ఆసియాక‌ప్ .. వారంలో మ‌ళ్లీ భార‌త్‌-పాక్ వార్‌

Publish Date:Sep 3, 2022

Advertisement

అంత‌ర్జాతీయ క్రికెట్ పోటీ అన‌గానే యావ‌త్ క్రికెట్ వీరాభిమానుల‌కు గుర్తుచేసుకునే పోటీలు అతి పెద్ద‌వి రెండే.. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌, రెండోది భార‌త్, పాకిస్తాన్ మ‌ధ్య హోరాహోరీ జ‌రిగే  మ్యాచ్లు. వీటికే ప్రేక్ష‌కులు ఫిదా అయ్యేది. కార‌ణం యావ‌త్ క్రికెట్‌లో స‌త్తా ఉన్న ప్లేయ‌ర్లు, అస‌ లు ఉత్త‌మ స్థాయి ఆట ప్ర‌ద‌ర్శ‌న అనేది చూసి తరించ‌గ‌లిగేది ఈ నాలుగు జ‌ట్ల ధ‌నాధ‌న్ పోటీల్లోనే. ప్ర‌స్తు తం మ‌నం ఆసియా క‌ప్ పోటీలు చూసి త‌రిస్తున్నాం. ఆసియాక‌ప్ 2022 లో ఇప్ప‌టికే ఒక మ్యాచ్‌లో దాయాదులు క‌ల‌బ‌డ్డారు. మొద‌టి మ్యాచ్ భార‌త్ గెలిచింది. ఆసియా క‌ప్‌లో ఈసారి సూప‌ర్ 4 స్థాయికి రెండు వ‌చ్చాయి. వారం తిర‌క్కుండానే మ‌ళ్లీ ఇరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. భార‌త్ ఈ మ్యాచ్‌లో విజృం భించి గెలిస్తే ర‌వ్వంత స్వ‌ల్ప స్కోర్ తేడాతో గెలిచినా, పాక్ ఓడినా మ‌ళ్లీ ఫైన‌ల్‌కి త‌ల‌ప‌డే అవ‌కాశా లుంటాయి. అస‌లు సిస‌లు పోటీ అప్పుడు చూడ‌గ‌ల్గుతాం. 

ఇక సూప‌ర్ 4 మ్యాచ్‌ల్లో భాగంగా భార‌త్‌, పాక్‌లు ఆదివారం (ఆగ‌ష్టు 4)న త‌ల‌ప‌డ‌నున్నాయి. రెండు జ‌ట్లూ మంచి ప‌దును మీద ఉన్నాయి. రేపు జ‌రిగే మ్యాచ్ ప్ర‌క్ష‌కుల‌కు అత్యంత ఆస‌క్తిక‌ర, ఉత్సాహ‌భ‌రిత వాతావ ర‌ణంలో మ్యాచ్ ర‌క్తిక‌ట్టించే అవ‌కాశం ఉంద‌ని ఇప్ప‌టికే క్రికెట్ పండితులు అంటున్నారు. అంటే ఇది స‌హ‌జంగా దాయాదుల మ‌ధ్య జ‌రిగే పోటీ కాబ‌ట్టి అంతే స్థాయిలో జ‌రుగుతుంది, ఎక్క‌డ‌ యినా. కాకుంటే షార్జాలో గ‌నుక మ‌రింత ఉత్సుక‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తారు. ఎవ‌రికి వారే ధీటుగా ఆడే ప్లేయ‌ర్ల‌తో రికార్డు స్థాయి పెర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌వ‌చ్చు. 

భార‌త్‌కు విజ‌యావ‌కాశాలు ఉన్నాయ‌నే అంటున్నారు. ఈ టోర్నీలోనూ క‌ప్పును కాపాడుకుంటారన్న ధీమా కూడా వీరాభిమానులు వ్య‌క్తం చేస్తున్నారు. కార‌ణం  పాక్ జ‌ట్టులో అర‌వీర‌భ‌యంక‌ర లెఫ్టార్మ్ పేస‌ర్ షాహీన్ ఈ టోర్నీకి జ‌ట్టులోకి ఎంపిక కాలేదు. అత‌ని  మోకాటి గాయం కార‌ణంగా అత‌న్ని జ‌ట్టులోకి తీసుకోలేదు. వాస్త‌వానికి అత‌ను ఇటీవ‌ల భార‌త్ బ్యాట‌ర్ల‌కు పెద్ద ప‌రీక్ష‌పెట్టేడు. అచ్చం వాసిం అక్ర‌మ్ స్థాయి స్వింగ్‌తో బ్యాట‌ర్ల‌కు ద‌డ‌పుట్టించేడు. 

