ఏపీలో ఆగని దారుణాలు..బాబు లేఖాస్త్రాలు

Publish Date:May 2, 2022

Advertisement

ధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఐదు పేజీల లేఖ రాశారు. రేపల్లె రైల్వే స్టేషన్ లో జరిగిన దారుణ ఘటనతో పాటు.. గత నాలుగు రోజులుగా ఏపీలో జరిగిన ఘటనలు, పెరుగుతున్న క్ఐమ్ రేట్ పై వివరాలు, మీడియాలో వచ్చిన కథనాలు, వీడియోలను తన లేఖకు చంద్రబాబు జతచేశారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలను అదుపు చేయడంలో విఫలమైన పోలీసులతో పాటు నిందితులను కఠినంగా శిక్షించాలని డీజీపీకి రాసిన లేఖలో చంద్రబాబు డిమాండ్ చేశారు. పేట్రేగిపోతున్న వైసీపీ గూండాలను అదుపు చేయలేక పోలీసుశాఖ చతికిలపడుతోందని ఆరోపించారు. జంగిల్ రాజ్ ఏలుబడిలో రాష్ట్ర ప్రజలకు భద్రతే లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విచ్ఛిన్నం అయ్యిందని చంద్రబాబు రాసిన లేఖలో పేర్కొన్నారు. జంగిల్ రాజ్ పాలనలో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. పెట్రేగుతున్న వైసీపీ గూండాలను అదుపు చెయ్యడంలో పోలీసు శాఖ విఫలం అవుతోందని ఆరోపించారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి. కొత్తపల్లిలో తన భర్త హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్రారావు కారణం అని స్వయంగా మృతుడు గంజి ప్రసాద్ భార్య చెప్పిన విషయాన్ని తన లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. శ్రీకాళహస్తిలో పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్ వెయ్యడానికి వెళుతున్న వారిపై దాడిని నివారించడంలో పోలీసుల విఫలమయ్యారని చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా ఉండి ఉంటే రేపల్లె రైల్వే స్టేషన్ లో ఆ దారుణం జరిగేది కాదన్నారు. రాష్ట్రంలో హింసకు, నేరాలకు విచ్చలవిడి మద్యం, గంజాయి వాడకం కారణం అవుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.  గంజాయి సరఫరాలో వైసీపీ నేతల ప్రమేయం కనిపిస్తున్నా.. పోలీసుశాఖ తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు.

అనంతపురంలో పింఛన్ అడిగిన పాపానికి పోలీసు ఎస్సై టీడీపీ కార్యకర్తపై దాడి చెయ్యడం పోలీసు శాఖలో వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోందని అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పట్టపగలు గన్ తో బెదిరించి అనకాపల్లి జిల్లా కసింకోటలో బ్యాంక్ దోపిడీ జరిగిన వైనాన్ని ఆయన ప్రస్తావించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఏపీ పోలీసులు స్పందించకపోయినా.. కర్ణాటక పోలీసులు వైసీపీ ఎంపీటీసీని అరెస్టు చేశారని గుర్తుచేశారు. తాజాగా ఏపీ నుంచి ఆస్ట్రేలియాకు డగ్స్ వెళ్లిన కేసులో దర్యాప్తు సంస్థలు ఒకరిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్న విషయం డీజీపీకి చంద్రబాబు రాసిన తన లేఖలో ప్రస్తావించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లా అండ్ ఆర్డర్ అమలుపై పోలీసు శాఖ దృష్టిపెట్టాలని తన లేఖలో చంద్రబాబు కోరారు.

