ఏపీలో నేరాలూ, అఘాయిత్యాలు.. మూలాలు అక్కడే..!

Publish Date:Sep 6, 2022

Advertisement

వైజాగ్‌లో భారీగా మత్తు ట్యాబ్లెట్లు స్వాధీనం..  నెల్లూరు జిల్లాలో బాలికపై ఘాతుకం.. ఇవి రెండూ మంగళవారం (ఆగస్టు 6) పత్రికలో వచ్చిన రెండు వేర్వేరు వార్తలు. అయితే, కొంచెం లోతుల్లోకి వెళ్లి చూస్తే, ఈ రెండు ఘాతుక వార్తలకు సంబంధం ఉండడమే  కాదు, రెంటి మూలం, ఒకటే, అదే మత్తు. అవును, అది మద్యం అయినా, డ్రగ్స్ అయినా, గంజాయి, ఇప్పడు ఈ టాబ్లెట్స్  ఏదైనా సమాజమలో నేరాలు ఘోరాలు రోజు రోజుకు పెరిగి పోవడానికి, మద్యం, మత్తు మూల కారణంగా అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.  

నిజం. మద్యంకానీ,మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలకు ఒకసారి అలవాటు పడితే .. ఇక ఆ మత్తులోంచి బయటకు రావడం ఎంతటివారికి అయినా అంట సులభంగా అయ్యే పనికాదు. ఇక యువత విషయం అయితే చెప్పనే అక్కర లేదు. అందుకే యువత మత్తు మందులకు అలవాటు పడితే,అది వ్యక్తులు కుటుంబాలను పీల్చిపీల్చి పీల్చి పిప్పిచేస్తుంది. అంతేకాదు, సమాజాన్ని నిర్వీర్యం చేస్తుందని, సామాజిక శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. మరో వంక జాతీయ, అంతర్జాతీయ సంఘ వ్యతిరేక శక్తులు సమాజాన్ని  నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా  యువతకు  మత్తు మందులను ఎరగావేస్తున్నాయి. ముంబై లాంటి నగరాలో మత్తు మందులు, మాదక ద్రవ్యాల ద్వారా నేర సామ్రాజ్యాని విస్తరించుకునే కుట్రలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. వస్తున్నాయి.

అందుకే, విశాఖ నగరంలో నగరంలో యువతను లక్ష్యంగా చేసుకుని మత్తు కలిగించే ట్యాబ్లెట్లను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన అనేక అనుమానాలకు తావిచ్చేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ముఠా ఒడిశా, పశ్చిమబెంగాల్‌ వంటి ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో మత్తును కలిగించే ట్యాబ్లెట్లు దిగుమతి చేసుకుంటున్నట్లు వచ్చిన సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ యాంటీ నార్కోటెక్‌ విభాగం ఆధ్వర్యంలో నిఘా పెట్టారు. కంచరపాలెంకు చెందిన ఏడుగురు సభ్యుల ముఠాను గుర్తించి అరెస్టు చేశారు. వీరిలో ఒక మహిళ కూడా ఉండటం విశేషం. వీరి నుంచి మూడు కంపెనీలకు చెందిన 8వేల మత్తు కలిగించే ట్యాబ్లెట్లు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

మరోవంక దేశంశంలో జరిగే హత్యలు, మానభంగాలు భంగాలు మరెన్నో నేరాలకు మద్యం, మత్తు మందులే కారణం అవుతున్నాయి. ఒక్క నేరాలు ఘోరాలే కాదు, కుటుంబ కలహాలు, రోడ్డు ప్రమాదాలు మిగిలిస్తున్న విషాద ఘటనలు అన్నిటికీ, మద్యం మత్తుమందులే కారణం అని వేరే చెప్పనక్కరలేదు. ప్రతి నిత్యం జరుగతున్న అలాంటి దుర్మార్గ సంఘటనలు ఎన్నో మన కళ్ళముందే  కనిపిస్తున్నాయి. అవును మత్తు మందుకు బానిసైన బతుకులు ఏ విధంగా తెల్లారుతున్నాయో చస్తూనే ఉన్నాం. విచక్షణా రహితంగా వావి వరసలు లేని అఘాయిత్యాలకు, ఆకృత్యాలకు పాల్పడుతున్న వారిని నేరాలకు ఇంకా ఇతర కారణలు ఉన్నా, మద్యం మత్తు  నేరాలకు ఒక ప్రధాన కారణంగా అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి.

అందుకే ఈరోజు మనం ముక్కు పచ్చలారని పసి కందులపై అత్యాచారానికి పాల్పడుతున్న మానవ మృగాలను చూస్తున్నాం. ఎక్కడివరకో ఎందుకు నెల్లూరులో ఇంట్లో ఒంటరిగా ఉన్న 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించి ఆమె ప్రతిఘటించడంతో కిరాతకంగా  ఆమె నోట్లో, ముఖంపై యాసిడ్‌ పోసి.. ఆపై గొంతు కోసి పరారైన సంఘటనే మత్తు మహమ్మారి ఘాతుక చరిత్రను కళ్ళకు కట్టినట్లు చూపుతోంది . ఇలాంటి నేరాలు ప్రతి రోజు ఎక్కడో అక్కడ జరుగుతనే ఉన్నాయి. ప్రత్యేకించి నెల్లూరు దుర్ఘటన అనే కాదు, సహజంగా ఇలాంటి నేరాలకు మద్యం మత్తే మూల కారణం అవుతోంది. అయినా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. 

ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోందనే ఆరోపణలు కాదు వాస్తవ సంఘటనలే వెలుగు చూసాయి.  ఎక్కడో గుజరాత్, పొరుగున ఉన్న తెలంగాణలో పట్టుబడిన గంజాయి అక్రమ వ్యాపారం మూలాలు ఆంధ్ర ప్రదేశ్లో బయట పడ్డాయి. అలాగే, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు ఇలా ఒకటని కాదు, ఇప్పుడు కొత్తగా వెలుగు చూసిన మత్తు టాబ్లెట్స్ దందా వరకు ప్రతి అక్రమ దందాకు ఏపీ అడ్డగా మారింది. ఇక మద్యం సంగతి అయితే  చెప్పనే అక్కరలేదు. అంచెల వారీగా  మధ్య నిషేధం అమలు చేస్తామని, అక్క చెల్లెమ్మలకు, అమ్మలకు, అవ్వలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, మధ్యమే ములాధరంగా పరిపాలన సాగిస్తున్నారు. అంతే కాదు  పాతికేళ్ల మద్యం ఆదాయాన్ని పూచికత్తుగా చూపించి అప్పు కూడా తెచ్చుకున్నారు. అందుకే, ఏపీలో ఇప్పడు సగటున రోజుకు మూడు అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. నాలుగైదేళ్ల కిందట వరకూ అతి తక్కువ నేరాల రేటు కలిగిన రాష్ట్రాల జాబితాలో కొనసాగిన ఏపీ.. ఇప్పుడు అత్యధిక నేరాల రేటు కలిగిన రాష్ట్రాల సరసన చేరింది

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల జరిగే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం జరగనుంది.
హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.