మూడు రాజధానుల బిల్లు కోసమేనా..?

Publish Date:Jul 18, 2022

Advertisement

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీలు ప్రకటించడం, వాయిదా వేయడం ఏపీ సర్కార్ కు ఒక ఆనవాయితీగా మారిపోయినట్లుగా కనిపిస్తోంది. సాధారణంగా అసెబ్లీ వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ లేదా అక్టోబర నెలలలో నిర్వహిస్తుంటారు. అయితే జగన మాత్రం ఈ సారి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను జూలైలోనే నిర్వహిస్తామని ప్రకటించారు. అంతా నిజమే కాబోలు అనుకున్నారు. అయితే ఇప్పుడు సమవేశాలు జూలైలో కాదంటున్నారు. ఏలిన వారు ఏం చెబితే అది వినాలి అంత కంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు?

ఇంతకీ జగన్ అసలు అసెంబ్లీ సమావేశాలను జూలైలోనే నిర్వహించాలని ఎందుకు భావించారు? మళ్లీ అంతలోనే ఎందుకు వాయిదా వేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం జగన్ పార్టీ శ్రేణుల నుంచే వస్తోంది. జగన్ కేబినెట్ లో మంత్రి గుడివాడ అమర్నాద్ ఉరుములేని పిడుగులా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలోనే మళ్లీ మూడు రాజథానుల బిల్లును తీసుకువస్తామని ప్రకటించారు. అసెంబ్లీ వాయిదాకు ఆ బిల్లు రూపకల్పన ఇంకా పూర్తికావడమే కారణమై ఉండవచ్చునని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

వాస్తవంగా ఈ మూడేళ్లలో జగన్ సర్కార్ ఎన్నడూ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పట్ల శ్రద్ధ చూపలేదు. ఇక తప్పదు నిర్వహించి తీరాలి అన్న పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మళ్లీ వాయిదా వేసింది.  ఈ సారి అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కీలక బిల్లులు పెట్టబోతున్నట్లు మీడియా సాక్షిగా జగన్ సర్కార్ పలు లీకులు ఇచ్చింది. కీలకం అనగానే జగన్ సర్కార్ కు అన్నిటి కంటే కీలకం, ప్రధానం, ప్రాముఖ్యం మూడు రాజధానులేనని తెలిసిందే. కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పటి నుంచి.. అంటే మూడు రాజధానుల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అనివార్యంగా ఉపసంహరించుకున్నప్పటి నుంచీ న్యాయపరమైన సలహాలు తీసుకుని మరో సారి ఆ బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకురావలన్న లక్ష్యంతోనే వైసీపీ సర్కార్ ఉంది.

 ఇటీవలి   వైసీపీ ప్లీనరీలో కూడా తమ విధానం మూడు రాజధానులేనని విస్పష్ట ప్రకటన కూడా చేశారు.   అసెంబ్లీలో మూడు రాజధానుల  బిల్లు మళ్లీ ప్రవేశపెట్టనున్నట్లు కూడా చెప్పరు.  అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉంది.ఆ తీర్పును సవాల్ చేస్తూ  ప్రభుత్వం ఇంకా సుప్రీం కోర్టుకు వెళ్లలేదు.    సుప్రీంలో సవాల్ చేసినా ఫలితం ఉండదన్న న్యాయ నిపుణుల సలహాతోనే జగన్ సర్కార్ సుప్రీం కు వెళ్లలేదని పరిశీలకులు అంటున్నారు. ఇక మూడు రాజధానుల విషయంలో జగన్ కు ఉన్న ఏకైక ఆప్షన్ అసెంబ్లీలో మరో సారి బిల్లు ప్రవేశ పెట్టడమే.  అందుకోసమే ఈ నెలలోనే నిర్వహించాలని భావించిన అసెంబ్లీ వర్షాల సమావేశాలను వాయిదా వేశారని చెబుతున్నారు. పకడ్బందీగా బిల్లు రూపొందించి  అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశ పెట్టడానికి జగన్ సర్కార్ నిర్ణయించుకుందనీ, అందుకే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను వాయిదా వేసిందనీ విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.