Publish Date:Jul 13, 2022
పూర్వం కవల పిల్లల్ని చూసి ఆశ్చర్యపడేవారు, ఆ తర్వాత ఒకేలా వ్యవహరించే పిల్లల్ని చూసి ఆశ్చర్యపడేవారు, మనిషిని పోలిన మనుషులు లోకంలో ఏడుగురు వుంటారని ఓ చిత్రమైన సిద్ధాంతం చాలా ప్రచారంలో వుంది. ప్లారిడాకు చెందిన క్రిస్టిన్ లామర్ట్ ఆనందం మరో రకం. ఆమెకు ముగ్గురు పిల్లలూ మూడేళ్ల తేడాతో జన్మించారు.. అదీ ఒకే తేదీన!
తన ముగ్గురు పిల్లలు సోఫియా, గ్యులియానా, మియాలు ఆగస్టు 25నే పుట్టడం చిత్రంగా వుందని, దైవ కృపగా భావిస్తున్నానని అన్నది తల్లి క్రిస్టిన్. ఆమే కాదు చుట్టుపక్కలవారూ ఎంతో ఆశ్చర్యపడుతున్నారు. ఇదెలా సాధ్యం?.. ప్రతీవారూ వేసుకుంటున్న ప్రశ్న. ఆరేళ్ల సోఫియా 2015 ఆగస్టు 25న పుట్టింది. మూడేళ్ల గ్యులియానా 2018లో అదే తేదీన పుట్టింది. చిన్నారి మియా 2021 లో అదే తేదీన జన్మించింది! అంటే ఆగస్టు 25వ తేదీ ఆ యింట, ఆ వీధి వీధంతా పుట్టినరోజు పండగే.. ప్రతీ సంవత్సరం!
పెద్ద పిల్ల సోఫియాని కడుపుతో వున్నపుడు తనకు ఆగస్టు 23న బిడ్డ పుట్టవచ్చని డాక్టర్లు క్రిస్టిన్ తో అన్నారు. కానీ సోఫియా 25వ తేదీన పుట్టింది. రెండో బిడ్డ సమయంలో డాక్టర్లు చెప్పినట్టే జరుగుతుందని ఆశించింది. కానీ చాలా చిత్రంగా ఆగస్టు 25నే జన్మించి డాక్టర్లను ఆశ్చర్యపరిచింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/babies-born-on-same-date-39-139678.html
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.