బాదుడుపై టీడీపీ దూకుడు- బాబు జిల్లాల పర్యటనలు!

Publish Date:May 2, 2022

Advertisement

తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. ధరల బాదుడుపై ఆందోళనా కార్యక్రమాలకు పిలుపు నిచ్చిన పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, స్వయంగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల నాలుగు నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటనకు బయలు దేరనున్నారు. నాలుగు నుంచి విడతల వారీగా మహానాడు వరకూ ఆయన ఈ పర్యటనలు కొనసాగించనున్నారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన బాదుడే బాదుడు ఆందోళనా కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటారు.  నాలుగో తేదీన శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం దల్లావలస గ్రామంలో ఆయన పర్యటిస్తారు, ఆ మరుసటి రోజు అంటే 5వ తేదీన భీమిలి నియోజకవర్గం తాళ్లవలసలో పర్యటిస్తారు, ఆరవ తేదీన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కోరింగలో పర్యటిస్తారు. ఈ మూడు సందర్భాలలోనూ కూడా తెలుగుదేశం పార్టీ బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇప్పటికే చంద్రబాబు వైసీపీ పాలనలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలపై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి విదితమే. జగన్ పాలనలో రాష్ట్రం అధోగతిపాలైందని చెబుతున్న చంద్రబాబు, జగన్ సర్కార్ నిర్వాకాలపై ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ కేడర్ కు పిలుపు నిచ్చారు. అలాగే ఏపీలో దారుణాలపై డీజీపీకి లేఖ రాశారు. 
మే 28న ఒంగోలులో తెలుగుదేశం మహానాడు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి క్యాడర్ లో ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ నింపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాట స్ఫూర్తిని నింపడమే లక్ష్యంగా చంద్రబాబు జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.    రాష్ట్రంలో నిరసన గళమెత్తిన వారిపై పోలీసులు, వైసీపీ శ్రేణులూ దాడులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు జిల్లాల పర్యటన పార్టీ క్యాడర్ లో ధైర్యాన్ని నింపుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నించే వారికి తెలుగుదేశం పార్టీ అండ ఉంటుందన్న భరోసాను ప్రజలకు చంద్రబాబు తన పర్యటనల ద్వారా ఇవ్వనున్నారని చెబుతున్నాయి.  రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవకతవకల కారణంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలూ ధరల బాదుడుకు గురౌతున్నారనీ, ప్రభుత్వ అసమర్ధ, అస్తవ్యస్థ విధానాలే రాష్ట్రంలో ధరల బాదుడుకు కారణమని ప్రజలకు అర్ధమయ్యేలా వివరించడానికి చంద్రబాబు జిల్లా పర్యటనలు దోహదపడతాయని చెబుతున్నారు. చంద్రబాబు పర్యటనలతో పార్టీ క్యాడర్ లో  నూతనోత్సాహం నిండటం ఖాయమని అంటున్నారు. అంతే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా జగన్ ఇంకెంత మాత్రం ఉచిత పథకాలు కొనసాగించలేని పరిస్థితి ఉందనీ, ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న జగన్, ఉచితాలు నిలిపివేసి మరింత వ్యతిరేకతను మూటగట్టుకోవడానికి ముందే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్న రాజకీయ పరిశీలకుల విశ్లేషణల నేపథ్యంలో పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేయడం కూడా  బాబు పర్యటనలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

By
en-us Political News

  
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.