భారతీయుల వంటల్లో ఇంగువ ఎందుకు?

Publish Date:Dec 9, 2020

Advertisement

అసెఫీటిడా అంటే ఏంటి? అని ఎవరన్నా అడిగితే కాసేపు ఆలోచించాల్సి ఉంటుంది. అదే ఇంగువ అనో హింగ్ అనో చెబితే మన రోజువారీ వంటకాల్లో ఉపయోగించే పదార్థం గుర్తుకువస్తుంది. ఫెరూలా అనే వృక్షజాతి నుంచి సేకరించిన పాలతో రూపొందించే ఇంగువని విడిగా తినడం కష్టమే. కానీ అదే ఇంగువని వంటల్లో వేసుకుంటే వచ్చే రుచీ, పరిమళం వేరు. భారతీయుల వంటకాల్లో, మరీ ముఖ్యంగా దక్షిణాది వంటకాల్లో ఇంగువ లేకుండా పని జరగదు.

వెల్లుల్లి, ఉల్లి వంటి పదార్థాలకు దూరంగా ఉండే సనాతనవాదులు సైతం... వాటికి బదులుగా ఇంగువని చిలకరించి వంటకాల్లో అనూహ్యమైన రుచిని సాధిస్తుంటారు. మరి వందల సంవత్సరాలుగా మన వంటకాల్లో చేరిపోయిన ఈ ఇంగువను కేవలం రుచి, పరిమళానికేనా... లేదా మరేదన్నా ఆరోగ్యపరమైన కారణంతో వాడుతుంటారా? అంటే జవాబులు ఇవిగో...

- చాలామందికి ఆహారం తిన్న తరువాత కడుపు ఉబ్బరంగా మారిపోతుంది. ఇలాంటి ఉబ్బరాన్ని శుబ్బరంగా తగ్గిస్తుంది ఇంగువ. ఇలా కడుపు ఉబ్బరాన్ని తగ్గించే పదార్థాలని యాంటీ ఫ్లాట్యులెంట్స్‌ అంటారు. ఇంగువ అలాంటి యాంటీ ఫ్లాట్యులెంట్స్‌లో ఒకటి.

- కేవలం కడుపు ఉబ్బరాన్నే కాదు! జీర్ణసంబంధమైన సమస్యలెన్నింటిలోనో ఇంగువ అమోఘంగా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం పిత్తదోష కారణంగా ఏర్పడే అరుచి, అజీర్ణం, ఆకలి లేకపోవడం లేకపోవడం వంటి సమస్యలకు ఇంగువ దివ్యౌషధం. ఆఖరికి కడుపు లోపల అయిన గాయాలను మాన్పే శక్తి కూడా ఇంగువకు ఉందని పరిశోధనల్లో తేలింది.

- అటు ఆయుర్వేదంలోనే కాకుండా ఇటు యునానీలో కూడా ఇంగువ ప్రాధాన్యత అంతాఇంతా కాదు. ముఖ్యంగా ఫిట్స్‌ వంటి మానసిక సంబంధమైన వ్యాధులకు మందుగా యునానీ వైద్యులు ఇంగువను వాడుతుంటారు.

- ఆడవారిలో రుతుసంబంధమైన సమస్యలకు ఇంగువ విరుగుడుగా పనిచేస్తుందని నమ్ముతారు. రుతుచక్రం సరిగా లేకపోవడం, రుతుక్రమ సమయంలో కడుపునొప్పి వంటి ఇబ్బందులను ఇంగువ సరిచేస్తుంది. అందుకే కొంతమంది బాలింతలకు ఇంగువను ఇస్తుంటారు.

- ఇంగువ ఇటు పొడిదగ్గు, అటు కఫంతో వచ్చే దగ్గలకు ఉపశమనంగా నిలుస్తుంది. ఆస్తమా, బ్రాంకైటిస్‌ వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులలోనూ ఉపయుక్తంగా ఉంటుంది. ఇక తీవ్ర పడిశాన్ని (Influenza) కలిగించే H1N1 అనే వైరస్‌ను ఇంగువ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని తేలింది.

- ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా షుగర్‌ వ్యాధి బాధలు కనిపిస్తున్నాయి. ఈ చక్కెర వ్యాధిని అదుపుచేయడంలో ఇంగువ తనదైన పాత్రను పోషించగలదంటున్నారు. ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచడం ద్వారా ఇంగువ, రక్తంలో చక్కెర నిల్వలని అదుపు చేస్తుందని చెబుతున్నారు.

- ఇంగువలో coumarin అనే రసాయనాలు ఉన్నాయట. ఈ కౌమరిన్‌లకు రక్తాన్ని పలచన చేసే ప్రభావం ఉంటుంది. దీని వల్ల రక్తం గడ్డకట్టి గుండెపోటుకి దారితీసే పరిస్థితి నుంచి బయటపడవచ్చు. రక్తంలో కొలెస్టరాల్‌ పేరుకోకుండా నివారించవచ్చు.

