అతిక్ అహ్మద్ మామూలోడు కాదు

Publish Date:Apr 22, 2023

Advertisement

అతిక్ అహ్మద్ ఈ లోకాన్ని వదిలి పోయి వారం రోజుల పైనే అయింది. అంత్యక్రియలు కూడా జరిగి పోయాయి. అయినా, అయన పేరు వింటే ఉత్తర ప్రదేశ్ లో ముఖ్యంగా అతగాడు ఆడుతూ పాడుతూ హత్యలు, అత్యాచారాలు , కబ్జాలు చేసిన ప్రయాగ్‌రాజ్‌లో ప్రజలు భయంతో వణికి పోతున్నారు.  ఆవును కొద్ది రోజుల క్రితం సినిమా ఫక్కీలో మర్డరై  పోయిన యూపీ  గ్యాంగ్‌స్టర్, సమాజ్ వాదీ పార్టీ మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ మర్డర్ కు ముందు అయన ఎవరో  ఉత్తర ప్రదేశ్ బయట పెద్దగా తెలియక పోవచ్చును కానీ, ఆయన కొడుకు ఎన్ కౌంటర్ లో చనిప్యిన రెండు రోజులకే పోలీసులు, మీడియా కెమెరాల సాక్షిగా ‘లైవ్’లో హత్యకు గురైన తర్వాత ప్రపంచానికి ఆయన పరిచయం అవసరం లేకుండా పోయింది. నిజానికి, అతిక్ అహ్మద్ హత్య మనకు కొత్త కావచ్చును కానీ, ఇలాంటి హత్యలు చూడడమే కాదు చేసిన అనుభవం కూడా ఆయనకు ఉందని యూపీ మీడియా కోడై కూస్తోంది. ఒక్క హత్యలు, అత్యాచారాలే కాదు అతిక్ అహ్మద్ యూపీ లొ పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.సమాజ్‌వాదీ పార్టీలో ఉంటూ, ఎమ్మెల్యే, ఎంపీ పదవులను నిర్వహించిన అతిక్ ఇష్టారాజ్యంగా కబ్జాలు సాగించారు. చిత్రం ఏమిటంటే ఆయన బాధితులలో మాములోళ్లు కాదు, మహా నాయకులు, వారి బంధువులు కూడా ఉన్నారు. అది కూడా ఇంకెవరో కాదు, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిలా నాయకురాలిగా కితాబు అందుకున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బంధువులు కుడా ఉన్నారు. 

రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ, కేంద్రంలో కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుతం అధికారంలో ఉన్న రోజుల్లోనే,అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ బంధువు భూమిపై కూడా అతని కన్ను పడినట్లు తెలుస్తోంది. అయితే సోనియా తక్షణమే జోక్యం చేసుకోవడంతో అతిక్ పప్పులు ఉడకలేదు. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఉండటంతో అతిక్ ఆటలు సాగలేదు. 

జాతీయ మీడియా కథనాల ప్రకారం, సోనియా మామ గారైన ఫిరోజ్ గాంధీ కుటుంబానికి చెందిన వీర గాంధీకి ప్రయాగ్‌రాజ్‌లోని సివిల్ లైన్స్ ప్రాంతంలో  స్థలం ఉంది. ఆ స్థలాన్ని అతిక్ కబ్జా చేసి, తన మనుషులను అక్కడ పెట్టాడు.ఫిరోజ్ తోడల్లుడి సమీప బంధువైన వీర గాంధీ సోనియా గాంధీ సహాయాన్ని కోరారు. సోనియా జోక్యం చేసుకుని, అప్పటి ఉత్తర ప్రదేశ్‌ కాంగ్రెస్ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషీతో మాట్లాడారు. రీటా జిల్లా యంత్రాంగంతో మాట్లాడారు. దీంతో అతిక్ వెనుకంజ వేసి, ఆ భూమిని తిరిగి వీర గాంధీకి అప్పగించాడు. 

వీర గాంధీకి సహాయపడటానికి స్థానిక పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ముందుకు రాలేదని మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. అయితే అతిక్ హత్య తర్వాత వీర గాంధీని మీడియా సంప్రదించింది. కానీ అతిక్ గురించి తానేమీ మాట్లాడబోనని వీర చెప్పారు. అయితే రీటా మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వీర గాంధీ భూమి విషయంలో తనతో సోనియా గాంధీ మాట్లాడారని, తాను జిల్లా యంత్రాంగంతో మాట్లాడానని, ఫలితంగా అతిక్ వెనుకంజ వేసి, భూమిని వదిలేశాడని చెప్పారు. దీని బట్టి చూస్తే, సోనియా గాంధీ బంధువు వీర గాంధీ అంతటి వాడు కూడా అతిక్ అహ్మద్ చనిపోయి వారం  రోజులకు పైగానే అయినా ఇంకా, అతని పేరు ఎత్తెందుకు కూడా భయపడుతున్నారు,

అంటే,అతిక్  ఎంత భయంకరుడో అర్థం చేసుకోవచ్చు. నిజానికి అతిక్ అహ్మద్  మామూలు గ్యాంగ్‌స్టర్ కాదు, అరివీర భయంకర  గ్యాంగ్‌స్టర్. అతిక్ అహ్మద్‌పై 100కుపైగా కేసులు ఉన్నాయి. హత్యలు, హత్యాయత్నాలు, అపహరణలు, బలవంతపు వసూళ్ళు వంటి కేసులు ఉన్నాయి. అతిక్ ఆస్తుల విలువ అనేక వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. రూ.1,169 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. వీటిలో రూ.750 కోట్ల విలువైన ఆస్తులను ధ్వంసం చేయగా, రూ.417 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అతను సంపాదించిన ఆస్తుల్లో ఇది సముద్రంలో నీటి బొట్టు వంటిదని అధికారులు చెప్తున్నారు.అందుకే  అతగాడిని అంత అమానుషంగా హత్య చేసినా  రాజకీయ నాయకులు తప్పించి సామాన్య ప్రజలు కనీసం, అయ్యో ..అనైనా అనలేదు. అవును అతిక్ మామూలోడు కాదు. మామూలు   గ్యాంగ్‌స్టర్ కాదు.

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.