By
en-us Political News

  
ఒక లీటరు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌లో సగటున 2.4 లక్షల ప్లాస్టిక్ ముక్కలు ఉంటాయట. నానో ప్లాస్టిక్ కణాలు శరీరంలో అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి. పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అటు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంద‌ని, ప్రాణాంతక వ్యాధులపై బెర్లిన్ - జర్మనీలో జ‌రిగిన‌ మెడికల్ కాన్ఫరెన్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.
ఏపీలో ఎన్నికల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరగ్గా, పలువురు పోలీసు అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. బదిలీ అయిన వారి స్థానంలో ఈసీ నేడు కొత్త నియామకాలు చేపట్టింది. డీఎస్పీలుగా ఐదుగురిని, ఇన్ స్పెక్టర్లుగా ఏడుగురిని నియమిస్తూ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.
జనం మొగ్గు ఎటువైపు ఉంది.. ఏ పార్టీ పట్ల జనంలో అభిమానం మెండుగా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సర్కార్ ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ గద్దె ఎక్కుతుందా? లేక పరాజయం పాలై అధికారం కోల్పోతుందా వంటి ప్రశ్నలకు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే సర్వేల మీద ఆధారడుతుంది.
ప్రభుత్వ అవినీతి, అక్రమాలతోపాటు ముఖ్య కారణంగా చెప్పుకోవలసింది ‘లాండ్ టైటిలింగ్ యాక్ట్’. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈ యాక్ట్ ద్వారా తమ భూములకు మొగుడై కూర్చుంటాడన్న భయం జనాన్ని వేధించింది. అందుకే అతన్ని సాగనంపేలా తీర్పు చెప్పారు.
ఆంధ్ర ప్రదేశ్ లో పోలింగ్ సందర్భంగానూ, ఆ తరువాత కొన్ని ప్రాంతాలలో హింస చెలరేగింది. దీంతో ఆయా ప్రాంతాలలో పరిస్థితిని అదుపు చేయడానికి నిరవధికంగా 144వ సెక్షన్ విధించారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రజల తీర్పు ఎలా ఉందో చెప్పడానికి ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఫలితం చూస్తే సరిపోతుందని అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ ఇదే ఓరవడి కొనసాగుతూ వస్తోంది. విభజిత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రెండు ఎన్నికలలోనూ కూడా తూర్పు గోదావరి జిల్లా ప్రజల ఆదరణ పొందిన పార్టీయే అధికారంలోకి వచ్చింది. ఈ
 తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాల్లో టెట్ నిర్వహించనున్నారు. టెట్ పరీక్షలు సోమవారం  నుంచి జూన్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన కవిత.. సుమారు 46 రోజులుగా తీహార్ జైల్లోనే ఉన్నారు. కోర్టు అనుమతితో పలు పుస్తకాలను చదువుతూ... ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు.
పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేదీ సినిమాలో చివరి పంచ్ మనదైతే ఆ క్కిక్కే వేరప్పా అని ఓ డైలాగ్ ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ అలాంటి కిక్ నే ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు.
 ఎపిలో సర్వేలన్నీ త్రికూటమి వైపే ఉన్నాయి. తెలుగు దేశం పార్టీ అధికారంలో రాబోతుందని జోస్యం చెబుతున్నాయి. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇదే విషయం చెబుతున్నారు. తాజాగా కాంగ్రెస్ నేతలు కూడా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. ఏపీలో కూటమి విజయం సాధించబోతోందని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ జోస్యం చెప్పారు.
రాష్ట్రంలో హాట్ నియోజకవర్గాలలో ఒకటైన పిఠాపురంలో అత్యధికంగా 86.86శాతం పోలంగ్ నమోదైన సంగతి విదితమే. ఇక్కడ నుంచి జనసేనాని పవన్ కల్యణ్ పోటీ చేయగా ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి కాకినాడ సిట్టింగ్ ఎమ్మెల్యే వంగా గీత బరిలోకి దిగారు.
దేశంలో ఈసారి సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లో నిర్వహిస్తుండగా, ఇప్పటివరకు నాలుగు దశల పోలింగ్ పూర్తయింది. ఇటీవలే మే 13న నాలుగో దశ పోలింగ్ జరిగింది. ఇక, ఇవాళ దేశంలో ఐదో దశ పోలింగ్ ప్రారంభమైంది.  ఐదో విడతలో భాగంగా 6  రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్ లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్ లో 7, బీహార్ లో 5, ఒడిశాలో 5, ఝార్ఖండ్ లో 3, జమ్మూకశ్మీర్ లో 1, లడఖ్ లో 1 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు
ఆదివారం నాడు హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం పాలైనట్టు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.