మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం రేపు

Publish Date:Oct 30, 2025

Advertisement

తెలంగాణ కేబినెట్ లో అజారుద్దీన్ చేరనున్నారు. రేవంత్ కేబినెట్ లో అజారుద్దీన్ చేరికకు ముహూర్తం ఖారారైంది. శుక్రవారం (అక్టోబర్ 31) మధ్యాహ్నం 12గంటల 15 నిముషాలకు అజారుద్దీన్ మంత్రగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  రాజ్ భవన్ లో ఆయన  చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. అలాగే అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు తెలిపారు.   

ఇలా ఉండగా అజారుద్దీన్‌కి హోం లేదా మైనారిటీ మంత్రిత్వ శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలియవస్తున్నది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఆయనను నామినేట్ చేసి ఇప్పుడు కేబినెట్ లోకి తీసుకుంటున్నారు.  కాగా జూబ్లీ ఉప ఎన్నిక వేళ  అజారుద్ధీన్ కు మంత్రి పదవి ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడం ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేయడానికేనని ఆరోపించింది.  అయితే బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. మైనారిటీ వర్గాలకు మంత్రిపదవి ఇస్తుంటే బీజేపీకి అభ్యంతరం ఎందుకని డిప్యూటీ సీఎం మల్లుభట్టివిక్రమార్క అన్నారు. అలాగే  పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. అయితే అజారుద్దీన్ కు మంత్రిపదవిపై బీజేపీ అభ్యంతరాలు తెలుపుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తే, బీజేపీ, బీఆర్ఎస్ లు అడ్డుకోవాలని చూస్తున్నాయన్నారు. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అయిన అజారుద్దీన్ సుదీర్ఘకాలం దేశానికి సేవలందించారన్నారు.   రాజస్థాన్ లో ఉప ఎన్నిక అభ్యర్థి ని   బీజేపీ గతంలో  మంత్రిని చేసిందని గుర్తు చేశారు.  శ్రీ గంగానగర్ జిల్లా  శ్రీ కరణ్ పూర్ నియోజకవర్గం ఉప ఎన్నిక బీజేపీ  అభ్యర్థిగా ఉన్న సురేంద్ర పాల్ సింగ్ ను ఉప ఎన్నికకు సరిగ్గా 20 రోజుల ముందు మంత్రిని చేసిందనీ, అటువంటి బీజేపీ ఇప్పుడు అజారుద్దీన్ ను మంత్రిని చేస్తుంటే ఎందుకు అభ్యంతరం పెడుతోందని ప్రశ్నించారు. మంత్రిగా అజారుద్దీన్ మైనార్టీల శ్రేయ‌స్సుకోసం కృషి చేస్తార‌న్న న‌మ్మ‌క‌ముందన్నారు.

By
en-us Political News

  
2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఎవరికీ అంత సులువుగా కనిపించడం లేదు.
అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటివరకు చట్టపరమైన స్పష్టత లేదనీ, ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ-అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పీకర్ వివరించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
భార్య పేరుతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. చిత్తూరు జిల్లాలో తమ పీఎల్ఆర్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన బకాయిలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. అయితే న్యాయమూర్తి జస్టిస్ దిపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసం ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోబోమని విస్పష్టంగా పేర్కొంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 28 రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశం ఎజెండా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమెదించడమే. ఇది ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగుగా భావించవచ్చు.
భారతంలో ద్రౌపదిని వివస్త్రను చేయడానికి కౌరవులు ప్రయత్నిస్తే.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగల్చడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే కురుక్షేత్రంలో కౌరవులు ఓడిపోయినట్టుగా.. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసింది.
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు
1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న నంబర్ 24, అక్బర్ రోడ్ భవనాన్ని ఈ నెల 28 లోగా అంటే శనివారం లోగా ఖాళీ చేయాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసింది.
జ‌గ‌న్ లెవ‌న్ పై మీమ్స్ గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. పంజాబ్ కింగ్స్ లెవ‌న్ లాగా.. జ‌గ‌న్స్ లెవ‌న్ అనే పేరు మీద మీమ్స్ వెల్లువెత్తాయి. ఇక తాజాగా కొత్త పార్లమెంట్ భవనంలో వైసీపీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ కేటాయించినది కూడా 11వ నెంబర్ రూమే.
ఇక 2026 త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ప‌లుర‌కాల ఉచితాల వ‌ల ప‌న్నాయంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు.
ఇక టికెట్ ధరల పెంపు అనేది కేవలం పవన్ కల్యాణ్ కోసం తీసుకున్న నిర్ణయం కాదని, నిర్మాతల నుంచి వచ్చే అభ్యర్థనల మేరకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం తీసుకునే నిర్ణయమని స్పష్టం చేశారు. ఈ పిటిషన్ వెనుక కేవలం రాజకీయ దురుద్దేశాలు తప్ప, ప్రజా ప్రయోజనం లేదన్నారు.
నియోజకవర్గాల పెంపు కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ బలం మరింత దిగజారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
భారీగా ఆర్వోల తొలగింపు వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఒకే సారి 72 మంది ఆర్వోలను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించిదే తప్ప అదుకు కారణాలను వెల్లడించలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.