Publish Date:May 10, 2022
మాజీ మంత్రి నారాయణ అరెస్టు కక్షపూరితమని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం తమ వైఫల్యానికి కప్పి పుచ్చుకునేందుకే మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పదోతరగతి పరీక్షల నిర్వహణలో విఫలం అయిన ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత, విమర్శలను ఎదుర్కొన్న జగన్ సర్కార్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే నారాయణను అరెస్టు చేసి దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నదన్నారు.
అసలు పేపర్ లీక్ అనేదే లేదంటూ మంత్రి బొత్స ప్రకటన చెయ్యలేదా అన్నారు . మాస్ కాపీయింగ్ కు, పరీక్ష ల నిర్వహణలో వైఫల్యాలకు... నారాయణను ఎలా బాధ్యుడిని చేస్తారని ప్రశ్నించారు. కాగా నారాయణ అరెస్టు సమయంలో ఆయన తన కుమారుడు నితీశ్ వర్థంతి కార్యక్రమంలో ఉన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో కుమారుడు నితీశ్ వర్థంతికి నితీత్ వర్ధంతి కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే ఏపీ సీఐడీ పోలీసులు నారాయణను అరెస్టు చేశారు.
2017 మే 10 తెల్లవారుజామున హైదరాబాద్లోని మాదాపూర్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నితీశ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. కుమారుడి వర్థంతి కార్యక్రమంలో ఉన్న మాజీ మంత్రిని అరెస్టు చేయడం కక్షపూరితం కాకమరేమిటని తెదేపా నాయకులు విమర్శిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/babu-condems-ex-minister-narayana-arrest-25-135696.html
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.