బాలయ్య షోలో ఆగస్టు సంక్షోభం నాటి పరిస్థితులపై బాబు క్లారిటీ

Publish Date:Oct 12, 2022

Advertisement

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవరిస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' సీజన్-2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మిగతా టాక్ షోలకు భిన్నంగా  బాలయ్య షో నడిపించిన తీరుతో సీజన్-1 పెద్ద హిట్ అయింది. అందుకే సీజన్-2 పై ప్రేక్షకుల్లో ఈ స్థాయిలో ఆసక్తి నెలకొంది. పైగా సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్ లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనడంతో అన్ని వర్గాలలోనూ ఈ కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది.  ఈ ఎపిసోడ్ కి సంబంధించిన మంగళవారం విడుదలైన ప్రోమో ఆ ఆసక్తిని వంద రెట్లు పెంచేసింది. చంద్రబాబు తన వ్యక్తిగత, రాజకీయ విశేషాలను ఈ కార్యక్రమంలో ఎలాంటి శషబిషలకూ తావులేకుండా వివరించారని ప్రోమోను బట్టి అవగతమౌతోంది.

అన్నిటికీ మించి 1995లో తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన ఆగస్టు సంక్షోభానికి సంబంధించి ఇంత కాలం విమర్శల, అపవాదుల శిలువ మోసిన చంద్రబాబు తొలిసారిగా నాటి పరిణామాలను, అందుకు దారి తీసిన పరిస్థితులను బాలయ్య నోటి వెంటే చెప్పించారని ఈ ప్రొమోను బట్టి అర్ధమౌతుంది. గత 27 ఏళ్లుగా.. తన రాజకీయ పరిణితిని, పాలనా సమర్ద్యాన్ని నిర్ద్వంద్వంగా  రుజువు చేసుకున్నా 1995 నాటి పరిణామాల విషయంలో విపక్షాలు, ప్రత్యర్థులు చంద్రబాబునే టార్గెట్ చేస్తూ విమర్శించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారనీ, కుటుంబ సభ్యులను ఆయనకు దూరం చేశారనీ ఇలా ఎన్నో రకాలుగా విమర్శలు గుప్పించారు.

అయితే ఆ విమర్శలన్నిటినీ చంద్రబాబే భరించారు. ఆంధ్రప్రదేశ్ భవిత కోసం, అభివృద్ధి కోసం, తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం.. ఎవరెన్ని రకాలుగా విమర్శించినా మౌనం వహించారు. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు పట్ల తనకున్న గౌరవాన్ని, భక్తిని ప్రదర్శిస్తూనే వచ్చారు. విజయవాడలోని హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టడం వంటి పలు చర్యల ద్వారా చంద్రబాబు ఎన్టీఆర్ పట్ల తనకున్న గౌరవ మర్యాదలను ప్రకటిస్తూనే ఉన్నారు. ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇన్నేళ్ల తరువాత.. తెలుగుదేశంలో నాడు ఎన్టీఆర్ పై తిరుగుబాటుకు దారి తీసిన పరిస్థితులపై తన నోటి ద్వారా కాకుండా... ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ నోటి ద్వారా చెప్పించి.. తనపై ఉన్న శిలువ భారాన్ని ఒకింత తగ్గించుకున్నారని అన్ స్టాపబుల్ 2 సెకండ్ ఎడిషన్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో చూసిన వారంటున్నారు. 1995 పరిణామాల అనంతరం ఎన్టీఆర్ కుటుంబం మొత్తం, తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం చంద్రబాబు వెనుక నిలబడటం ద్వారానే నాడు అది రాష్ట్ర భవిష్యత్ కు, ప్రగతికి, పురోగతికి, అభివృద్ధికి అనివార్యం అని నిరూపితమైంది.

అలాగే 1999 ఎన్నికలలో ప్రజలు కూడా చంద్రబాబు నాయకత్వానికి జై కొట్టడం ద్వారా చంద్రబాబు విధానాలకు ఆమోదముద్ర వేశారు. అయినా కూడా వెన్నుపోటు విమర్శను ఆయన ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పటి వరకూ ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఆ విమర్శలను ఖండిస్తూ, లేదా నాటి పరిస్థితులను వివరిస్తూ ఎవరూ బహిరంగంగా ప్రకటనలు చేయలేదు. అందరూ సమష్టిగా చంద్రబాబు వెంట నిలవడం ద్వారా తామేమనుకుంటున్నామో చెప్పకనే చెప్పారు. అయితే వారి మౌనం ప్రత్యర్థులు అవకాశంగా తీసుకుని ఇన్నేళ్లుగా సందర్భం వచ్చినా, రాకున్నా, సమయం అయినా కాకున్నా.. అవే విమర్శలు గుప్పిస్తూ వికృతానందం పొందుతున్నారు. ఇప్పుడు అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2 తొలి ఎపిసోడ్ లో వారి విమర్శలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టక తప్పని రీతిలో చంద్రబాబు బాలయ్య చేతే సమాధానం చెప్పించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.