బీఆర్ఎస్ కు గువ్వల బాలరాజు గుడ్ బై

Publish Date:Aug 5, 2025

Advertisement

తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు. అచ్చంపేట నుంచి బాలరాజు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 నుంచి 2023 వరకు ఎమ్మెల్యేగా పని చేశాడు. గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడు. ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నాడు. గత ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో బాలరాజు భేటీ అవ్వడంతో  ఆయన బీజేపీలో చేరవచ్చనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో ఆయనను బుజ్జగించేందుకు బీఆర్‌ఎస్‌ అధిష్టానం ప్రయత్నించినట్లు తెలిసింది. కానీ.. బాలరాజు మాత్రం తన రాజీనామా విషయంలో పునరాలోచన లేదని చెప్పినట్లు సమాచారం. గువ్వల బాలరాజు  బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే ..  కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు. ఇప్పుడు  బాలరాజు తన నిర్ణయంతో  రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారారు. గులాబీ బాస్ కేసీఆర్ తనకు అండగా ఉన్నంతవరకు తనను  ఎవరూ టచ్ చేయలేరంటూ ఆయన గతంలో నేనే రాజు నేనే మంత్రి  అన్న చందంగా వ్యవహరించేవారు. అటువంటి  బాలరాజు గులాబీ పార్టీ  బీజేపీలో విలీనం అవుతుందని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో పార్టీకి రాజీనామా చేయడం క్యాడర్ని అయోమయంలో పడేసిందంట.
నాగర్ కర్నూల్ బీఆర్ఎస్   అధ్యక్షుడిగా ఉన్న గువ్వల బాలరాజు పార్టీకి గుడ్ బై చెప్పడం తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గువ్వల బాలరాజుకు రాజకీయ భవిష్యత్ ను ఇచ్చింది గులాబీ పార్టీనే. మొదటినుండి దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరైన గువ్వల బాలరాజు.. అచ్చంపేట నియోజకవర్గంలో  తన మాటే శాసనం అన్నట్టుగా పెత్తనం చేశారని చెబుతారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంలో కూడా బాలరాజు సంచలనంగా మారారు. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ చేతిలో పరాజయం చవిచూశాడు. గత కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాల్లో నామమాత్రంగా పాల్గొంటూ వచ్చిన ఆయన అధిష్ఠానంతోనూ అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. తాజాగా పార్టీకి రాజీనామా చేసి మళ్లీ వార్తల్లోకి ఎక్కారు.
  గువ్వల బాలరాజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పంపిన రాజీనామా లేఖలో  తానీ నిర్ణయాన్ని అంత తేలికగా తీసుకున్నది కాదనీ,  అయితే తనకు అవసరమైన సమయంలో పార్టీ నుంచి  మద్దతు రాకపోవడంతో మనస్తాపానికి గురై  రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. తన రాజీనామాతో పాటుగా..   నియోజకవర్గంలో ఉన్న తన అనుచర గణాన్ని సైతం తన వెంట తీసుకువెళ్లేందుకు గువ్వల బాలరాజు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.

గువ్వల బాలరాజు నిర్ణయంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి . ఆయన గులాబీ నీడను వీడి కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం కొనసాగుతుంది.  దానికి అనుగుణంగానే గత కొద్దిరోజులుగా తన సన్నిహితులతో  ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుండి  మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కు అవకాశం ఇచ్చేందుకు గులాబీ పార్టీ నిర్ణయం తీసుకోవడమే బాలరాజు రాజీనామాకు కారణంగా తెలుస్తున్నది.  అదలా ఉంటే  గువ్వల బాలరాజు తన అనుచరుడితో మాట్లాడిన కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బీఆర్ఎస్‌ని బిజెపిలో విలీనం చేస్తున్నారనీ.. అంతకంటే ముందే బిజెపి పార్టీలో చేరడం ఉత్తమం అని భావించి పార్టీకి రాజీనామా చేశానని బాలరాజు సదరు నాయకుడితో మాట్లాడినట్లు ఉన్న ఫోన్ కాల్  వైరల్ అవుతోంది. ఫైనల్ గా తాను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నాను అనే విషయాన్ని ఈ నెల  9న ప్రకటిస్తానని బాలరాజు అంటున్న మాటలు ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ లో ఉన్నాయి.

గత కొన్ని రోజులుగా బీజేపీ నేతలతో  గువ్వల బాలరాజు టచ్‌లో ఉన్నారంటున్నారు.  బాలరాజుతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం ఉందన్న టాక్ గులాబీ శిబిరంలో గుబులు రేపుతోందంటున్నారు.

By
en-us Political News

  
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
చెన్నైలో బీఎస్ఎఫ్ నూతన భవనాలను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
ప్రస్తుత కాలంలో డిజిటల్ మాధ్యమాలు విద్య, విజ్ఞానాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఉద్యోగులను ఉత్సాహపరిచేందుకు ఓ యాజమాన్యం అనుసరించిన సరికొత్త మార్గం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.