గుడివాడపై చంద్రబాబు గురి!

Publish Date:Jun 24, 2022

Advertisement

పరిపాల‌నలో  విఫ‌ల‌మ‌యిన జ‌గ‌న్  ఆయ‌న మంత్రివ‌ర్గం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తెలుగుదేశం మీద నోరు పారే సుకోవ‌డం ఈ మ‌ధ్య కాలంలో చాలా అతిగా వుంది. త‌మ పాల‌న‌లో లోపాల్ని దిద్దుకోవ‌డం చేత‌గాక, త‌మ‌లో తామే విభేదించుకుంటూ కాలం నెట్టుకొస్తున్న వైసీపీకి  ఇక నూక‌లుచెల్లిన‌ట్టే. వైసీపీ నాయ‌కులు ఎక్క‌డికి వెళ్లినా ప్ర‌జ‌లు ఎదురు ప్ర‌శ్న‌ల‌తో త‌రిమికొడుతున్నారు. ఈ ప‌రిస్థితుల‌తో వారికి  ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు, అభిమానం కోల్పోయామ‌న్న‌ది మ‌రింత స్ప‌ష్ట‌మ‌యింది.  వైసీపీ ప్రభుత్వ నిర్వాకానికి ప్ర‌జ‌ల ఆశ‌లు అడి యాస‌ల‌య్యాయి. ఇపుడు రాష్ట్ర ప్ర‌జ‌లంతా తెలుగుదేశం వేపై ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.  ఈ ప‌రిస్థితు ల్లో తెలుగు దేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు ముందుగా గుడివాడ పై దృష్టిసారించారు. 

గుడివాడ ఎమ్మ‌ల్యే, మాజీ మంత్రి కొడాలి నానికి  చెక్ పెట్టాల‌న్న ల‌క్ష్యంతో తెలుగుదేశం అధినేత చంద్ర బాబు స్వ‌యంగా  రంగంలోకి దిగుతున్నారు. ఈ మేర‌కు ఆ పార్టీ వ‌ర్గాలు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి.  నాలుగు ప‌ర్యాయాలు గుడివాడ నుంచి  గెలిచిన కొడాలి నాని ఇప్ప‌టికీ  త‌న వ్య‌వ‌హార తీరును  మార్చుకోలేదు. ప్ర‌జ‌లు  ఆయ‌న్ను అస‌హ్యించుకుంటున్నారు. ఇలాంటి వారిని మ‌రోసారి గెలవ‌నీయ‌కుండా చూడాల‌ని తెలుగుదేశం అధినేత ప‌ట్టుద‌ల‌తో వున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సంద ర్భంగా ఆయన జన్మించిన ప్రాంతం గుడివాడలో భారీ బహిరంగ సభ నిర్వహించి, తద్వారా కొడాలి నాని, వైసీపీ ఆగడాలకు, దూకుడుకు చెక్ పెట్టేందుకు టీడీపీ  అగ్రనేతలు  కత్తులు దూస్తున్నారని సమాచారం.

అవసరం ఉన్నా లేకపోయినా టీడీపీని, మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ పై నోరేసుకుని పడిపోయి, బూతులతో విమర్శలు చేసే కొడాలి నాని  అంటే టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. మంత్రి పదవి నుంచి తనను జగన్ రెడ్డి  పీకి పారేసినా కూడా  కొడాలి తన  బూతు పంచాంగాన్ని ఆపడం లేదు. నాలుగుసార్లు ఓట్లు వేసి  గెలిపించి  అసెంబ్లీకి  పంపించిన గుడివాడ నియోజకవర్గం ప్రజలకు ఆయన  చేసిందేమీ లేదు. నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. రోడ్ల  దుస్థితి  చెప్పక్కర్లేదు. రోజూ అనేక  స్థానిక, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిచే గుడివాడ బస్సాండ్ దుస్థితి కొడాలి నాని పనితీరుకు ప్రత్యక్ష నిలువెత్తు నిదర్శనం.

గురివింద గింజ తన నలుపు సంగతి ఎరుగదు అన్న చందంగా కొడాలి నాని తీరు ఉందనే విమర్శలు సర్వత్రా వస్తున్నాయి. గుడివాడ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలున్నా పట్టించుకోకుండా పేకాటలు, భూ ఆక్రమణలు, క్యాసినోల నిర్వహణలో తలమునకలయ్యే కొడాలి నాని చంద్రబాబు పైనా, లోకేష్ పైనా నిత్యం అసందర్భ, అనుచిత ప్రేలాపనలతో కాలక్షేపం చేస్తుండడాన్ని నియోజకవర్గం ప్రజలు మొత్తం గమనిస్తూనే ఉన్నారు. ఆ విధంగా విరుచుకుప‌డ‌టం త‌న‌కు, త‌న పార్టీకే న‌ష్ట‌మ‌న్న ఇంగితం కూడా లేక‌పోవ‌డం విడ్డూరం. 

కొడాలి నానిని, టీడీపీ వ్యవస్థాపకుడి సొంత నియోజకవర్గం గుడివాడను ఇలాగే వదిలేస్తే మంచిది కాదని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఈ నెల 29న కృష్ణా జిల్లా మహానాడులో భాగంగా గుడివాడలో లక్ష మందితో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. గుడివాడ సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేసేందుకు టీడీపీ నేతలు నడుం బిగించారు. గుడివాడ సభను గ్రాండ్ సక్సెస్ చేయడం ద్వారా నియోజకవర్గంలో పట్టు నిలబెట్టుకోవాలని, బూతుల నేతకు మూతి వాచేలా చెక్ చెప్పా లనే లక్ష్యంతో టీడీపీ నేతలు, శ్రేణులు సిద్ధం అవుతున్నారు.

గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే, గుడివాడ టీడీపీ ఇన్ చార్జి రావి వెంకటేశ్వర రావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ చంద్రబాబు బహిరంగ సభను దిగ్విజయం చేసేందుకు పూర్తిస్థాయిలో రంగంలో దిగారు. కేసినో వ్యవహారంలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గుడివాడలో పర్యటించి నప్పుడు స్థానిక టీడీపీ నేతలను గుడివాడ నాని అండ్ కో భయపెట్టి.. బయటకు రాకుండా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 
ఇలాంటి పరిస్థితుల్లో గుడివాడలో బహిరంగ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ అధిష్టానం నేరుగా రంగంలో దిగడం విశేషం. గుడివాడలో బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలనే దానిపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్థానక నేతలతో ఇప్పటికే చర్చలు జరిపారు. భారీ బహిరంగ సభకు అనుకూలంగా ఉండే స్థలా ల్ని కూడా ఆయన పరిశీలించారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కూడా గుడివాడ నేతలతో సమావేశం నిర్వహించారు. జనసమీకరణను సవాల్ గా తీసుకోవాలని వారికి అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు.

చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలో భాగంగా ఈ నెల 29 సాయంత్రం గుడివాడలో మహానాడు, బహిరంగసభ నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి ఎన్టీఆర్ పుట్టిన ఊరు నిమ్మకూరులో బస చేస్తారు. 30వ తేదీ ఉదయం బందరు పార్లమెంటరీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షను సక్సెస్ చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ‘బాదుడే .. బాదుడు’ అంటూ చంద్రబాబు చేస్తున్న ఏపీ వ్యాప్త పర్యటనలకు జనం నుంచి భారీ స్పందన వస్తోంది. గుడివాడలో కూడా తమ సత్తా చూపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. కొడాలి నాని నోటికి తాళం వేసేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తు న్నారు.

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.