Publish Date:Jul 18, 2025
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు తెలుగు దేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామ చేశారు. అలాగే పార్టీ పొలిట్ బ్యూరో పదవికి కూడా రిజైన్ చేశారు. ఇటీవల రాష్ట్ర పతి ఆయన్ను గోవా గవర్నర్గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే గోవా గవర్నర్గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. తక్షణమే తన రాజీనామాను ఆమోదించవలసిందిగా ఆయన టీడీపీ అధిష్ఠానాన్ని కోరారు. ఈ మేరకు రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులకు పంపించారు. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటి వరకు టీడీపీలో పనిచేసేందుకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీలో ఎన్నో అవకాశాలు అందుకున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇన్ని అవకాశాలు కల్పించిన పార్టీకి, సీఎం చంద్రబాబుకు అశోక్ గజపతిరాజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.1978లో జనతా పార్టీ అభ్యర్థిగా ఏపీ శాసనసభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి అశోక్ గజపతి రాజు పార్టీలో కొనసాగుతున్నారు. 1983లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన అశోక్ గజపతిరాజు రెండవసారి శాసన సభకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో కూడా విజయనగరం నుంచి విజయం సాధించారు. అయితే, 2004లో అశోక్ గజపతిరాజు ఓటమి పాలయ్యారు. కానీ, 2009లో తిరిగి అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా కూడా పనిచేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ashoka-gajapati-raju-39-202228.html
దివంగత మాగంటి గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్రెడ్డి, కేటీఆర్ కన్ను పడిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు చావోరేవోగా మారిన జూబ్లీ ఉప ఎన్నికలో రెండు పార్టీలూ కూడా ఎన్టీఆర్ నామస్మరణ చేస్తున్నాయి. కేటీఆర్ అయితే ఏకంగా తనకు తన తండ్రి కేసీఆర్ ఎన్టీరామారావు పేరే పెట్టారంటూ సెంటిమెంట్ ప్లే చేశారు.
న్డీయేలో నిర్ణాయక శక్తిగా ఉన్న తెలుగుదేశం ఎన్డీఏ విజయం కోసం సహకారం అందిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మహారాష్ట్ర, హర్యానా లాంటి రాష్ట్రాల్లో కూడా ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు ప్రచారం చేసిన సంగతి విదితమే.
కేటీఆర్ హయాంలో స్కూలు ఎదుట కూడా గంజాయ్, డ్రగ్స్ దొరికేలాంటి కల్చల్ ఏర్పడిందని.. ఆయన హయాంలో పబ్ కల్చర్ పెరిగినంత మరెక్కడా పెరగలేదనీ.. సొంత బావమరిది ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీయే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమన్నారు రేవంత్.
రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని నరేంద్రమోడీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రేవంత్ కు మాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.
మహిళల వన్డే ప్రపంచ కప్ ను గెలుచుకున్న టీమ్ ఇండియా జట్టు సభ్యురాలు శ్రీచరణి ప్రభుత్వం పట్టించుకోలేదంటూ వైసీపీ విమర్శల రాగం మొదలు పెట్టింది. శ్రీచరణిని ఏపీ సర్కార్ పట్టించుకోలేదంటూ గగ్గోలు పెట్టేసింది. శ్రీకాంత్ రెడ్డి అయితే ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరీ ప్రభుత్వాన్ని విమర్శించేశారు.
గోపీనాథ్ బతికి ఉన్న కాలంలో ఎన్నడూ మాగంటి మొదటి భార్య అన్న ప్రస్తావనే రాలేదు. అసలు మాగంటి సునీత ఆయనకు రెండో భార్య అన్న విషయమే దాదాపుగా ఎవరికీ తెలియదు. కానీ మాగంటి మరణం తరువాత.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జూబ్లీ ఉప ఎణ్నిక ముంగిట మాగంటి కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది.
మాగంటి గోపీనాథ్ తొలిభార్య మాలినీ దేవికి పుట్టిన తారక్ ప్రద్యుమ్న ఇంటి పేరు కొసరాజుగా ఉంది. అదే సునీతకు పుట్టిన పిల్లల ఇంటి పేరు మాగంటిగా ఉంది. ఇందుకు తగిన సాక్ష్యాధారాలు సైతం వారి దగగర పదిలంగా ఉన్నాయంటారు మాగంటి సునీతకు చెందిన న్యాయవాదులు.
2009 ఎన్నికలలో మార్టూరు నియోజకవర్గం రద్దు కావడంతో అద్దంకి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి కరణం బలరాంపై విజయ ఢంకా మోగించారు. 2014 ఎన్నికల్లో వైసీపీలో చేరిన రవికుమార్ బలరాం కుమారుడు కరణం వెంకటేష్ పై పోటీ చేసి విజయం సాధించారు. అనంతర పరిణామాలలో గొట్టిపాటి ఫ్యాను పార్టీని వీడి సైకిల్ ఎక్కారు.
తొలి విడతలో పోలింగ్ విషయానికి వస్తే.. మహిళలు అత్యధికంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటింగ్ శాతం పెరగడం అధికార కూటమికా, లేక ఇండియా కూటమిగా ఎవరికి ప్లస్ కానుందన్న చర్చ అప్పుడే మొదలైంది. అలాగే.. జనసురాజ్ పార్టీ ప్రభావం ఏమేరకు ఉంటుందన్న అంచనాలు కూడా మొదలయ్యాయి.
కోర్టు షరతును ఉల్లంఘిస్తాను అనుమతి ఇవ్వండి అంటూ హైదరాబాద్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రచార వేడి రోహిణీకార్తెను మించిపోతున్నది. సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో నియోజకవర్గం హోరెత్తిపోతున్నది. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ ఈ తీరు పెరిగిపోతున్నది.
2029 ఎన్నికలలో విజయం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్న జగన్ ఇప్పుడు కూడా నేతలను సొంత నియోజకవర్గం నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీలో నిలబెట్టాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అందులోనూ ప్రధానంగా ప్రస్తుతం చిలకలూరి పేట నియోజకవర్గంలో పని చేసుకుంటున్న మాజీ మంత్రి విడదల రజనీని వచ్చే ఎన్నికలలో రేపల్లె నుంచి పోటీలో దింపాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.