Publish Date:Jun 13, 2022
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ- బీజేపీల నేతలు రకరకాల ఫీట్లు చేస్తున్నారు. ఉప ఎన్నిక కోసం సీఎం జగన్ పలువురు రాష్ట్ర మంత్రులను గుంపులు గుంపులుగా ఆత్మకూరుకు దించేశారు. బీజేపీ కూడా తానేమీ తక్కువ కాదని వారానికి మూడుసార్లు సోము వీర్రాజును ప్రచారానికి పంపుతోంది. ఈ రెండు పార్టీల హడావుడి చూసిన జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం తరువాత ఆత్మకూరు నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. మేకపాటి కుటుంబం నుంచి వైసీపీ అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలో దిగారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పోటీలో లేకపోయినా.. అధికార వైసీపీ తన బలాన్ని ప్రదర్శించుకునేందుకు మండలానికి ఇద్దరు మంత్రులను ఇన్ ఛార్జ్ లుగా నియమించింది. అంతేకాదు నెల్లూరు జిల్లాలోని ఒకరిద్దరు నేతలు తప్పిస్తే మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలంతా ఆత్మకూరులోనే మకాం వేసి, గుంపులు, గుంపులుగా తిరుగుతున్నారు. మంత్రుల హడావుడి చూసి ప్రతిపక్షాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. సామాన్య ప్రజలు మాత్రం ‘ఇదేందబ్బా సరైన పోటీ లేకపోయినా.. ఇంత హడావుడి చేస్తున్నారు?’ అంటూ నొసలు చిట్లిస్తున్నారు. లక్ష ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలుస్తుందంటూ ఆత్మకూరు వచ్చిన మంత్రులు పొలికేకలు పెడుతుండడం గమనార్హం. అసలు పోటీలోనే లేని టీడీపీపై వారు సవాళ్లు విసురుతుండడం విచిత్రంగా ఉందంటున్నారు జనం. అయినా ఉప ఎన్నికల్లో ఎలాగూ మరణించిన సిటింగ్ ఎమ్మెల్యే కుటుంబంపై సింపతి ఉంటుంది. పైగా అధికార పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయినప్పటికీ మంత్రులు ఇలా పొలికేకలు పెట్టడం ఏంటనే ప్రశ్నలు సర్వత్రా వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే.. అధికార పార్టీది బలుపు కాదు వాపు అని స్థానిక జనం వ్యాఖ్యానిస్తున్నారు. ఒక పక్కన వైసీపీ బ్యాచ్ చేస్తున్న వింతలతోనే విసిగెత్తిపోతున్న జనం భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్న హడావుడిని చూసి మరింతగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆత్మకూరు నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేసే దిక్కు లేదు. ఎక్కడి నుంచో అభ్యర్దిని తీసుకొచ్చి నామ్ కె వాస్తే పోటీ పెట్టింది. అయినా సరే.. బీజేపీ సత్తా చాటుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆత్మకూరు వీధుల్లో కోతలు కోస్తుంటే పొట్ట చెక్కలయ్యేలా పగలబడి నవ్వుకుంటున్నారు జనం. ‘మింగ మెతుకు లేకపోయినా.. మీసాలకు సంపంగి నూనె’ అన్నట్టు.. వీర్రాజు వీరంగం భలే గమ్మత్తుగా ఉందంటున్నారు ఆత్మకూరు నియోజకవర్గం ప్రజలు. బీజేపీ చేస్తున్న డూపు ప్రచారంపై తెగ సెటైర్లు కూడా వేస్తున్నారు మెట్ట ప్రాంత ప్రజలు.
ఎవరిపై ఎవరు లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తారు? ఎవరిపై ఎవరు సత్తా చాటుతారో.. అర్ధం కాక తల పట్టుకొని మరీ విశ్లేషకులు లెక్కలు వేసుకుంటుండడం కొసమెరుపు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/atmakur-by-poll-ycp-39-137593.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.