ఆటోనగర్ సూర్య: షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ
Publish Date:Jun 27, 2014
Advertisement
తారాగణం: అక్కినేని నాగచైతన్య, సమంత, సాయికుమార్, జె.పి., భరణి, బ్రహ్మానందం, వేణుమాధవ్, రఘుబాబు, ఆహుతి ప్రసాద్, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: శ్రీకాంత్, నిర్మాత: కె. అచ్చిరెడ్డి, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా. ‘మనం’ సినిమా అందించిన విజయం తర్వాత ఆ ఉత్సాహంతో నాగచైతన్య, సమంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎప్పటి నుంచో విడుదలవుతానని ఊరిస్తు్న్న ‘ఆటోనగర్ సూర్య’ సినిమా ఎట్టకేలకు శుక్రవారం నాడు విడుదలైంది. ఈ సినిమా కథ విషయానికొస్తే, కథానాయకు సూర్య చిన్నప్పుడు ఒక రైలు ప్రయాణం సందర్భంగా తల్లిదండ్రులను పోగొట్టుకుంటాడు. అతన్ని మేనమామ (సాయికుమార్) కూడా ఆదరించడు. దాంతో సూర్య ఆటోనగర్‌లోని ఓ మెకానిక్ దగ్గర పెరుగుతాడు. తన తల్లిదండ్రుల మరణానికి కారణమైన మేయర్ మీద పగ తీర్చుకునే ప్రయత్నం చేయడం, ఆటోనగర్‌లో అక్రమాలను ఎదిరించే ప్రయత్నం చేయడంతో సూర్య పదహారేళ్ళ వయసులోనే జైలు జీవితాన్ని గడపాల్సి వస్తుంది. జైలు నుంచి విడుదలైన తర్వాత సూర్య జీవితంలోకి ఎవరెవరు ప్రవేశిస్తారు? అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అతని తల్లిదండ్రులు ఎందుకు హత్యకు గురయ్యారు? సూర్య చివరికి తాను అనుకున్నది సాధించగలిగాడా అనే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. నాగచైతన్య యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా నటించాడు. ప్రశంసనీయమైన నటన ప్రదర్శించాడు. ఎప్పటి నుంచో మాస్ ఇమేజ్ కోసం తపిస్తున్న నాగచైతన్య దాహాన్ని ఈ సినిమా కొంతవరకు తీర్చిందని చెప్పవచ్చు. ‘ఆటోనగర్ సూర్య’ సినిమా ద్వారా నాగ చైతన్య మాస్ ప్రేక్షకులకు దగ్గరవుతాడు. నాగ చైతన్యకు హిట్ పెయిర్ అయిన సమంత ఈ సినిమాలో సూర్య మరదలిగా నటించింది. గ్లామర్ ప్రధానంగా ఈ పాత్ర సాగింది. కొన్ని సన్నివేశాలలో సమంత ప్రశంసనీయమైన నటన ప్రదర్శించింది.‘సురా..సురా’ అంటూ సాగే పాటలో సమంత తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. సమంతకు తండ్రిగా, నాగచైతన్యకు మేనమామగా, యూనియన్ లీడర్‌గా నటించిన సాయికుమార్‌కి ఇలాంటి పాత్రలు కొట్టినపిండి కావడంతో చాలా ఈజ్‌గా పోషించారు. దర్శకత్వం: వెన్నెల, ప్రస్థానం చిత్రాలతో తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్న దేవా కట్టా మరోసారి తనలోని దర్శకుడి మెరుపులను ఈ సినిమాలో మెరిపించారు. ఈ సినిమాకి మాటల రచయిత కూడా తానే అయిన దేవా కట్టా ఆ రంగంలోనూ తనకు ప్రతిభ వున్న విషయాన్ని నిరూపించుకున్నారు. మొత్తమ్మీద యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
http://www.teluguone.com/news/content/autonagar-surya-32-35286.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.





