Publish Date:Jan 16, 2025
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై ఆయన నివాసంలోనే దాడి జరిగింది. గుర్తు తెలియని అగంతకుడు సైఫ్ అలీఖాన్ నివాసంలోకి చొరబడి ఆయనపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో సైఫ్ అలీఖాన్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. గాయపడిన సైఫ్ అలీఖాన్ ను హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. దాడి చేసి తప్పించుకుపోయిన అగంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ దాడిలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డారని వైద్యులు తెలిపారు. మొత్తం ఆరు కత్తిపోట్లు ఉండగా, వాటిలో రెండు చాలా లోతుగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఆయన వెన్నుముక వద్ద లోతైన గాయం అయ్యిందని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందనీ, శస్త్ర చికిత్స చేయాల్సి ఉందనీ పేర్కొన్నారు. ఈ సంఘటన గురువారం (జనవరి 16) తెల్లవారు జామున జరిగింది.
సైఫ్ అలీఖాన్ నివాసంలోకి జొరబడిన అగంగకుడు చోరీ కోసం వచ్చినట్లు భావిస్తున్నారు. అతడిని గమనించి అలీఖాన్ ఇంటి నౌకర్ అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ దుండగుడు నౌకరుతో గొడవకు దిగాడు. ఈ అలికిడికి నిద్ర నుంచి లేచిన అలీఖాన్ ఆ అగంతకుడిని అడ్డుకోబోగా అతడు కత్తితో దాడి చేశాడు. అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్నపోలీసులు సైఫ్ అలీఖాన్ నివాసానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన దుండగుడిని పట్లుకునేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. దుండగుడి దాడిలో గాయపడిన సైఫ్ అలీఖాన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. సైఫ్ అలీఖాన్ పై దాడి సంఘటన షాక్ కు గురి చేసిందని పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/attack-on-bollywood-actor-saif-ali-khan-25-191335.html
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.