జగన్ స్థాయికి దిగజారిన ట్రంప్!
Publish Date:Jul 15, 2024
Advertisement
అమెరికా మాజీ అధ్యక్షుడు, త్వరలో జరగబోయే ఎన్నికలలో అధ్యక్ష పదవికి రేసులో వున్న డొనాల్డ్ ట్రంప్ మన జగన్ స్థాయికి దిగజారిపోయినట్టు అనిపిస్తోంది. ఆదివారం నాడు ట్రంప్ మీద హత్యాయత్నం జరిగింది (?). ట్రంప్ చెవి చివరి నుంచి బుల్లెట్ దూసుకుపోవడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ట్రంప్ మీద హత్యయత్నం చేసిన క్రూక్స్ అనే యువకుడిని భద్రతాదళాలు కాల్చి చంపాయి. తన చెవికి బుల్లెట్ తగిలినప్పటికీ ట్రంప్ భయపడకుండా పిడికిలి బిగించి పోరాట యోధుడిలా పోజు ఇచ్చారు. దాంతో ఇప్పటి వరకు అటూ ఇటుగా వున్న ట్రంప్ విజయావకాశాలు పెరిగిపోయాయి.... ఇదీ నిన్నటి వరకు మీడియాలో వినిపించిన పాయింట్లు. ఆదివారం వరకు ట్రంప్ మీద హత్యాయత్నం జరిగిందని అమెరికా జనం నమ్మారుగానీ, ఒకరోజు గడిచేసరికి ఇందతా ట్రంప్ ఆడించిన నాటకం అనే అభిప్రాయాలు అమెరికాలో వినిపిస్తున్నాయి. ఎవరో యువకుడు కాల్పులు జరపడం ఏంటో, అది కరెక్టుగా వెళ్ళి ట్రంప్ చెవి అంచుకు తగలడం ఏంటో... ట్రంప్ బుల్లెట్ తగిలినా పోరాట యోధుడిలా పిడికిలి బిగించడం ఏంటో... అంతా సినిమాటిక్‌గా వుందని అమెరికా జనం అంటున్నారు. ఇదేదో తేడా వ్యవహారంలాగానే వుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చివరికి ట్రంప్ కూడా మన జగనని ఫాలో అయ్యే పరిస్థితికి దిగజారిపోయాడని తెలుగు రాష్ట్రాల ప్రజలు అనుకుటున్నారు. 2019 ఎన్నికలలో కోడికత్తి డ్రామా ఆడిన జగన్ అధికారంలోకి వచ్చారు. 2024 ఎన్నికలలో గులకరాయి డ్రామా ఆడారుగానీ, అది బెడిసికొట్టింది. మరి ఇప్పుడు జగన్ని ఫాలో అయిన ట్రంప్ 2019 లాగా లాభం పొందుతారో, 2024 లాగా చతికలపడతారో చూడాలి.
http://www.teluguone.com/news/content/attack-on-donald-trump-25-180777.html





