ఇటు నుంచి బాబు.. అటు నుంచి పవన్.. జగన్ ఉక్కిరి బిక్కిరి

Publish Date:Jun 20, 2022

Advertisement

ఓ వంక రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించిన జిల్లాల పర్యటనలు సక్సెస్ఫుల్’గా సాగుతున్నాయి. జననీరాజనాలు అందుకుంటూ, చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. స్వచ్చందంగా తరలి వస్తున్న జనం వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ‘ఒక్క ఛాన్స్’ ఇచ్చి తప్పు చేశామని, మళ్ళీ ఆ తప్పు చేయబోమని అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఈసారి ‘మా ఓటు, సైకిల్ గుర్తుకే’ అని ఓపెన్’గా చెపుతున్నారు. చంద్రబాబు  పర్యటనకు ప్రజల నుంచి వస్తున్న అద్భుత స్పందన సహజంగానే  తెలుగు దేశం కార్యకర్తలు, నాయకుల్లో కొత్త ఉత్సాహం నింపుతోందని, గెలుపు మీద విశ్వాసం పెచుతోంది

అందుకే ఇంతకాలం కొంత స్తబ్దుగా ఉన్న కార్యకర్తఃలు, నాయకులు ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో జనంలోకి వెళుతున్నారు. రైతులు, యువత, ఉద్యోగులు, మహిళలు ఒకరని కాదు, జగన్ రెడ్డి బాదుడుతో విసిగిపోయిన అందరూ,  అన్నివర్గాల ప్రజలు మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు,అవుతారన్న విశ్వాసం వ్యక్త  పరుస్తున్నారు.ఆదలా ఉంటే, ఇటు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర వైసీపీ నేతలలో వణుకు పుట్టిస్తోంది. పవన్ కళ్యాణ్, కౌలు రైతుల భరోసా’ యాత్రాలో  కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటుగా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని పొట్టుపొట్టుగా తూర్పార పడుతున్నారు.

కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేయడం రాజకీయ జిమ్మిక్’గా చులకన చేసి చూపే ప్రయత్నం చేస్తున్న వైసీపీ నేతలకు సినిమాటిక్’గా చురకలు అంటిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి, వైసీపీ నేతలకు ఎక్కడ తగలాలో అక్కడతగిలేలా పదునైన వ్యంగ్య విమర్శనాస్త్రాలు  సంధిస్తున్నారు. సర్కార్’ ను, అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రాబు దత్తపుత్రుదంటూ, వైసీపీ నేతల చేస్తున్న  విమర్శలను తిప్పుకోడుతూ, ‘నేను ప్రజల దత్తపుత్రుడినే కానీ, ఇంకెవరి దత్తపుత్రుడినో కాదు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా సీబీఐ దత్తపుత్రుడే” అంటూ ఘాటుగా చురకలు అంటించారు. 

 అలాగే జగన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాలను ఎరగా వేసి, ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటోందని తీవ్ర పదజాలంతో విమర్శించడమే కాకుండా, జనసేన అధికాంలోకి వస్తే, సర్కార్ దోపిడి ఉండదని, భరోసా ఇస్తున్నారు. తాజాగా బాపట్ల జిల్లాలో 80 మంది కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించైనా సందర్భంగా పర్చూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్వకాలను, ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా దోచుకుంటోంది వివరించారు. జనసేన అధికారంలోకి వస్తే దోపిడిని అరికట్టి  యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.వైకాపా నాయకులకు లక్ష కోట్లు దోపిడీ చేసే సత్తా ఉంటే,  జనసేనకు 2.5లక్షల ఉద్యోగాలు ఇచ్చే సత్తా  ఉందని అన్నారు.  

జగన్ రెడ్డి పై ఉన్న అవినీతి, అక్రమాస్తుల కేసులను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఆయనకు అధికారంలో కొనసాగే అధికారమే లేదని అన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ యువకులకు ఏదైనా ఉద్యోగం రావాలంటే ఎలాంటి క్రిమినల్‌ కేసులు ఉండకూడదు.కానీ,  క్రిమినల్‌ కేసులు ఉన్న వారు ఎమ్మెల్యేలు ఎలా అవుతున్నారు? ప్రజా ప్రతినిధులకు ఒక రూల్‌.. సామాన్యులకు మరొక రూలా? అంటూ అర్హత లేని వారు రాష్ట్రాన్ని పలిస్తున్నారని ఎద్దేవాచేశారు. 

అదే విధంగా ముఖ్యమంత్రి పదవి తనకు ముఖ్యం కాదని, ముఖ్యమంత్రి కాకపోతే  రాజకీయాల్లోంచి వెనక్కి వెళ్లి పోయేందుకు పార్టీ పెట్టలేదన్నారు. పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదు. పొత్తు ప్రజలతోనే, 2009లో ఏం చెప్పానో అదే చేస్తా. ప్రజల కోసం, ప్రత్యేక హోదాకోసం ప్రధానమంత్రితో విభేదించా. వ్యక్తిగతంగా నష్టపోయా. రాజకీయాల్లో ప్రజలు ముందుకెళ్లేలా చేయడమే నా తపన. నాకు ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదు. దసరా తర్వాత వైకాపా నాయకుల సంగతి చూస్తాం. అప్పటి వరకు మీరేం మాట్లాడినా భరిస్తాం’ అని పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. 

ఇలా ఇటు నుంచి చంద్రబాబు, అటు నుంచి పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై సాగిస్తున్న దండయాత్ర ముఖ్యమంత్రికి మింగుడు పడడం లేదు.దీంతో ప్రభుత్వం అడకత్తెరలో పోక చెక్కాలా నలిగిపోతోంది.మరో వంక గడపగడపన ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన, ప్రశ్నల వర్షానికి సమాదానం చెప్పలేక ఎమ్మెల్యేలు, మంత్రులు బిక్క ముఖం వేస్తునారు.

అలాగని,వాస్తవ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేసినా ముఖ్యమంత్రి వినేందుకు సిద్దంగా లేరు. ఆయన అంతా బాగుంది అనే భ్రమల్లో ఉన్నారు. అదొకటి అలా ఉంటే... చంద్రబాబు, పవన్ కళ్యణ్ కలిసి పోవడం ఖాయమని తేలిపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహా వైసీపీ నేతలు దారులు వెతుక్కుంటున్నారని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు   ‘అధికారాంతమునందు చూడవలె నయ్యంగారి సౌభాగ్యముల్’ పద్యాన్ని గుర్హ్తు చేసుకుంతూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పరిస్థితి అక్షరాలా అలాగే ఉందని  అంటున్నారు.

సొంత  పార్టీలోనే పరిస్థితి అలా ఉంటే, ఇక సామాన్య ప్రజల్లో, జగన్ రెడ్డి పలుకుబడి ఏమిటో వేరే చెప్పనక్కరలేదు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? ఎప్పుడు, ‘ఒక్కచాన్సు’ భారాన్ని దించుకుందామా .. అని జనం ఎదురు చూస్తున్నారు. ఇది జనవాక్యం.

By
en-us Political News

  
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.