దాడుల విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా వైసీపీ తీరు.. జనం తిరగబడతారు జాగ్రత్త అంటూ బాబు హెచ్చరిక

Publish Date:Nov 18, 2022

Advertisement

రాష్ట్రంలో ప్రభుత్వం అనేది అసలు ఉందా అనిపించేలా వైసీపీ శ్రేణుల దాడులు ఉంటున్నాయి. వ్యతిరేకించే వారిపై దాడులు, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసే జర్నలిస్టులపై దాడు..ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తినా, కళమెత్తినా దాడులే అన్నట్లుగా ఏపీలో పరిస్థితులు ఉన్నాయి. ఆఖరికి విపక్ష నేత, తెలుగుదేశం అధినేత పర్యటనలలో కూడా వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి.

కుప్పంలో  చంద్రబాబు పర్యటన సందర్బంగా చోటుచేసుకున్న సంఘటనలు మరువక ముందే ఆయన కర్నూలు పర్యటనలో కూడా దాడులు పునరావృతమయ్యాయి. కర్నూలు జిల్లా ఆదోనీ, ఎమ్మిగనూరులో రోడ్ షో సందర్బంగా సోమప్ప సర్కిల్ వద్ద చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. వైసీపీ శ్రేణులే రోడ్ షోను భగ్నం చేయాలన్న ఉద్దేశంతోనే రాళ్ల దాడికి పాల్పడ్డాయంటూ తెలుగుదేశం శ్రేణులు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కర్నాలూ జిల్లా పర్యటనలో అడుగడుగునా జనం బ్రహ్మరథ పడుతున్నారు. ఆయన పర్యటన, రోడ్ షోలకు జనం ప్రభంజనంలా తరలి వచ్చారు. జగన్ సర్కార్ పై జనాగ్రహం విపక్ష నేత పర్యటనకు జనం పోటెత్తడంలో ప్రస్ఫుటంగాకనిపిస్తోంది. అసంఖ్యాకంగా తరలివచ్చిన సన సముద్రాన్ని చూసి చంద్రబాబు సైతం మరింత ఉత్సాహంతో అధికార పక్షంపై ఈటెల లాంటి మాటల విమర్శలను సంధిస్తున్నారు.

చంద్రబాబు ప్రతీ మాటకూ, ప్రతీ విమర్శకూ జనం నుంచి విశేష స్పందన వస్తోంది. దానిని చూసి రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు ముందుకు కదులుతున్నారు. జగన్ సర్కార్ నుంచి రాష్ట్రానికి తెలుగుదేశం అధికారంలోకి రావడం తోనే విముక్తి కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ దుష్ట పాలనకు ఓటుతో బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. సోమప్ప సర్కిల్ లో తన కాన్వాయ్ పై జరిగిన రాళ్ల దాడిని ప్రస్తావిస్తూ నేరుగా ముఖ్యమంత్రినే సవాల్ చేశారు చంద్రబాబు. ముఖ్యమంత్రీ లా అండ్ ఆర్డర్ నీ చేతిలో ఉంది.. నా కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఎక్కడికెళ్లినా దాడులకు పాల్పడుతున్నారు.

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత నీది. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి నాపై రాళ్ల దాడులకు పాల్పడుతున్నావు. ప్రజలు తిరగబడితే నేను బాధ్యుడను కాను అని హెచ్చరించారు. ‘ఈ రోడ్‌ షోకు వచ్చిన జనాలను చూసి వైకాపా వారి కళ్లు తిరిగాయి. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం ఈ జన ప్రభంజనంతో ప్రస్ఫుటమౌతోంది ’ అని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘నేను ముఖ్యమంత్రిగా మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు మీరందరూ ఆశీర్వదించాలన్నారు’ రాయలసీమలోనే మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ జనం స్వచ్ఛందంగా ముక్త కంఠంతో నినదిస్తున్నారు. చంద్రబాబు తాను రాజకీయాలలో కొనసాగాలో లేదో మీరే నిర్ణయించాలని అని అనడం ఆఖరి అవకాశం లాస్ట్ చాన్స్ అని అడగడం కాదని తెలుగు దేశం నేతలు అంటున్నారు.

రాష్ట్రం బాబుపడేందుకు ఆయన ఆఖరి అవకాశం ఇస్తున్నారని వివరిస్తున్నారు. కాదు మరో సారి జగన్ కే అవకాశం ఇద్దాం అనుకుంటే  రాష్ట్రం వల్లకాడు అయిపోవడం ఖాయమనీ, అప్పుడు వగచినా ప్రయోజనం ఉండదనీ వల్లకాడును ఏలడానికి ముందుకు ఎవరొస్తారని వారంటున్నారు. 

By
en-us Political News

  
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి ఒక్కసారిగా భారీగా పెరిగింది.
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కీలకమైన ముసాయిదా నిబంధనను తెరపైకి తెచ్చింది.
భారతీయ సైన్యంలో అత్యున్నత ప్రమాణాలుగా భావించే క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు దర్శించుకున్నారు
ఢిల్లీలో తీవ్ర సంచలనం సృష్టించిన పరిణామాల మధ్య కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు న్యాయస్థానం ఊరటనిచ్చింది.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయాననే అసంతృప్తి.. కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భర్తపై ద్వేషంగా మారిందా? కాపురం ప్రారంభమై నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు తీసుకున్న నిర్ణయం
సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్, లైక్స్ సంపాదించాలనే దురాశతో కొందరు యువకులు రోజుకో ప్రమాదకర చర్యకు పాల్పడుతున్నారు.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
ఇంటర్నెట్ వినియోగం కేవలం పెద్దలకే పరిమితం కాదు, పిల్లలకు కూడా ఇదొక ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు.. ఎన్నో ఆశలతో నిద్రలోకి జారుకున్నారు.. కానీ తెల్లవారేసరికి ఆ ఇంట్లో ఐదుగురు విగతజీవులుగా కనిపించారు
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.