చర్చోపచర్చలు, ఊహాగాన సభలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక బలమైన ప్రధానమంత్రి ఉన్నారన్న లోకేష్.. చంద్రబాబు ప్రధాని అన్న చర్చకు, వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ఆయనకు పార్టీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదన్న చర్చ గత కొంత కాలంగా జనసేనలో అంతర్గతంగా సాగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా చేస్తున్న విమర్శలను, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం వెనుకబడిందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది.
నగర ప్రజల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రో విస్తరణ, నిధుల విడుదలే లక్ష్యంగా వీరిద్దరూ కలిసి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీ చాలా సానుకూల వాతావరణంలో జరిగిందనీ, మెట్రో ప్రాజెక్టుకు ఎదురవుతున్న ఆర్థిక అవరోధాలను అధిగమించడానికి ఇదొక కీలక ముందడుగని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం పేర్కొన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని సమర్ధంగా, ఎఫెక్టివ్ గా అమలు చేయగలుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనిని మరొక మెట్టు పైకి తీసుకువెళ్లి ముందుకు తీసుకెళ్లి ఈజ్ ఆఫ్ లివింగ్ అనే భావనను తీసుకొచ్చారనీ, ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలలో ఎప్పటినుంచో అనేక అంతరాలు, ఘర్షణలు ఉన్నాయనీ, సాంకేతికత ద్వారా ఆ అవరోధాలను తొలగించాలనేదే మా ఆలోచన అన్నారు.
ఎక్స్‌ప్రెస్ అడ్డా వేదికపైకి విప్లవాత్మక మార్పులకు, పాలనా విధానాలకు కేంద్ర బిందువులుగా నిలిచే అత్యున్నత ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తారు. గతంలో ఈ వేదికపై కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ వంటి దిగ్గజాలు పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఆ లీగ్‌లో నారా లోకేష్ నిలవడం ఆయన స్థాయిని రుజువు చేస్తోంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.