పచ్చళ్ల తయారీ కేంద్రంపై దాడి...ఇద్దరు అరెస్ట్

Publish Date:Mar 18, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహార పదార్థాల తయారీ ముఠాల వ్యవహారం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అసలు-నకిలీ తేడా తెలియక వినియోగదారులు భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా తక్కువ ధరలకు వస్తువులు కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పోలీసులు కల్తీ ఆహార పదార్థాల తయారీదారులపై కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ, కొందరు అక్రమంగా రహస్య ప్రదేశాల్లో నాసిరకం పదార్థాలతో తయారీ కొనసాగిస్తున్నారు. తాజాగా అందరూ ఇష్టపడే పచ్చళ్లను కూడా కుళ్లిన పదార్థాలతో తయారు చేసి, బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లు అతికించి మార్కెట్‌లో విక్రయిస్తున్న ఘటనబయటపడింది.

దాడి వివరాలు:

విశ్వసనీయ సమాచారం మేరకు కుల్సుంపురా పోలీసులు జియాగూడ ప్రాంతంలోని వెంకటేశ్వర నగర్‌లో ఉన్న ఒక గోదాముపై దాడి చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి లైసెన్స్ లేకుండా, అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో పచ్చళ్ల తయారీ జరుగుతున్నట్లు గుర్తించారు. నిందితులు కుళ్లిపోయిన కూరగాయలు, నాణ్యతలేని ముడి పదార్థాలను ఉపయోగించి పచ్చళ్లను తయారు చేసి, స్థానిక దుకాణాలకు తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఈరోజు బుధవారం 18వ తేదీన కుల్సుంపురా సబ్‌ఇన్‌ స్పెక్టర్ ఎం. నరసింహ తన సిబ్బందితో కలిసి జియాగూడ ప్రాంతంలో గస్తీ నిర్వ హిస్తున్న సమయంలో వెంకటేశ్వర నగర్‌లోని ఓ గోదాములో అనుమానాస్పద కదలికలు గమనించారు. 

వెంటనే అక్కడ సోదాలు నిర్వహించగా, ఎలాంటి ప్రభుత్వ అనుమ తులు లేకుండా అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో పచ్చళ్ల తయారీ జరుగు తున్నట్లు బయటపడింది. దర్యాప్తులో భాగంగా నిందితులు కుళ్లిపోయిన కూరగాయలు, నాసిరకం ముడి పదార్థాలు ఉపయో గించి పచ్చళ్లను తయారు చేసి, వాటిపై బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లు అతికించి స్థానిక దుకాణాలకు తక్కువ ధరలకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. ప్రజలు నమ్మకం తో కొనుగోలు చేసే పచ్చళ్లే ఇలాంటి పరిస్థితుల్లో తయారవుతున్నాయని తెలిసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. కల్తీ పచ్చళ్ళు తయారు చేయిస్తున్న... జియాగూడ కు చెందిన ఎన్. నరసింహ (54), ఎన్. నరేష్ (45)లను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ దాడిలో పోలీసులు భారీగా డ్రమ్ములలో నిల్వ ఉంచిన కల్తీ పచ్చళ్ల ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 72 డ్రమ్ముల నిమ్మకాయ, పండు మిర్చి, చింతకాయ, ఉసిరి, గోంగూర పచ్చళ్లతో పాటు 6 డ్రమ్ముల టమోటా, చింత పండు పేస్ట్, ఒక డ్రమ్ము అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక ఎలక్ట్రానిక్ బరువు తూచే యంత్రాన్ని సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. ఇలాంటి కల్తీ ఆహార పదార్థాల తయారీ ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారుతోందని పోలీసులు హెచ్చరించారు. అక్రమంగా నాసిరకం పదార్థాలతో తయారీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాగే వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండి, నాణ్యమైన మరియు విశ్వసనీయమైన ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.

By
en-us Political News

  
హైదరాబాద్ నగరంలో కల్తీ దందాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
రాజధాని ప్రాంతమైన అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు మూడు ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఈ ఎస్ఐపీబీ సమావేశంలో మంజూరు చేయడం ఈ అయ్యాయి. ఈ అనుమతులతో అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా టెక్నాలజీ హబ్‌గా కూడా ఎదుగుతుంది.
హైదరాబాద్ బేగంపేటలో ఉన్న 145 సంవత్సరాల ప్రాచీన వారసత్వ కట్టడం చిరాన్ ఫోర్ట్ క్లబ్ చుట్టూ వివాదం రాజుకుంది.
తాడేపల్లిలోని ఆమె నివాసంతో పాటు విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని ఇతర అనుమానిత ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో ఏసీబీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె పేరిట ఉన్న స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చిక్కుల్లో పడ్డాడు.
తీవ్ర ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ఏర్పడిన ఇంధన కొరత నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఆధునికి సాంకేతిక యుద్దాల్లో కీలక పాత్ర పోషించ ఆత్మాహుతి డ్రోన్లు భారత్ ఆర్మీ అమ్ములపొదిలో చేరాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాను అరెస్ట్ చేసేందుకు అస్సాం పోలీసులు హైదరాబాద్‌కు చేరుకున్నట్లు సమాచారం.
పచ్చటి రుషికొండకు బోడి గుండు కొట్టి మరీ నిర్మించిన ఈ విలాలవంతమైన భవనాన్ని ఎలా వినియోగించుకోవాలన్న విషయంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఆ సబ్ కమిటీ తాజాగా భేటీ అయ్యింది. ఈ భేటీలో విశాఖపట్నంలోని వివాదాస్పద రుషికొండ ప్యాలెస్ ను కేవలం ఎగ్జిబిషన్ లా కాకుండా, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే విధంగా తీర్చిదిద్దాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల బలోపేతానికి, ఉన్నత విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్ననేపథ్యంలో హుర్ముజ్ ప్రావిన్స్‌ సమీపంలోని సరిహద్దుల వద్ద ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు తమ దేశ గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించిన అమెరికాకు చెందిన మానవరహిత నిఘా విమానాన్ని ( గుర్తించి, తక్షణమే కూల్చివేసాయి. అందుకు సంబంధించి ఆ విమాన శిధిలాల ఫుటేజీని ఇరాన్ అధికారికంగా విడుదల చేయడంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది. గత కొంతకాలంగా అమెరికా ఇరాన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే.
మద్యం కుంభకోణం కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.