రాజకీయాలకు దూరమైన అశోక్‌గజపతి.. అభిమానుల భావోద్వేగాలు

Publish Date:Jul 16, 2025

Advertisement

ముందు నుంచి తెలుగుదేశం పార్టీతోనే పయనించిన అశోక్‌గజపతిరాజుకు పొలిటికల్ రిటైర్‌మెంట్ తర్వాత సముచిత గౌరవం లభించింది. ఆయన గవర్నర్‌ అయినందుకు సంతోషం.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని తెలిసి బాధ.. ఒకేసారి ఆయన అభిమానులలో కలిగిన భావోద్వేగాలివి. అశోక్‌ గజపతిరాజు గోవా గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తాను ఏ స్థాయిలో ఉన్నా.. ఎలాంటి అత్యున్నత పదవులు చేపట్టినా విజయనగరం గడ్డను మరువనంటూ ఆయన చేసిన ప్రకటనపై జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీతో అశోక్‌గజపతిరాజుది విడదీయరాని బంధం. 1982 మార్చి 28న నందమూరి తారకరామారావు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వేదికగా తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. అప్పుడు ఎన్టీఆర్‌ వెంట ఉన్నది అశోక్‌గజపతిరాజు. ఆయన పార్టీ వ్యవస్థాపక సభ్యుడు కూడా. 43 ఏళ్ల సుదీర్ఘ టీడీపీ ప్రస్థానంలో అశోక్‌ ఎన్నడూ పార్టీ గీత దాటలేదు. ఆయనకు పార్టీ అన్నీ ఇచ్చింది. ఆయన సైతం పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేశారు. వాస్తవానికి సామాజికవర్గపరంగా రాజకీయాలు నడుస్తాయి. విజయనగరం జిల్లాలో ఆ పరిస్థితి రాలేదు. రెండు బలమైన సామాజికవర్గాలను సమన్వయం చేసుకుంటూ ఆయన ముందుకు సాగారు.
అశోక్‌ తండ్రి పీవీజీ రాజు ఎంపీగా ఉండేవారు. సోదరుడు ఆనందగజపతిరాజు విశాఖ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. అశోక్‌ తొలిసారిగా 1978లో జనతా పార్టీ తరపున అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. జాతీయ కాంగ్రెస్‌, ఇందిరా కాంగ్రెస్‌, స్వతంత్ర, జనతా పార్టీలు పోటీ చేయగా చతుర్ముఖ పోటీలో అశోక్‌ గజపతిరాజునే విజయం వరించింది. అనంతరం ఎన్టీఆర్‌ పిలుపు మేరకు అశోక్‌ టీడీపీలో చేరారు. 1983 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా విజయనగరం నుంచి పోటీచేసి గెలిచారు. ఆయన సోదరుడు ఆనందగజపతిరాజు విశాఖ జిల్లా భీమిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. తొలిసారిగా అశోక్‌ ఎన్టీఆర్‌ కేబినెట్‌లో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. 1985 ఎన్నికల్లో తిరిగి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించి వాణిజ్యపన్నుల శాఖ మంత్రిగా పనిచేశారు. 
1989 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆయన విజయం సాధించారు కానీ రాష్ట్రంలో టీడీపీ ఓడిపోయింది. అయినా ఐదేళ్ల పాటు ప్రతిపక్ష పాత్రలో తన వాణి వినిపించారు. అశోకగజపతి రాజు 1994లో గెలిచిన అశోక్‌ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా, 1995లో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు. 2004లో మాత్రం టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన అశోక్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగిన కోలగట్ల వీరభద్రస్వామి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి అదే కోలగట్ల వీరభద్రస్వామిపై గెలుపొందారు అశోక్‌. 2014 ఎన్నికల్లో అధినేత చంద్రబాబు సూచన మేరకు విజయనగరం ఎంపీగా పోటీచేసి గెలిచారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకమైన పౌరవిమానయానశాఖ మంత్రిగా పదవి చేపట్టారు. 2018లో టీడీపీ.. ఎన్డీఏ నుంచి బయటకు రావడంతో కేంద్ర మంత్రి పదవికి అశోకగజపతి రాజు  రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో మరోసారి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
జిల్లా అభివృద్ధిలో అశోక్‌ పాత్ర ఉంది. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే కలెక్టరేట్‌ నిర్మాణం జరిగింది. బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌ ప్రాజెక్టు ఏర్పాటు ఆయన చొరవే. 1995లో ఎన్టీఆర్‌ ప్రజల వద్దకు పాలన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ సమయంలో అశోక్‌ విన్నపంతో రాష్ట్ర మంత్రివర్గంతో పాటు యంత్రాంగం జిల్లాకు వచ్చింది. బహిరంగ ప్రదేశంలోనే శాఖల వారీగా సమస్యలను, విన్నపాలను ప్రజల నుంచి తీసుకున్నారు. విజయనగరంలో సంతకాల వంతెనగా పిలిచే ఎత్తురాళ్ల బ్రిడ్జి అశోక్‌ చొరవతోనే నిర్మితమైంది. నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కోసం 8వేల మంది  సంతకాలతో కేంద్రానికి పంపడంతో ప్రభుత్వం స్పందించింది. విజయనగరంలో ఎత్తైన బ్రిడ్జి నిర్మాణం జరిగింది.

