మళ్లీ సుప్రీంకు అవినాష్?

Publish Date:May 22, 2023

Advertisement

సీబీఐ తనను అరెస్టు చేయకుండా ఆదేశించాలని కోరుతూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. వెకేషన్ బెంచ్ ముందు తన బెయిల్ పిటిషన్ న మెన్షన్ చేయనున్నారు. గతంలోనే హైకోర్టు వెకేషన్ బెంచ్ తన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారించేలా ఆదేశించాలని సుప్రీంలో అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే.

అయితే ఆ పిటిషన్ విచారణకు సుప్రీం కోర్టు తేదీ ఖరారు చేయలేదు. జూన్ రెండో వారంలో విచారణకు అనుమతిస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే  సోమవారం (మే22) సీబీఐ అవినాష్ ను దాదాపుగా చుట్టుముట్టి అరెస్టు చేయడానికి సిద్ధం అయిన నేపథ్యంలో అవినాష్ మరో సారి సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు తన బెయిల్ పిటిషన్ మెన్షన్ చేయాలని నిర్ణయించుకున్నారు.  హై కోర్టు వెకేషన్ బెంచ్ ముందు తన బెయిలు పిటిషన్ దాఖలు చేసేంత వరకూ తనను అరెస్టు చేయవద్దని సుప్రీంను అవినాష్ అభ్యర్థించే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.   

అరెస్టు అనివార్యం అని తేలిపోయినా, సుప్రీం కోర్టు పదే పదే సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని చెబుతున్నా అవినాష్ ఎందుకు పరుగులు తీస్తున్నారు. మళ్లీ మళ్లీ కోర్టు మెట్లెక్కుతున్నారు? అన్న ప్రశ్నకు ఆయన ఆశలన్నీ ఈ నెల 26న ఏపీ ముఖ్యమంత్రి జగన్ హస్తిన పర్యటన మీదే ఉన్నాయని అంటున్నారు.

జగన్ హస్తన వెళ్లే వరకూ తన అరెస్టును నిలువరించుకోగలిగితే అక్కడ ఆయన ఎలాగోలా చక్రం తిప్పి సీబీఐ అరెస్టు నుంచి తనను కాపాడగలరని అవినాష్ హోప్ ఫుల్ గా ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. గతంలో అవినాష్ అరెస్టునకు సీబీఐ రంగం చేసిన సందర్భంలో జగర్ హస్తిన వెళ్లి రాగానే  అరెస్టు విషయం వెనక్కు వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరో సారి అటువంటిదే ఏదో ఒకటి జగన్ చేయగలర్న నమ్మకంతోనే ఎలగైనా ఈ నెల 26 వరకూ సీబీఐకి చిక్కకుండా తప్పించుకోవాలని అవినాష్ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 అయితే ఇంత వరకూ వచ్చిన తరువాత సీబీఐ కూడా అవినాష్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుందనీ, అందుకే ఢిల్లీలోని సీబీఐ కేంద్ర  కార్యాలయం స్వయంగా అవినాష్ వ్యవహారాన్ని పరిశీలిస్తూ, పర్యవేక్షిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంలో  అవినాష్ పిటిషన్ వేస్తే దానిని సీబీఐ కూడా గట్టిగా వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

By
en-us Political News

  
వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి.
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.