ఉపరాష్ట్రపతి ఎన్నిక బీఆర్‌ఎస్‌కీ ముందు నుయ్యి... వెనుక గొయ్యి
Publish Date:Aug 19, 2025
Advertisement
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేరు ప్రకటించటంతో బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉన్నట్లుండి తెలంగాణకు చెందిన వ్యక్తిని ఎలా ఎంపిక చేశారంటూ చర్చించుకోవడం మొదలైంది. దీని వెనుక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రమేయం ఉందని అంటున్నారు. లేకుంటే సడన్‌గా ఆయన పేరు తెరపైకి ఎలా వచ్చిందంటూ అప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు చర్చ మొదలైంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎటువైపు అడుగులు వేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది. దీంతో బీఆర్ఎస్ లోగుట్టు బయటపడడం ఖాయమని అంటున్నారు. స్థానిక వ్యక్తికి బీఆర్ఎస్ సపోర్టు చేస్తుందా? ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇస్తుందా? ఈ వ్యవహారం బీఆర్ఎస్‌కు మింగుడుపడడం లేదు. బీఆర్ఎస్ కు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు . రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వలేని పరిస్థితి. రాజకీయాల్లో జాగ్రత్తగా అడుగులు వేయాలి. లేకుంటే పార్టీ ఫినిష్ అవుతుంది. ఇప్పుడు అసలైన పరీక్ష కారు పార్టీకి ఎదురైంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక బీఆర్‌ఎస్ పార్టీకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నచందంగా మారింది. ఎందుకంటే ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ప్రకటించింది బీజేపీ. మరోవైపు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతు ఏ రాజకీయ పార్టీలో నాకు సభ్యత్వం లేదని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పొలిటికల్ పార్టీతో ప్రమేయం లేని వ్యక్తి తమ అభ్యర్థిగా ఉండాలని ఇండియా కూటమి భావించి ఉండవచ్చని అందులో భాగంగానే నా పేరును ప్రతిపాదించి ఉండవచ్చన్నారు. తన అభ్యర్థిత్వంపై తనను అడాగరని అందుకు నేను అంగీకరించానని చెప్పారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి తన పేరు ఖరారు చేసిన నేపథ్యంలో ఓ న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి.. సౌత్, నార్త్ ఇదంతా అర్థవంతమైనటువంటి చర్చ కాదన్నారు. పార్టీలతో నిమిత్తం లేకుండా అదరి మద్దతు అడుగుతానని చెప్పారు.
http://www.teluguone.com/news/content/b-sudarshan-reddy-39-204565.html