అశోక్‌ గజపతిరాజు విజయనగరం మండలం ద్వారపూడిని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామం రూపురేకలనే మార్చేశారు. మరో వైపు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు విజయనగరం లోక్‌సభ పరిధిలో అక్షరాస్యతను పెంపొందించేందుకు చిట్టిగురువులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది విజయ వంతంమైంది. తాను నిర్వర్తించిన పౌర విమానయాన శాఖతో జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. అదే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. 2014లో పౌర విమానాయాన శాఖ బాధ్యతలు చేపట్టిన అశోక్‌.. విభజన హామీల్లో భాగంగా ఏపీకి అంతర్జాతీయ విమానాశ్రయం తెచ్చారు. అప్పటి సీఎం చంద్రబాబును ఒప్పించి భోగాపురానికి విమానాశ్రయాన్ని కేటాయించేలా చేశారు. జాతీయ రహదారులు, వ్యవసాయం, తాగునీటి కోసం వేలాది కోట్లు మంజూరు చేయించిన ఘనత ఆయనదే. అందుకే ఆయన రాజకీయ ప్రస్థానం ముగిసిందన్న నిజాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో గవర్నర్ గిరీ దక్కడంపై ఆనందంతో భావోద్వేగాలకు గురవుతున్నారు.

By
en-us Political News

  
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
పులివెందుల జడ్పీటీసీ స్థానానికి మంగళవారం (ఆగస్టు 12)న జరిగిన ఉప ఎన్నికలో రెండు పోలింగ్ కేంద్రాలలో అక్రమాలు, రిగ్గింగ్ జరిగాయన్న ఆరోపణలతో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
తన కుమారుడికి ఎంతో ఇష్టమైన బైక్ ను కూడా అతడితో పాటే సమాధి చేయడం కంటనీరు తెప్పించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బుధవారం (ఆగస్టు 13) నుంచి మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.
రాత్రి సమయంలో డిన్నర్ చేయడం కోసం అపార్ట్ మెంట్ పక్కన ఉన్న రెస్టారెంట్ కు నడుచుకుంటూ వెడుతున్న శ్రీజవర్మను వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్ ఢీకొంది. ఈ ఘటనలో శ్రీజ అక్కడికక్కడే మరణించింది.
తెలంగాణకు చెందిన ప్రముఖ న్యాయవాది గట్టు వామనరావు దంపతుల హత్య కేసును సుప్రీం కోర్టు సీబీఐకి అప్పగిస్తూ మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ దర్యాప్తు నివేదికను తనకే అందజేయాలని కూడా సుప్రీం కోర్టు విస్పష్టంగా ఆదేశించింది
హైదరాబాద్ సిటీ నడి మధ్యలోనుంచి మూసీ వెళ్తుంది. గండిపేట్ వరకు ఓకే.. ఆ తర్వాతే మూసీ దుర్గంధభరితంగా మారుతుంది. సిటీలోకి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు మొత్తం 55 కిలోమీటర్లు మూసీ రివర్ ఉంటుంది. ఇదంతా బాగు పడితే ఒక అద్భుతమే అవుతుంది. భవిష్యత్ తరాలకు చాలా మేలు జరుగుతుంది.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఆయన సినిమాలు సంచలనం. అద్భుత టేకింగ్ తో తనదైన మేకింగ్ స్టైల్ తో అలనాడు సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. అటువంటి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడూ సంచలనాలు సృష్టిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు మరో రికార్డు సృష్టించింది. సత్వర న్యాయం, పటిష్టమైన పోలీసింగ్‌లో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. ప్రజలకు న్యాయ సహాయం అందించటంలో, శాంతిభద్రతల్లో ఏపీ టాప్‌లో ఉందని ఇండియా జస్టిస్ రిపోర్టు 2025 వెల్లడించింది.
జ‌నం సొమ్ము ప‌ప్పుబెల్లాల్లా ఖ‌ర్చు చేసిన జ‌గ‌న్ త‌ర్వాత అదే జ‌నం చేత దారుణ‌మైన ప‌రాభ‌వానికి లోనై ఘోర‌మైన ఓట‌మి పాల‌య్యారు. ఒక‌ప్పుడు మీకొచ్చిన ఆ 23 సీట్ల‌లో కొంద‌ర్ని లాక్కుంటే ఆ ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేకుండా పోతుంద‌ని బాబును భ‌య‌పెట్టిన జ‌గ‌న్ చివ‌రికి ప్ర‌తిప‌క్ష హోదాకి కూడా నోచుకో లేక పోయారు. క‌ర్మ రిట‌ర్న్స్ థియ‌రీకి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా మిగిలిపోయారు.
బోయే ఉపరాష్ట్రపతి ఎవరనే విషయంలో రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ ఆసక్తి వ్యక్త మవుతోంది. మీడియాలో చర్చ జరుగుతోంది. మరోవంక అధికార ఎన్డీఎ కూటమి అభ్యర్ధి ఎంపిక బాధ్యతను కూటమి భాగస్వామ్య పార్టీల నేతలు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించారు.
భాగ్యనగరంలో గన్ కల్చర్ పెరిగిపోతున్నది. అమెరికాను తలదన్నేలా ఇటీవలి కాలంలో భాగ్యనగరంలో కాల్పులు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ చందానగర్ లో దుండగులు కాల్పులతో చెలరేగిపోయారు. గ్రేటర్ పరిధిలోనే అత్యంత రద్దీగా ఉండే చందానగర్ లో దుండగులు తుపాకులతో ఖజానా జువెల్లర్స్ లోకి ప్రవేశించి భారీ దోపిడీకి పాల్పడ్డారు.
ప్రాజెక్టులు ప్రజల కోసం నిర్మించాలన్న నినాదంతో ఆలోచనపరుల వేదిక ఆధ్యర్యంలో ఈ నెల 4 నుంచి 6 వరకు శ్రీశైలం జలాశయం ఆధారంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ఇప్పటికే నిర్మితమైన ప్రాజెక్టులపై అధ్యాయనం జరిగింది. అలా అధ్యయనానికి వెళ్లి వచ్చిన ఆలోచనాపరుల సంఘం ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.