సెమీస్ కి ఇంగ్లండ్... ఆసీస్ ఆశలు గల్లంతు

Publish Date:Nov 5, 2022

Advertisement

టీ20 ప్రపంచకప్ సూపర్ 12 విభాగంలో శనివారం జరిగిన మ్యాచ్ లో జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ వీరవిహారంతో ఇంగ్లండ్ లంకపై 4 వికెట్ల తేడాతో  గెలిచి సెమీస్ సీటు ఖాయం చేసుకుంది. ఇంగ్లండ్ విజయంతో టోర్నీ ఆతిథ్య మిస్తున్న ఆసీస్ కు సెమీస్ ఆశలు గల్లంతయినట్టే. లంక 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. 

టాస్ గెలిచిన లంక ముందుగా బ్యాట్ చేయడానికి ఆసక్తి చూపింది. మంచి బ్యాటింగ్ ట్రాక్ మీద గౌరవప్రద స్కోర్ చేసి ప్రత్యర్ధిని తన బౌలర్లు, ఫీల్డింగ్ సామర్థ్యంతో నిలువరించవచ్చని కెప్టెన్ దశున్ శంక అనుకున్నాడు.  లంక ఇన్నింగ్స్ లో పథుమ్ నిస్సంక తన బ్యాటింగ్ సత్తాను ప్రదర్శించి 45 బంతుల్లో 67 పరుగులు చేయడంలో జట్టుకు భారీ స్కోర్ చేసే అవకాశాలు కల్పించాడు. అలాగే భానుక రాజపాక్స 22 బంతుల్లో 22 పరుగులు చేయడంలో జట్టు స్కోర్ ను పరుగులుపెట్టించాడు. అయితే వారిద్దరు తప్ప మిగతావారెవ్వరూ ఇంగ్లండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొనలేక పోయారు. మార్క్ ఉడ్ 26 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకోగా, ఆదిల్ రషీద్, సామ్ కురన్, స్టోక్స్ చేరో వికెట్ తీసుకు న్నారు. 

గ్రూప్ 1లో ఈ మ్యాచ్ లంకకు అత్యంత కీలకంగానూ మారింది. కానీ భారీ స్కోర్ చేయలేకపోవడంతో ఇంగ్లండ్ ను బౌలర్లు, ఫీల్డింగ్ సామర్ధ్యంతో అడ్డుకోవాలని ప్రయత్నించింది. 142 పరుగుల లక్ష్యంతో దిగిన  ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ వీర బాదుడుతో లంక బౌలర్లు బెంబేలెత్తారు. వారి ధాటికి ఇంగ్లండ్ మొదటి వికెట్ కు 75 పరుగులు లభించాయి. కానీ  ఆ తర్వాత ఇంగ్లండ్ బ్యాటర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 65 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడం లంక ఫీల్డింగ్ ఎంత పకడ్బందీగా, వ్యూహాత్మకంగా చేపట్టింది అర్ధమవుతుంది. ముఖ్యంగా లంక బౌలర్లు వానిందు హసరంగ, ధనంజయ డి సిల్వా, లహిరు కుమార ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను దెబ్బతీయగలిగారు. కానీ బెన్ స్టోక్స్  ఎప్పటిలానే దాడి చేసి జట్టు ఇన్నింగ్స్ ను నిలబెట్టడంలో 36 బంతుల్లో 42 పరుగులు చేశాడు. కానీ అందులో కేవలం రెండే ఫోర్లు ఉన్నాయి. చివరగా క్రిస్ ఓక్స్ కొట్టిన ఫోర్ తో ఇంగ్లండ్ విజయం సాధించింది. 

దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ రన్ రేట్ ఆధారంగా సెమీస్ అవకాశాలు కోల్పోయింది. శుక్రవారం ఆఫ్ఘనిస్తాన్ తో తలపడిన మ్యాచ్ లో గెలచినప్పటికీ రన్ రేట్ లెక్కన చూపినపుడు ఇవాళ ఇంగ్లండ్ రన్ రేట్ బాగా మెరుగ్గా ఉండడం తో ఆస్ట్రేలియా కు సెమీస్ చేరే అవకాశాలు దెబ్బతిన్నాయి.

By
en-us Political News

  
నడవడానికి కేటాయించిన ఫుట్‌పాత్‌పై కూడా ప్రశాంతంగా అడుగులు వేయలేని పరిస్థితి.. రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తప్పించుకోవడానికి కొందరు వాహనదారులు ఏకంగా పాదచారుల దారినే ఆక్రమిస్తున్నారు.
బంగారం ధరలు భారీగా పడిపోవడం ఆభరణాల కొనుగోలుదారులకు ఊరటనిస్తుంటే.. పసిడిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వారికి మాత్రం కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? ముఖంపై చిన్న మొటిమ వచ్చినా.. చర్మంపై నల్లటి మచ్చ కనిపించినా అమ్మాయిలు ఆందోళన చెందుతారు.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగళూరుకు చేరుకోవడంతో యలహంక ప్యాలెస్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగంలో లోతైన సాంకేతిక నైపుణ్యం కలిగిన నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
మత్తుపదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నషా ముక్త్ భారత్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని సినీ నటుడు ప్రభాస్‌ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆహ్వానించారు.
ఇద్దరు ఆడపిల్లలు పుట్టారన్న కారణంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు.
అంతర్జాతీయ దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు ఇటీవల గణనీయంగా పడిపోవడంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారుల్లో తీవ్ర చర్చ మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.