పాకిస్థాన్ పై బలూచ్ తిరుగుబాటు దారుల దాడులు.. స్ఫూర్తి ఆపరేషన్ సిందూర్.!

Publish Date:Jul 9, 2026

Advertisement

భారత సైన్యం గతంలో చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వ్యూహాత్మక దాడులు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని, శత్రువు కోలుకోలేని విధంగా భారత సైన్యం చేసిన ఆ దాడులు పాకిస్థాన్ కు ఉన్న ఉగ్ర సంబంధాలను నిర్ద్వంద్వంగా రుజువు చేశాయి. అలాగే ఆపరేషన్ సిందూర్..  పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ఉగ్రవాద ముఠాలను   పూర్తిగా తుడిచిపెట్టేసింది లేదా మట్టికరిపించింది. ఆ దారుణ నష్టం నుంచి కోలుకోవడానికే మునీర్‌కుచాలా సమయం పట్టింది.   అయితే ఇప్పుడు సరిగ్గా అదే భారత ఆర్మీ వ్యూహాన్ని, దాడుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు పాక్ సైన్యంపై విరుచుకుపడటం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. బలూచిస్థాన్ తిరుగుబాటు దారుల దాడులు.. పాక్ ఆర్మీ చీఫ్‌ మునీర్ కు దిమ్మతిరిగేలా చేశాయనడంలో సందేహం లేదు. 

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కొంతకాలంగా బలుచిస్థాన్ ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తన కుర్చీ కాపాడుకోవాలంటే.. బలూచిస్థాన్ లో తిరుగుబాటును, నిరసనలను అణిచివేయడం అనివార్యమన్న పరిస్థితి ఉంది.  ఎందుకంటే బలూచిస్థాన్  నిరసనకారులు పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యంపై  సాయుధ పోరాటాన్ని సాగిస్తున్నారు. సరిహద్దుల్లో విధ్వంసం సృష్టిస్తూ పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. బలూచ్ ఉద్యమాన్ని అణచడంలో మునీర్ పూర్తిగా విఫలమయ్యారంటూ పాకిస్తాన్ ప్రతిపక్షాలు  బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ రాజకీయ ఒత్తిళ్ల నుంచి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇటీవల పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో మునీర్ తన సైన్యాన్ని భారీగా మోహరించి బలప్రదర్శనకు దిగారు. కానీ అక్కడి స్థానిక ప్రజల నుంచి ఊహించని స్థాయిలో తీవ్ర నిరసనలు, వ్యతిరేకత ఎదురుకావడంతో పాక్ సైన్యం వెనక్కి తగ్గక తప్పలేదు. 

ఈ అవమానం నుంచి తేరుకోకముందే బలూచ్ తిరుగుబాటుదారులు గ్వాదర్ ప్రాంతంలో పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ ప్రధాన శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని  వ్యూహాత్మక  ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రదర్శించిన మెరుపు దాడుల వ్యూహాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు బలూచ్ తిరుగుబాటుదారులు చెడుతున్నారు. బలూచ్ దాడులలో పలువురు పాకిస్తాన్ భద్రతా సిబ్బంది  ప్రాణాలు కోల్పోయారు. ఈ విధ్వంసం పాక్ సైనిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా.. ఆ దేశ  ఆర్మీ చీఫ్ అసీం మునీర్‌కు కోలుకోలేని వ్యక్తిగత శోకాన్ని మిగిల్చింది.ఎందుకంటే..  ఈ దాడిలో మునీర్ స్వయానా బావమరిది అయిన కెప్టెన్ మహమ్మద్ జిబ్రాన్ కూడా మరణించాడు. 

తమ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నందుకు ప్రతీకారంగానే పాక్ సైనిక కేంద్రాలపై దాడులు చేస్తున్నామని బలూచ్ రెబల్ గ్రూపులు హెచ్చరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ సైన్యంపై మరిన్ని భారీ ఎత్తున దాడులు చేస్తామని స్పష్టం చేశాయి. పాకిస్తాన్ స్థానిక మీడియా కూడా ఈ పరిణామాలను నిశితంగా విశ్లేషిస్తూ, ఆర్మీ చీఫ్ వైఫల్యాలను ఎండగడుతోంది. ఒకవైపు అంతర్గత తిరుగుబాట్లు, మరోవైపు సరిహద్దుల్లో వ్యూహాత్మక వైఫల్యాలతో సతమతమవుతున్న పాకిస్తాన్ ఆర్మీకి, రాబోయే రోజుల్లో బలూచ్ రెబల్స్ రూపంలో మరిన్ని చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.

