ఇంటర్వ్యూలో సెలెక్టైతేనే అసెంబ్లీ టికెట్.. స్టాలిన్ కొత్త పంధా

Publish Date:Mar 22, 2026

Advertisement

ఏ రాజకీయపార్టీ నుంచైనా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలంటే ఆ పార్టీ టికెట్ ఇవ్వాలి. అలా టికెట్ దక్కించుకోవాలంటే ఆ పార్టీలో పై స్థాయి నాయకుల ఆశీస్సులు, అలాగే సమాజిక సమీకరణాలూ కీలకం. అయితే తమిళనాడులో మాత్రం అధికార పార్టీ అందుకు భిన్నంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో వినూత్న పంధా అనుసరిస్తోంది.  త్వరలో రాష్ట్ర అసెంబ్లీకి అధికార డీఎంకే పార్టీ టికెట్ దక్కాలంటే వారు నేరుగా ముఖ్యమంత్రి స్టాలిన్ ఎదుట ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిందే. ఇందు కోసం సదరు ఆశావహ అభ్యర్థులు నిర్ణీత రుసుము చెల్లించి అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా అప్లికేషన్ పెట్టుకోవడానికి విభాగాల వారీగా రెండు రకాల ఫీజులను డీఎంకే నిర్ణయించింది. అదెలా అంటే రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్.

ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూకు అభ్యర్థులు తమ సొంత ఖర్చుతో రావాలి. ఇంతకీ ఈ ఇంటర్వ్యూ ఎందుకంటే.. సీఎం స్టాలిన్ స్వయంగా చేసే ఈ ఇంటర్వ్యూలో అభ్యర్థుల సమార్థ్యాన్ని, అతడికి రాజకీయాల పట్ల ఉన్న అవగాహనను, ప్రజాసేవ పట్ల ఉన్న తపనను పరిశీలిస్తారు. అలాగే సదరు క్యాండిడేట్ ఆర్థిక నేపథ్యం తదితర విషయాలను కూడా పరిశీలిస్తారు. ఈ ఇంటర్వ్యూ ఐదారు నిముషాల పాటు ఉంటుంది.   సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే యువత, విద్యావంతులు కూడా ఈ ఇంటర్వ్యూల కోసం బారులు తీరుతున్నారు. 

 గతంలో దివంగత నేత కరుణానిధి కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇదే పంథా అవలంబించేవారు. ఇప్పుడు సీఎం స్టాలిన్ కూడా తండ్రి బాటనే అనుసరిస్తున్నారు. ఇదే తరహాలో అభ్యర్థులను వడపోసేవారు. ఇప్పుడు స్టాలిన్ అదే సంప్రదాయాన్ని మరింత పక్కాగా అమలు చేస్తున్నారు. అర్హులైన, సమర్థులైన నాయకులను గుర్తించడమే  కాకుండా ఇంటర్వ్యూల కోసం వసూలు చేసే ఫీజు ద్వారా పార్టీకి నిధులు సమకూర్చుకోవడం కూడా జరుగుతుందని స్టాలిన్ ఈ పద్ధతిని ఎంచుకున్నారని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి.  

కాగా పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం డీఎంకే అనుసరిస్తున్న ఈ అభ్యర్థుల ఎంపికపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. అభ్యర్థులను సీఎం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం అన్న పద్ధతి పారదర్శకతకు నిదర్శనంగా కొందరు, ఫీజుల వసూలు అంటూ సొమ్ములు దండుకునే వ్యూహంగా మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం స్వయంగా ముఖ్యమంత్రి స్టాలినే ఇంటర్వ్యూ చేయడం తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.  

By
en-us Political News

  
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్క‌డి నుంచి ఈ పార్టీ అంచ‌లంచ‌లుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గ‌తంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాస‌న రుచి చూప‌డంతో.. ఇప్పుడు వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్ర‌స్తుతం అప్ర‌తిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.