జైల్లో చంద్రబాబు.. జగన్ తో పాటు మోడీకీ తగులుతున్న నిరసన సెగ!

Publish Date:Oct 6, 2023

Advertisement

తెలుగుదేశం అధినేత   చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లి నాలుగు వారాలు కావస్తుంది. ఒకటి రెండు రోజుల్లో బాబు బయటక వచ్చేస్తారని ముందుగా అంతా భావించారు. టీడీపీ శ్రేణులైతే మహా అయితే వారం రోజులలో తమ అధినేత కడిగిన ముత్యంలా వచ్చేస్తారని ఊహించారు. కానీ, కోర్టులలో మాత్రం వారాలకు వాయిదాలు పడుతోంది. తెలుగుదేశం  శ్రేణులేమో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి.  చంద్రబాబు కుటుంబ సభ్యులు రాజమండ్రిలో మకాం వేశారు. ఏసీబీ కోర్టు నుండి హైకోర్టు.. హైకోర్టు నుండి సుప్రీంకోర్టు అన్నట్లే ఈ కేసు వ్యవహారం సాగుతోంది.

అటు విచారణకు ఆదేశిస్తారా? లేక కేసు కొట్టేస్తారా?.. విచారణకు సహకరించాలని చెబుతూనే బెయిల్ మంజూరు చేస్తారా అన్న స్పష్టత లేదు. నాలుగు వారాలు అవుతున్నా అసలు ఈ కేసు విషయంలో చంద్రబాబు అవినీతికి సంబంధించి ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా సీఐడీ చూపలేకపోయింది. అరెస్టు చేశాం కదా, ఇప్పుడు చంద్రబాబును విచారించి ఆధారాలు సంపాదిస్తామనే చెబుతోంది. ఇంత స్పష్టంగా ఏసీబీ డొల్లతనం బట్టబయలైనా.. సాంకేతిక కారణాలతో చంద్రబాబు క్వాష్ పిటిషన్ సుప్రీంలో వాయిదాల పర్వంతో నడుస్తోంది. ఇక  సుప్రీం కోర్టు ఏం చెప్తుందన్న అంశంపై ఆధారపడి ఏసీబీ కోర్టు ఇక్కడ వారాలకు వారాలు చంద్రబాబు  రిమాండ్ ను పొడిగిస్తున్నది.  అయితే చంద్రబాబు కేసు వాయిదాలపై ఇప్పుడు జనంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్నదే అక్రమమని, కేవలం కక్షపూరిత చర్యలో భాగంగా వైసీపీ ప్రభుత్వం సీఐడీని ఉసిగొల్పిందని పరిశీలకులు విశ్లేషణలతో సహా ఎప్పుడో చెప్పేశారు. చంద్రబాబుపై బనాయించిన సెక్షన్లు కూడా తీవ్ర అభ్యంతరమైనవని చెప్తూ న్యాయనిఫుణులు,రిటైర్డ్ సివిల్ సర్వీసు అధికారులు కుండబద్దలు కొట్టారు. చంద్రబాబుకు మద్దతుగా   నిలిచారు. కేవలం సీఎం జగన్  కక్ష సాధింపు కోసమే సీఐడీ ద్వారా చంద్రబాబును అరెస్టు చేయించారని జనం నమ్ముతున్నారు. అంతే కాదు కేవలం సీఎం జగన్ ఒక్కరే ఈ కుట్రలో భాగం కాదని.. చంద్రబాబు అరెస్ట్ కేంద్ర పెద్దలకు తెలిసే జరిగిందని.. ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షాల అండతోనే ఇది సాధ్యపడిందని రాజకీయ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. వైసీపీ నేతలు కూడా బహిరంగంగానే చంద్రబాబు అరెస్టుకు కేంద్రం పెద్దల మద్దతు ఉందని చెబుతున్నారు.   ఇప్పుడు న్యాయస్థానాలలో ఈ కేసు వారాల తరబడి సాగదీతపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే కేంద్ర పెద్దలు ఈ కేసు కొలిక్కి రాకుండా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ వాయిదాల మీద వాయిదాలు వేయడం, తీర్పును రోజుల తరబడి రిజర్వ్ చేయడం వంటి వాటితో పాటు..  సీఐడీని కేసు వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ వారాల తరబడి గడువు ఇవ్వడం చూస్తుంటే  న్యాయ వ్యవస్థను కూడా   కేంద్రం పెద్దలు ప్రభావితం చేస్తున్నారా అనే పరిశీలకులే కాదు.. సామాన్య జనం కూడా అనుమానిస్తున్నారు 

అసలే ఈడీ, సీబీఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలను  కేంద్రం గుప్పిట్లో పెట్టుకుని తన రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నదన్న విమర్శలు, ఆరోపణలు ఇప్పటికే ఉండగా.. చంద్రబాబు విషయంలో  కూడా  కేంద్రం హస్తం ఉందన్న నమ్మకం జనబాహుల్యంలో రోజురోజుకూ బలపడుతోంది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ సుప్రీం కోర్టులో సత్వర విచారణకు నోచుకోకపోవడం వెనుక మోడీ, షాల ఒత్తడి, ప్రమేయం ఉందని జనం భావిస్తున్నారు.  దీంతో తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా చంద్రబాబు అరెస్టు విషయంలో ప్రధాని మోడీపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఇప్పటికే  పార్టీలకు అతీతంగా జాతీయ స్థాయి నేతలు చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. మమతా బెనర్జీ నుండి ఫరూక్ అబ్దుల్లా వరకూ.. అఖిలేష్ యాదవ్ నుండి తెలంగాణ నేతల వరకూ అందరూ చంద్రబాబు అరెస్టును ఖండిస్తూనే ఉన్నారు. చివరాఖరికి కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ కూడా చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడారు. చంద్రబాబు తప్పు చేసే వ్యక్తి కాదనీ, ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారనీ పేర్కొన్నారు.  

చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో జగన్ సర్కార్ కు దన్నుగా నిలిచిందన్న ఆగ్రహం బీజేపీపై వ్యక్తమౌతున్నది. ఆ పార్టీ ఏపీ నాయకులు కూడా చంద్రబాబు అరెస్టు వల్ల జగన్ మాత్రమే కాదు.. తాము కూడా తీవ్ర ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్నామని బాహాటంగానే చెబుతున్నారు. త్వరలో ఏపీ బీజేపీ నేతల బృందం హస్తినకు వెళ్లి పరిస్థితిని తమ హైకమాండ్ కు వివరిస్తామనీ, కచ్చితంగా మోడీ, షాలు చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రకటన చేసేలా చూస్తామని అంటున్నారు.  మొత్తం మీద చంద్రబాబు అరెస్టు ప్రభావం ఏపీలో వైసీపీ పతనాన్ని ఖరారు చేసేసిందనీ, అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఈ ప్రభావం జాతీయ స్థాయిలో మోడీ సర్కార్ పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తాజాగా వెల్లడైన శ్రీ ఆత్మసాక్షి సర్వే  కూడా చంద్రబాబు అరెస్ట్ తర్వాత బీజేపీపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందని పేర్కొంది. 

By
en-us Political News

  
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.