Operation, Sindoor, Inspiration, Pakistan Army Chief, Asim Munir, Telugu News

By
en-us Political News

  
గురుగ్రామ్ ఐవీఎఫ్ డీఎన్ఏ వివాదం నేపథ్యంలో దేశంలోని ఐవీఎఫ్ క్లినిక్‌లు, స్పెర్మ్ బ్యాంకులపై జాతీయ మహిళా కమిషన్ NCW కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ ఆశా మీనన్ నేతృత్వంలో కొత్త నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైంది. ఆ వివరాలు ఇక్కడ చదవండి.
భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఐవీఎఫ్ IVF , ఏఆర్టీ ART క్లినిక్‌లలో జరుగుతున్న అక్రమాలు, ఆర్థిక దోపిడీని అరికట్టేందుకు జాతీయ మహిళా కమిషన్ NCW రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆశా మీనన్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. మహిళల పునరుత్పత్తి హక్కులు మరియు భద్రతను కాపాడటమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యం.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఒక ఎత్తైతే, ఇన్వెస్ట్ చేశాక క్రమశిక్షణ పాటించడం మరో ఎత్తు. ఇన్వెస్టర్లు మార్కెట్ ఒడిదుడుకుల్లో చేసే 3 సాధారణ తప్పులు, వాటి వల్ల జరిగే భారీ నష్టాలు మరియు నిపుణుల కీలక సూచనలు ఈ స్టోరీలో తెలుసుకోండి.
ఎన్‌ఎస్ఈ ఎమర్జ్‌లో ఐసీ ఎలక్ట్రికల్స్ ఐపీఓ 67.7 శాతం భారీ ప్రీమియంతో బ్లాక్‌బస్టర్ లిస్టింగ్ సాధించింది. 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకిన ఈ రైల్వే షేరు ఆర్థిక వృద్ధి వివరాలు ఇక్కడ చూడండి.
అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత గ్రూప్ బిగ్ డీమెర్జర్ తర్వాత సరికొత్త జూన్ త్రైమాసిక ఫలితాలు వచ్చాయి. వేదాంత పవర్ సేల్స్ ఏకంగా 245 శాతం పెరగగా, ఐరన్ అండ్ స్టీల్ స్టాక్ అప్పర్ సర్క్యూట్ తాకింది. వేదాంత అనుబంధ కంపెనీల లేటెస్ట్ స్టాక్ మార్కెట్ ప్రదర్శన, షేర్ల ధరల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
బెంగళూరు కోరమంగళలోని ప్రసన్న గణపతి ఆలయానికి టెక్కీ గణేశా గా ఎందుకు పేరొచ్చింది? సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ప్రమోషన్ల కోసం ఈ గుడికి క్యూ కడుతున్న ఐటీ భక్తుల పూర్తి వివరాలు మీకోసం.
గోల్డియామ్ ఇంటర్నేషనల్ షేరు ధర ఒకే రోజు 24 శాతం పడిపోవడానికి కారణం క్రాష్ కాదు, 1:3 బోనస్ షేర్ల సర్దుబాటు. ఈ బోనస్ లెక్కలు మరియు ఇన్వెస్టర్ల లాభాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యూరోపియన్ యూనియన్ కొత్తగా కార్లలో డ్రైవర్ ముఖంపై నిఘా పెట్టే కెమెరా సిస్టమ్‌ ADDW ను తప్పనిసరి చేసింది. ఈ కొత్త రూల్ ప్రైవసీ ఆందోళనలను ఎలా పెంచుతోందో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
2026 పాపులర్ గేమ్ జీరో పరేడ్స్ ఫర్ డెడ్ స్పైస్ నుండి సరికొత్త మేజర్ అప్‌డేట్ వచ్చేసింది. ఎలాంటి ఖర్చు లేకుండా, అసలు గేమ్ లేకపోయినా ఆడుకునేలా ఉచిత టేబుల్‌టాప్ వెర్షన్‌ను డెవలపర్లు విడుదల చేశారు. పూర్తి వివరాలు మరియు స్టీమ్ డిస్కౌంట్ ఆఫర్లు ఇక్కడ చూడండి.
చైనా అత్యున్నత సైన్స్ అవార్డు గెలుచుకున్న ఇద్దరు పల్లెటూరి శాస్త్రవేత్తలు చెన్ లిక్వాన్, బెన్ డే ల అద్భుత విజయ గాథ. ఈవీ బ్యాటరీలు, ఫైటర్ జెట్ రాడార్ సాంకేతికతలో వారు సృష్టించిన విప్లవం గురించి ఇక్కడ చదవండి.
మాజీ ప్రధానమంత్రి దివంగత సీవీ నరసింహరావు గతంలో ఒక సారి ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే అన్నారు. అలా ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయినా.. మనవడికి ఆటబొమ్మలాంటి తాతే అని రుజువు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రాజకీయాల్లో, పాలనా వ్యవహారాల్లో ఎంత బిజీ అయినా.. గారాల మనవడు అడిగితే.. వంటింట్లో గరిట పట్టాల్సిందే.
దేశవ్యాప్తంగా నేడు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీతో పాటు ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల లేటెస్ట్ బంగారం ధరల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ పన్నిన సరికొత్త కుట్రను ఇజ్రాయెల్ నిఘా వర్గాలు బయటపెట్టాయి. అగ్రరాజ్యాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ సంచలన ఇంటెలిజెన్స్ నివేదిక పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.