కుర్రాడు, పొడుగ్గా వుండి ప‌రుగున వ‌చ్చి  బంతిని మ‌హా తెలివిగా స్వింగ్ చేస్తుంటే బ్యాట‌ర్లు బెంబేలెత్త‌క పోరు. ఆ అనుభ‌వం మ‌న వాళ్ల‌కి కొంత ద‌క్కింది. అత‌ను వ‌స్తే ఈ టోర్నీలో మ‌రింత గ‌ట్టి పోటీ ఉండేది. కానీ మ‌న‌వారికి అదృ ష్టం, పాక్‌కు దుర‌దృష్టం అత‌ను మోకాటి గాయంతో ఇంటికి ప‌రిమితం అయ్యాడు. అయిన‌ప్ప‌టికీ వారి బౌలింగ్ విభాగాన్ని త‌క్కువ‌గా చూడాల్సిన‌దేమీ లేదు. పాక్‌కి మొహ‌మ్మ‌ద్ రిజ్వాన్‌, ఫ‌క‌ర్ జ‌మాన్ ఉన్నా రు. వారి ధాటిని ఎదుర్కొన‌డంలో కాస్తంత జాగ్ర‌త్త‌గా బ్యాట్ చేయ‌వ‌ల‌సి వ‌స్తుంది. శుక్ర‌వారం మ్యాచ్ అంత కు ముందు భార‌త్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ పాక్ బౌల‌ర్లు మంచి నైపుణ్యాన్నే ప్ర‌ద‌ర్శించారు.

అలాగే పాక్‌ను ఇబ్బందిపెట్ట‌గ‌లిగిన మ‌న ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా కూడా ఇక టోర్నీ లో ఆడ‌డు. అత‌ను కూడా మోచేతి గాయం కార‌ణంగా టోర్నీకి దూర‌మ‌య్యాడు. అత‌ని స్థానంలో జ‌ట్టులోకి మ‌రో ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ వ‌చ్చాడు. అయితే జ‌డేజా ఫీల్డ‌ర్‌గా అంత‌ర్జాతీయ స్థాయిలో ఎంతో పేరున్న సూప‌ర్ ప్లేయ‌ర్‌. మెరుపువేగంతో బంతిని ఆప‌డం, వికెట్లు ప‌డ‌గొట్ట‌డంలో ఏ గొప్ప అంత‌ర్జాతీయ ప్లేయ‌ర్‌కీ తీసిపోడ‌ని పాక్ మాజీలు కూడా అంగీక‌రించారు. అత‌ని వేగం ముందు బ్యాట‌ర్లు బ‌హు జాగ్ర‌త్త‌గానే ఉంటారు. అంత‌టివాడు ఏకంగా ఇపుడు ఏకంగా టోర్నీకి గాయం కార‌ణంగా దూరం కావ‌ల‌సి వ‌చ్చింది. అలాగ‌ని అక్ష‌ర్ ప‌టేల్ త‌క్కువేమీ కాదు. 

పోతే ఆసియా క‌ప్ టోర్నీల్లో ఇప్ప‌టివ‌ర‌కూ భార‌త్ , పాక్‌లు 16 మ్యాచ్‌ల్లో ఢీకొంటే భార‌త్ 9 మ్యాచ్‌లు, పాకిస్తాన్ 5 మ్యాచ్‌లు గెలిచాయి. రెండు మ్యాచ్‌ల్లో ఫ‌లితాలు రాలేదు. అంటే ఒక‌టి టై కాగా, మ‌రొక‌టి ఫ‌ల‌తం తేల‌కుండానే ముగిసింది. ఆసియాక‌ప్‌లో భార‌త్ విజ‌యాలు 67.27 శాతం మేర‌కు ఉంది. కాగా మొత్తం మీద ఆసియా క్రికెట్ టోర్నీల్లో జ‌రిగిన 50 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ 28 మ్యాచ్‌లు గెల‌చింది. అంటే ఇక్క‌డి పిచ్‌ల మీద వారికి సంపూర్ణ ఆధిప‌త్యం ఉంద‌నే అంగీక‌రించాలి.

ఈ లెక్క‌లు, స‌త్తాల ప‌రంగా చూసుకుంటే రేప‌టి అంటే ఆదివారం ఆగ‌ష్టు 4వ తేదీ మ్యాచ్ రెండు సింహాలు ఢీకొన్న స్థాయిలో జ‌రిగే అవ‌కాశాలే ఉన్నాయి. ఇరు దేశాల క్రికెట్ వీరాభిమానుల‌తో పాటు ఇత‌ర రంగాల‌కు చెందిన వారూ మ‌రింత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌ళ్లీ ఇలాంటి ఉత్సాహాన్ని రెట్టింపు చేసే ఉత్కంఠ‌త‌కు ఆలవాల‌మ‌య్యే మ్యాచ్ చూడ‌టానికి మ‌రింత స‌మ‌యం ప‌డుతుంది. జ‌య‌హో భార‌త్‌!

By
en-us Political News

  
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.