- ఇంగువకి ఒంటి నొప్పులను నివారించే గుణం ఉందంటున్నారు. ముఖ్యంగా ఓ పట్టాన మందులకు లొంగని మైగ్రెయిన్ తలనొప్పులు, రుతుక్రమంతో పాటు వచ్చే కడుపునొప్పులను ఇది హరిస్తుంది.

చెప్పుకొంటూ పోవాలే కానీ ఇంగువ ఇచ్చే అద్భుత ఫలితాల జాబితా చాంతాడంత ఉంటుంది. అందుకే దీనిని ఆయుర్వేదం, హోమియోపతి, యునాని వంటి అన్ని సంప్రదాయ వైద్యాలలోనూ వాడుతుంటారు. ఇంగువని మన వంటకాల్లో చేర్చడం వల్ల పైన పేర్కొన్న లాభాలన్నీ ఎంతో కొంత కలుగుతూనే ఉంటాయి. అలా కాకుండా చిటికెడంత ఇంగువని గోరువెచ్చటి నీళ్లలోనో, మజ్జిగలోనో తీసుకున్నా ప్రయోజనం ఉంటుంది. ఇంగువను ప్రత్యేకించి ఒక ఔషధిగా తీసుకోవాలంటే మాత్రం ఎవరన్నా తెలిసిన ఆయుర్వేద వైద్యుని సంప్రదించడం మంచిది.

- నిర్జర.

By
en-us Political News

  
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఏ పనులైనా చేయవచ్చు, ఎంత డబ్బు అయినా సంపాదించుకోవచ్చు. కానీ నేటికాలంలో డబ్బు...
వేసవి కాలంలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం అనే ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల కాల్షియం..
పంచదార.. నేటికాలంలో చాలా విరివిగా వాడుతున్నారు. కాఫీ, టీ,  స్వీట్లు,  ఇంట్లో చేసే తీపి పదార్థాలు, డిజర్ట్ లు.. ఇలా చాలా తీపి పదార్థాల తయారీలో పంచదారది అగ్రస్థానం.  కాఫీ, టీ ల విషయాని వస్తే.. రోజులో కప్పుల..
వేసవి కాలం వచ్చిందంటే చల్లదనాన్ని వెతుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగమే ఈత కూడా.. ఇప్పట్లో చిన్న పట్టణాల నుండి పెద్ద నగరాల వరకు చాలా చోట్ల స్విమ్మింగ్ ఫూల్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు...
ఆరోగ్యంగా ఉండటానికి నీరు త్రాగడం మంచిదని చెబుతారు.  నీకు ఎంత తాగితే ఆరోగ్యం అంత బాగుంటుందని కూడా చెబుతారు. ఆరోగ్య  నిపుణులు రోజుకు  8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తున్నారు...
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఒక్కోరకం కూరగాయలలో ఒకో రకం పోషకాలు ఉంటాయి.  కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి.  అలాంటి కూరగాయలలో బ్రోకలీ కూడా ఒకటి.  చూడటానికి ఆకుపచ్చ రంగులో..
మండే వేసవి ఎండ నుండి తప్పించుకోవడానికి గంటల తరబడి ఏసీ ముందు కూర్చోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఇది సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ, ఈ అలవాటు  శరీరంపై రహస్యంగా..
భారతీయులు చాలామంది రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగుతూ ఉంటారు. ఆయుర్వేదపరంగా పసుపు పాలు ఎంతో ఆరోగ్యకరమైనవి.  పసుపు పాలలో ఉన్న ప్రయోజనాల కారణంగా వీటిని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు...
గుండె శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. దానిని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది తమకు తెలియకుండానే కొన్ని అలవాట్లు అలా కంటిన్యూ చేస్తుంటారు...
భారతీయ వంటగదిలో వెల్లుల్లి ఒక ముఖ్యమైన పదార్థం. వెల్లుల్లి లేకుండా చాలా కూరలకు ఆ రుచి ఉండదు. కానీ వెల్లుల్లి కేవలం రుచిని పెంచేది మాత్రమే కాదు, చాలా వ్యాధులకు ఔషధం కూడా. ఆయుర్వేదం వెల్లుల్లిని వైద్య చికిత్సలో ఉపయోగిస్తుంది.
మానవ శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. శరీరంలో కనిపించే చాలా లక్షణాలను చాలా సార్లు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇలా శరీరంలో కనిపించే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం అనేది  కొన్నిసార్లు మూత్రపిండాల వైఫల్యానికి సంకేతాలు కావచ్చని వైద్యులు..
నేటికాలంలో చాలామంది ఆరోగ్య స్పృహతో ఉంటున్నారు.  ఎంత బిజీగా ఉన్నా సరే.. తీసుకునే పండ్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు...
వేసవి కాలం రాగానే చాలామంది లైఫ్ స్టైల్ మారుతుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో, పానీయాల విషయంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పేమస్ పానీయం ఇది. అయితే దీని ప్రయోజనాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా ఇష్టంగా ఉపయోగిస్తారు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.